ట్రెడిష‌న్ + గ్లామ‌ర్.. అదీ క‌పూర్ బ్యూటీ ప్ర‌త్యేక‌త‌!

త‌న‌దైన అందం, ఫ్యాష‌న్ సెన్స్ తో మైమ‌రిపిస్తోంది జాన్వీ క‌పూర్. న‌టిగాను సుదీర్ఘ ప్ర‌యాణంలో ఎంతో పరిణ‌తిని సాధించింది.

Update: 2026-10-05 03:49 GMT

త‌న‌దైన అందం, ఫ్యాష‌న్ సెన్స్ తో మైమ‌రిపిస్తోంది జాన్వీ క‌పూర్. న‌టిగాను సుదీర్ఘ ప్ర‌యాణంలో ఎంతో పరిణ‌తిని సాధించింది. ఇక జాన్వీ తన ప్రతి అప్పియ‌రెన్స్‌తోనూ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఇటీవ‌ల అంబాసిడ‌ర్ గా ల‌గ్జ‌రీ బ్రాండ్స్ తో జాన్వీ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. తాజాగా ప్రముఖ గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ `మియు మియు` ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫొటోలు ఇంటర్నెట్‌లో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా, ట్రెండీగా కనిపించడంలో జాన్వీ తనకంటూ ప్రత్యేక శైలి ఉందని మరోసారి నిరూపించారు. ఈ అవుట్‌ఫిట్‌లో త‌ను ఎంపిక చేసుకున్న వస్త్రధారణ, పోజులిచ్చిన తీరు ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.




జాన్వీ కపూర్ తాజా మోడ్రన్ లుక్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్ట్‌పై జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ `డైయింగ్` అంటూ సరదాగా స్పందించగా.. పలువురు నెటిజన్లు ఇప్ప‌టివ‌ర‌కూ ఇదే నా ఫేవ‌రెట్ లుక్ అంటూ ప్రశంసించారు. ఫ్యాషన్ వర్గాల్లో ఈ అవుట్‌ఫిట్ గురించిన చర్చ జోరుగా సాగింది. గ్లామర్ ప్రపంచంలో ఈ క్యూట్ బ్యూటీ ప్రతి స్టైల్ స్టేట్ మెంట్ యూవతను ఇన్‌స్పైర్ చేసేలా ఉంటుందనడంలో సందేహం లేదు.




ఈ ఫొటోషూట్‌లో జాన్వీ హెయిర్ స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త‌న‌ హెయిర్ టెక్స్చర్ - స్టైలింగ్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. కామెంట్ సెక్షన్ అంతా రెడ్ హార్ట్స్ - ఫైర్ ఎమోజీలతో నిండిపోయింది. డ్రెస్సింగ్ సెన్స్‌లో జాన్వీ రోజురోజుకూ చూపుతున్న పరిణతిని, గ్లామర్‌తో పాటు స్పెష‌ల్ అప్పీల్‌ను మెయింటైన్ చేస్తున్న విధానాన్ని అభిమానులు కొనియాడుతున్నారు.




ఈ పోస్ట్ తో జాన్వీ మరోసారి గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్స్‌కు తానే పర్ఫెక్ట్ ఛాయిస్ అని నిరూపించారు. ఈ అందాల భ‌రిణె బాడీ లాంగ్వేజ్ .. కాన్ఫిడెన్స్ ఈ లుక్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఈ స‌రికొత్త రూపం చూసాక‌.. సింపుల్ యాక్సెసరీస్‌తో హై-ఎండ్ ఫ్యాషన్‌ను ఎలా క్యారీ చేయాలో జాన్వీని చూసి నేర్చుకోవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి `మియు మియు` లుక్ కుర్ర బ్యూటీ ఫ్యాషన్ జర్నీలో మరో మైలురాయిగా నిలిచింది.




2026 సంవత్సరంలో జాన్వీ కపూర్ పలు క్రేజీ సినిమాల‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన `పెద్ది`చిత్రం జూన్ లో విడుదలైంది. త‌దుప‌రి అల్లు అర్జున్ రాకా చిత్రంలోను జాన్వీ అతిథి పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనికి అధికారికంగా మ‌రింత‌ క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే హిందీలో వస్తున్న `లాగ్ జా గలే`పైనా ఆస‌క్తి నెల‌కొంది. వైవిధ్యమైన కథాంశాలతో దూసుకెళ్తున్న జాన్వీ మునుముందు న‌టిగా త‌న స్టార్ డ‌మ్ ని మ‌రింత విస్త్ర‌తం చేయ‌నుంది.

Tags:    

Similar News