మూవీలో ఒక క్యారెక్టర్ ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఈ మూడు విషయాలను ఫాలో అవ్వండి...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు తను చేసే సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు.

Update: 2026-10-05 03:24 GMT

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు తను చేసే సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగేలా సినిమాలు తీయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు... సినిమా కథలు అద్భుతంగా రాసుకున్నప్పటికి అందులోని క్యారెక్టర్స్ ను కూడా డిఫరెంట్ గా డిజైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక దానికి తోడుగా సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ ఎక్కువ కాలం పాటు గుర్తు ఉండాలి అంటే ఆ క్యారెక్టర్ రాసేటప్పుడు అందులో కొన్ని విషయాలను పర్ఫెక్ట్ గా పొందుపరిచి రాయాల్సి ఉంటుంది. అవేంటనేది మనం ఒకసారి తెలుసుకుందాం...

ఇంపర్ఫెక్ట్ క్యారెక్టర్

ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు వాళ్ళు మంచివాళ్ళు అందరికీ మంచి చేస్తారని రాయకుండా ఆ క్యారెక్టర్ లో ఉన్న డార్క్ షేడ్స్ ని చూపిస్తూ క్యారెక్టరైజేషన్ ను బిల్డ్ చేసుకుంటే ఆ పాత్ర ఎక్కువ కాలం పాటు గుర్తుండిపోయే అవకాశాలైతే ఉంటాయి. అంటే హీరో అసూయ తో రగిలిపోతుండటం, చెడుపని చేసైనా సరే తను ఎదగాలని అనుకుంటాడు లాంటివి పెడితే ఆ క్యారెక్టర్ కి ఇంకా డెప్త్ పెరుగుతుంది. ఉదాహరణకి పుష్ప సినిమాలో పుష్ప రాజ్ క్యారెక్టర్ స్మగ్లింగ్ చేసైనా సరే తన ఐడెంటిటిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ క్యారెక్టర్ స్టెప్ బై స్టెప్ ఎలా ఎదిగాడనేది చూపిస్తే క్యారెక్టర్ లో ఉన్న నెగిటివిటి పోయి క్యారెక్టర్ మీద ఒక ఇంప్రెషన్ పెరుగుతుంది. దానివల్ల ఆ క్యారెక్టర్ లో ఉన్న సోల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది...

మిస్టరీ

ఒక పాత్ర గురించి చెప్పేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొన్ని హైడ్ చేస్తుండాలి. దానివల్ల వీడు ఇంతకు ముందు ఏం చేసేవాడనే విషయం తెలుసుకుంటే బాగుండేదనే ఫీల్ ప్రేక్షకుడికి కలుగుతుంది. ఉదాహరణకి ఖైదీ సినిమాలో కార్తీ క్యారెక్టర్... ఆయన జైలు కి వెళ్ళాడు అక్కడి నుంచి బయటికి వచ్చాడనేది మాత్రమే ఆడియన్ కి చూపిస్తాడు. కానీ తను జైలు కి ఎందుకు వెళ్లాడనేది ఎక్కడ చెప్పరు. మనం ఎంత దాచి పెడితే ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలనే కోరిక ప్రేక్షకుల్లో అంత ఎక్కువగా పెరుగుతుంది...

డిస్టింక్టివ్ ట్రేట్స్

మనం రాసే క్యారెక్టర్ల బాడీ లాంగ్వేజ్ లో గానీ, డైలాగ్ డెలివరీ లో గానీ ఏమైనా డిఫరెంట్ ట్రేట్స్ ఉన్నాయా దానివల్ల కూడా ఆ క్యారెక్టర్ ఎక్కువగా గుర్తుండిపోవడానికి అవకాశమైతే ఉంటుంది...

ఉదాహరణకి పుష్ప సినిమాలో హీరో లెఫ్ట్ హ్యాండ్ పైకి వెళ్ళిపోయి ఉంటుంది. అలాగే పుష్ప మాట్లాడేటప్పుడు నోట్లో గుట్కా వేసుకొని మూతి పైకి పెట్టి మాట్లాడతాడు కాబట్టి వాటి వల్ల కూడా క్యారెక్టర్ లో డెప్త్ పెరుగుతుంది. వాళ్ల ఆక్టివిటీ వల్ల వాళ్లు ఎక్కువ రోజులు గుర్తుండిపోతారు...

Tags:    

Similar News