సురేష్ బాబు సైలెంట్ వెనుక అసలు లెక్క ఇదే!

టాలీవుడ్ లో నిర్మాత సురేష్ బాబు రూట్ ఎప్పుడూ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కథ, బడ్జెట్, మార్కెట్ లెక్కలన్నీ టేబుల్ మీద పక్కాగా తేలితే తప్ప ఆయన ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లరు.

Update: 2026-10-04 19:02 GMT

టాలీవుడ్ లో నిర్మాత సురేష్ బాబు రూట్ ఎప్పుడూ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కథ, బడ్జెట్, మార్కెట్ లెక్కలన్నీ టేబుల్ మీద పక్కాగా తేలితే తప్ప ఆయన ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లరు. ఒకప్పుడు ఇతర భాషల్లో సూపర్ హిట్టయిన కథలను వెంటనే లాక్ చేసి, లోకల్ నేటివిటీకి తగ్గట్లుగా రీమేక్ చేయడంలో సురేష్ ప్రొడక్షన్స్ ది తిరుగులేని ట్రాక్ రికార్డ్. దృశ్యం, గోపాల గోపాల, నారప్ప, ఓ బేబీ లాంటి సక్సెస్ ఫుల్ రీమేక్స్ ఆ కోవలో వచ్చినవే.

అయితే ఓటీటీ ఎంట్రీ తర్వాత పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. మలయాళంలోనో, తమిళంలోనో ఒక హిట్ టాక్ రాగానే తెలుగు ఆడియన్స్ సబ్ టైటిల్స్ తో క్షణాల్లో చూసేస్తున్నారు. దీంతో రీమేక్ లపై ప్రేక్షకుల్లో పాత క్యూరియాసిటీ కనిపించడం లేదు. మార్కెట్ లో వచ్చిన ఈ మార్పును గమనించే స్టార్ హీరోలు రీమేక్ వైపు చూడటమే మానేశారు. ఇండస్ట్రీలో అందరికంటే ముందే ఈ ట్రెండ్ ను గుర్తించిన నిర్మాతల్లో సురేష్ బాబు ముందు ఉంటారు.

సరిగ్గా ఇదే సూత్రం ఇప్పుడు 'దృశ్యం 3' దగ్గర కూడా కనిపిస్తోంది. వెంకటేష్ హీరోగా వచ్చిన మొదటి రెండు భాగాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే సాధించాయి. దీంతో మూడో పార్ట్ కూడా గ్యారెంటీగా తెలుగులోకి వస్తుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. అసలు ఇప్పటికే రెండు భాగాలు చూసేశాక, అదే ఇన్వెస్టిగేషన్ డ్రామాను మళ్లీ లాగితే ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనే డౌట్ ఓ వర్గం ఆడియెన్స్ లో ఉంది.

మరోవైపు సురేష్ బాబు బిజినెస్ స్టైల్ ప్రకారం.. కేవలం క్రేజీ ఫ్రాంచైజీ పేరుంది కదా అని కళ్ళు మూసుకుని బరిలోకి దిగరు. కథలో తెలుగు ఆడియన్స్ ను థ్రిల్ చేసే కొత్త పాయింట్ ఉందా లేదా, పెట్టే పెట్టుబడికి వెంకీ మార్కెట్ ఎంతవరకు సేఫ్ జోన్ లో ఉంటుందనే విషయాలను లోతుగా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. గతంలో 'మానాడు' రీమేక్ హక్కులు తీసుకున్నా, లెక్కలు తేలకపోవడంతోనే ఆ ప్రాజెక్ట్ ను సైలెంట్ గా హోల్డ్ లో పెట్టారు.

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ ఆలోచనలు కూడా వేరే ట్రాక్ లో ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ లో మరింత పట్టు సాధించారు. ఆదర్శ కుటుంబం తరహా సినిమాలతో తన బలమైన ఎంటర్ టైన్ మెంట్ జోన్ లోనే కొనసాగాలని చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో మళ్ళీ రీమేక్ ఫార్మాట్ లోకి వెళ్లి సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ కోసం డేట్స్ కేటాయించడం కంటే, ఫ్రెష్ కథలకే వెళ్ళడం బెటర్ అనే ఆలోచనలో ఉండి ఉండవచ్చు.

Tags:    

Similar News