అనసూయ న్యూ లుక్ వైరల్.. జిమ్ సెల్ఫీతో ఫ్యాన్స్ ఫిదా

బుల్లితెరపై యాంకర్‌గా తనదైన గళంతో అల్లరించి, వెండితెరపై పవర్‌ఫుల్ నటనతో మెప్పించే అందాల భామ అనసూయ భరద్వాజ్ తాజాగా పోస్ట్ చేసిన జిమ్ సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Update: 2026-09-26 07:20 GMT

బుల్లితెరపై యాంకర్‌గా తనదైన గళంతో అల్లరించి, వెండితెరపై పవర్‌ఫుల్ నటనతో మెప్పించే అందాల భామ అనసూయ భరద్వాజ్ తాజాగా పోస్ట్ చేసిన జిమ్ సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. "ఈ రోజు మీరు వర్కౌట్ చేశారా?" అంటూ ఆమె పంచుకున్న లేటెస్ట్ జిమ్ పిక్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కొత్త హెయిర్‌స్టైల్‌తో, చెమటతో మెరుస్తూ గ్లామరస్ వైబ్స్ ఇస్తున్న అనసూయ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.




 


అడిడాస్ లెగింగ్స్ లుక్ :

తాజా జిమ్ సెల్ఫీ కోసం అనసూయ అడిడాస్ ఆప్టైమ్ ట్రేనింగ్ ఫ్లవర్ టైట్స్ ధరించింది. నలుపు, పింక్, మౌవ్ షేడ్స్‌లో అబ్‌స్ట్రాక్ట్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఈ హై-రైజ్ లెగింగ్స్‌కు మ్యాచింగ్‌గా క్లాసిక్ బ్లాక్ స్పోర్ట్స్ బ్రా ధరించింది. ఇక వ్యాయామం చేసే సమయంలో చేతులకు రక్షణగా బ్లాక్ ఫింగర్‌లెస్ జిమ్ గ్లోవ్స్ ధరించి ఎంతో పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ లుక్‌లో కనిపించింది.




 


"హెయిర్ మార్చాను.. ఫైర్ అలాగే ఉంది" అంటూ క్యాప్షన్:

ఈ జిమ్ పిక్స్‌ను షేర్ చేస్తూ అనసూయ "సో!! ఈరోజు మీరు వర్కౌట్ చేశారా? పిఎస్: హెయిర్ స్టైల్ మార్చాను.. కానీ నాలోని ఫైర్ అలాగే ఉంది" అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ఇక కొత్త షార్ట్ వేవీ హెయిర్‌స్టైల్‌తో కెమెరా వైపు చూస్తూ కన్నుగీరిన ఆ పిక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. "అమేజింగ్", "నైస్", "ఇగ్నైటెడ్ ఎనర్జీ" అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

బుల్లితెర నుంచి వెండితెర వరకు ప్రయాణం :

'జబర్దస్త్' షోతో యాంకర్‌గా తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ, 'క్షణం' సినిమాతో నటిగా అడుగుపెట్టింది. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా, 'పుష్ప' చిత్రంలో దాక్షాయిని పాత్రలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. 'రంగమార్తాండ', 'మైఖేల్' వంటి చిత్రాలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది.

క్రేజీ ప్రాజెక్టులలో నటన :

ఇటీవల అనసూయ నటిగా ఫుల్ బిజీగా మూవీస్ చేసినది.వాటిలో 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రంలో లీలవతి పాత్రలో మెప్పించింది. అలాగే 'అరి: మై నేమ్ ఈజ్ నోబడీ', 'హరి హర వీరమల్లు' చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ తో అలరించింది. ఇక తమిళంలో 'వూల్ఫ్', 'ఫ్లాష్‌బ్యాక్' వంటి సినిమాలతో తన దూకుడును కొనసాగిస్తోంది. ఇప్పుడు ఫిట్‌నెస్, గ్లామర్ అండ్ యాక్టింగ్‌ను బాలెన్స్ చేస్తూ నిత్యం ట్రెండింగ్‌లో ఉండే అనసూయ భరద్వాజ్, రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులతో అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News