వారణాసి.. ఎంత చెప్పాలో అంతే..
రాజమౌళి సినిమా అంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచి రిలీజ్ వరకు ఒక ఐరన్ కాంపౌండ్ లాంటి సెక్యూరిటీ ఉంటుంది.
రాజమౌళి సినిమా అంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచి రిలీజ్ వరకు ఒక ఐరన్ కాంపౌండ్ లాంటి సెక్యూరిటీ ఉంటుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ టైమ్ లో ఎవరెంత మాట్లాడాలో ఆయన కంట్రోల్ లోనే ఉండేది. కానీ మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' ప్రాజెక్ట్ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. సినిమా గురించి టీమ్ నుంచి చిన్న చిన్న అప్డేట్స్ రెగ్యులర్ గా బయటకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా బ్యాక్ డ్రాప్ పై అసలు హింట్ మొదట రైటర్ విజయేంద్ర ప్రసాద్ నుంచే వచ్చింది. ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ అని ఆయన చెప్పగా.. ఆ తర్వాత స్వయంగా రాజమౌళే గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ అంటూ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. దీనికి తోడు మహేష్ బాబు కూడా ఆఫ్రికా షెడ్యూల్స్, అడవుల్లో షూటింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి ఓపెన్ గా మాట్లాడటంతో సినిమా థీమ్ ఏంటనేది జనాలకు ఈజీగా అర్థమైపోయింది.
మరోవైపు ఎప్పుడూ తన పనేదో తాను సైలెంట్ గా చేసుకుపోయే సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఈసారి తన పంథా మార్చారు. సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని, మ్యూజిక్ వర్క్ ఎంతవరకు వచ్చిందో కచ్చితమైన వివరాలు బయటపెట్టారు. గతంలో జక్కన్న సినిమాల్లో సాంగ్స్ కౌంట్ రిలీజ్ టైమ్ వరకు సస్పెన్స్ గానే ఉండేది. కానీ ఏకంగా 2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్ అంటూ కీరవాణి ముందే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక యాక్షన్ ఎపిసోడ్స్ మీద రీసెంట్ గా ఎస్ఎస్ కార్తికేయ ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్, బాహుబలిని మించేలా సీట్ ఎడ్జ్ యాక్షన్ ఉంటుందని ఆయన చెప్పగా.. తన క్యారెక్టర్ లో కూడా హెవీ స్టంట్స్ ఉంటాయని హీరోయిన్ ప్రియాంక చోప్రా ముందే ఒక క్లూ ఇచ్చింది. ఇలా టీమ్ లోని ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ ను రివీల్ చేస్తుండటంతో, ప్రేక్షకుడి మైండ్ లో 'వారణాసి' కాన్వాస్ పై ఒక స్ట్రాంగ్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది.
అయితే బయటపడుతున్న ఈ విషయాలన్నీ కథను డ్యామేజ్ చేసే లీకులు ఏమాత్రం కాదు. ఎవరెన్ని చెప్పినా మహేష్ మెయిన్ క్యారెక్టరైజేషన్, అసలు కాన్ఫ్లిక్ట్, స్టోరీలో వచ్చే మేజర్ ట్విస్టులు మాత్రం ఇంకా రాజమౌళి లాకర్ లోనే సేఫ్ గా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే జక్కన్న ఈసారి కండిషన్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చి, సినిమా బజ్ ను ఎప్పుడూ పీక్స్ లో ఉంచేలా పక్కా క్యాలిక్యులేటెడ్ గానే ఈ ఇన్ఫర్మేషన్ ను వదులుతున్నట్లు అనిపిస్తోంది.
గతంలో రాజమౌళి సినిమాల చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ నెలల తరబడి వెయిట్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో, సినిమా గురించి కంటిన్యూస్ గా బజ్ ఉండడం అవసరం. అందుకే రాజమౌళి లిమిట్స్ సడలించి, ప్రమోషన్ కు ఉపయోగపడే కంటెంట్ ను టీమ్ ద్వారానే బయటకు రప్పిస్తున్నారు. దీంతో వారణాసి పేరు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండేలా మాస్టర్ ప్లాన్ వేశారని అర్థమవుతోంది.