తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ హీరోలు కరువయ్యారా... అప్పటితో పోలిస్తే ఇప్పుడెందుకు తగ్గిపోయారు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్లాస్ సినిమాలు చేయడానికి, అలాగే మాస్ సినిమాలతో అలరించడానికి కొంతమంది హీరోలైతే ఉన్నారు.

Update: 2026-10-05 03:23 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్లాస్ సినిమాలు చేయడానికి, అలాగే మాస్ సినిమాలతో అలరించడానికి కొంతమంది హీరోలైతే ఉన్నారు. కానీ లవర్ బాయ్ క్యారెక్టర్లను పోషించడానికి హీరోలెవ్వరు కనిపించడం లేదంటూ కొంతమంది దర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒకప్పుడు లవర్ బాయ్ క్యారెక్టర్ లను పోషించడానికి కొంతమంది హీరోలు ఉండేవారు. వాళ్లతో సినిమాలు చేస్తే చాలు ఆ సినిమాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది. అలాగే లేడీస్ లో కూడా వాళ్లకు విపరీతమైన క్రేజ్ ఉండేది. కాబట్టి వాళ్ల సినిమాలు ఈజీగా సక్సెస్ లను సాధించేవి. అందువల్లే దర్శక నిర్మాతలు ఆ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. అలాంటి రోజులు ఇప్పుడు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమాతో సక్సెస్ ను సాధించిన హీరో సైతం తన రెండో సినిమాగా మాస్ మూవీ మాత్రమే చేస్తున్నాడు. ఎవరిని చూసినా మాస్ హీరోగా మారిపోతున్నారు. ఒకప్పుడు తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు లవర్ బాయ్ క్యారెక్టర్లను పోషిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేవారు. వాళ్ల సినిమాలు వస్తున్నాయంటే చాలు మంచి లవ్ స్టోరీ తో వచ్చే సినిమాలే అని ప్రేక్షకులు పూర్తిగా ఫిక్స్ అయిపోయి ఆ సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు... కాలక్రమేనా ఈ హీరోలు కనుమరుగైపోవడంతో ఆ బాధ్యతను తీసుకునే హీరోలు కనిపించకుండా పోయారు. అడపదడపా లవ్ స్టోరీ సినిమాలు వస్తున్నప్పటికి ఎవరు కూడా లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకొలేకపోతున్నారు. నిజానికి ఒకప్పుడు తరుణ్, ఉదయ్ కిరణ్ మధ్య విపరీతమైన పోటీ ఉండేది. వీళ్ళిద్దరు తన సినిమాలతో స్టార్ హీరోల సినిమాలకు సైతం పోటీని ఇచ్చేవారు. ఎందుకంటే యూత్ లో వీళ్ళకున్న ఫాలోయింగ్ వల్ల యూత్ ఆడియన్స్ మొత్తం మొదటి రోజు వీళ్ల మూవీస్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపించేవారు.

ప్రస్తుతం ఒక క్యారెక్టర్లోని ఫీలింగ్స్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ ప్రేక్షకుడికి నచ్చేట్టుగా చెబుతూ లవర్ బాయ్ క్యారెక్టర్ ను పోషించే హీరో అయితే లేడు. ఇప్పటికిప్పుడు ఒక ప్యూర్ లవ్ స్టోరీ తో మూవీ చేద్దాం అంటే అందులో నటించడానికి ఒక్క హీరో కూడా కనిపించడం లేదు. ఇది ఇండస్ట్రీకి ఒక తీరని లోటనే చెప్పాలి. ఇన్ని సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో కనీసం పర్ఫెక్ట్ లవర్ బాయ్ క్యారెక్టర్ ను పోషించే హీరోలను కూడా మనం తయారు చేసుకోలేకపోయామా? అనే దోరణిలో మరి కొంతమంది విమర్శకులు సైతం కొన్ని విమర్శలనైతే చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే హీరోలు ఉండాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలిగే కథలతో సినిమాలు రావాలి. అలాంటప్పుడే ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఎంటర్ టైన్ అవుతారు...

అంతేతప్ప స్టార్ హీరోలందరు మాస్ హీరో అవ్వాలనే ఉద్దేశ్యంతో అందరు ఒకే రకం కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తే అన్ని ఒకే తరహా మూవీస్ వస్తాయి. దానివల్ల ప్రేక్షకుడు అన్ని రొటీన్ మూవీస్ వస్తున్నాయని ఆ సినిమాలను పట్టించుకునే ప్రయత్నం కూడా చేయడు. అందువల్లే డిఫరెంట్ గా సినిమాలను ట్రై చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది... దాని కోసం అన్ని రకాల హీరోలను తయారు చేసుకోవాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీ పైన ఉంది... లేకపోతే రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ లో కొన్ని జానర్స్ లోనే సినిమాలు వస్తాయి. దానివల్ల కొన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాల నుంచి పూర్తిగా దూరమైపోయే అవకాశం కూడా ఉంది...

Tags:    

Similar News