పవన్ 'ఉస్తాద్'.. OG కన్నా తక్కువ తీసుకున్నారా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.;

Update: 2026-03-07 07:28 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మార్చి 19వ తేదీన ఉగాది కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. పవర్ స్టార్ నటించిన గత సినిమా ఓజీ కన్నా తక్కువ తీసుకున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సుజీత్ తెరకెక్కించిన ఓజీ చిత్రానికి పవన్.. రూ.80 కోట్లు- రూ.100 కోట్లు అందుకున్నారని కొన్ని రోజుల క్రితం టాక్ వినిపించింది.

కానీ ఇప్పుడు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి రూ.25 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఏంటి అంత తక్కువ తీసుకున్నారా అంటూ పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. పవన్ రేంజ్ కు ఆ పారితోషికం బాగా తక్కువ అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు.

అదే సమయంలో మరో విషయం కూడా వైరల్ గా మారింది. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాక వచ్చిన లాభాల్లో షేర్ ఇవ్వాలని నిర్మాతలకు పవన్ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమా రిజల్ట్ పై పవన్ పారితోషికం ఆధారపడిందని చెప్పాలి. అందుకే మూవీ ఎలాంటి హిట్ అవుతుందనేది ఆసక్తికరం.

అయితే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మేకర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని అభిమానులు, సినీ ప్రియులు అంతా ఆశిస్తున్నారు.

కాగా, సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్సెస్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ కూడా దాన్ని పెంచేందుకు స్పెషల్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుస అప్డేట్స్ తో సందడి చేయనున్నట్లు సమాచారం. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. మరోవైపు ప్రమోషన్స్ ను నిర్వహిస్తారని వినికిడి. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో.. ఎంతటి లాభాలను సంపాదిస్తుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News