ఒక సినిమా ప్లాపైతే హీరో - డైరెక్టర్ మధ్య అంతకు ముందున్న రిలేషన్ షిప్ మారిపోతుందా..?
సినిమా ఇండస్ట్రీలో హీరో - డైరెక్టర్ల మధ్య చాలా మంచి రిలేషన్ షిప్ ఉంటుంది. దానివల్లే వాళ్ళు చేసే సినిమాలు అద్భుతంగా రావడానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
సినిమా ఇండస్ట్రీలో హీరో - డైరెక్టర్ల మధ్య చాలా మంచి రిలేషన్ షిప్ ఉంటుంది. దానివల్లే వాళ్ళు చేసే సినిమాలు అద్భుతంగా రావడానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే సక్సెస్ వస్తే బాగానే ఉంటుంది. కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం హీరో డైరెక్టర్ల మధ్య కొన్ని విభేదాలు వస్తాయనే వార్తలు బయట స్ప్రెడ్ అవుతుంటాయి తప్ప నిజానికి ఎవరు ఎవరి మీద విభేదాలు చూపించరు... ఆ పర్టిక్యూలర్ టైమ్ కి హీరో దర్శకుడు ఇద్దరు కలిసి ఒక కథను నమ్మి ట్రావెల్ చేశారు. దానికోసం ఎంత కష్టపడలో అంత కంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఒక ప్రయత్నం చేశారు. కానీ అది ప్రేక్షకుడికి అనుకున్న రీతిలో రీచ్ అవ్వనంత మాత్రాన అది డైరెక్టర్ ఫెయిల్యూర్ గానో లేదంటే హీరో ఫెయిల్యూర్ గానో భావించరు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ హీరోలు గాని దర్శకులు గానీ ఇలాంటివేమి మనసులో పెట్టుకోకుండా ఆ సినిమా వరకు వాళ్లు పడిన కష్టం ప్రేక్షకుడికి రీచ్ అవ్వలేదు.
అంతే తప్ప మనం చేయాల్సిన ప్రయత్నమైతే చేశాం అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. హీరో - డైరెక్టర్ కాంబినేషన్లో ఒక సినిమా వచ్చి ఫ్లాప్ అయినప్పటికి ఒక మంచి కథ దొరికితే మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో సినిమాలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కూడా యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు ఒక మూవీ ప్లాప్ అయిన కూడా ఆ తర్వాత మరోసారి వాళ్లు జత కట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మొదటిసారి తడబడి సెకండ్ టైమ్ సక్సెస్ ని సాధించిన కాంబోలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినప్పుడు ఉన్నంత జోష్ ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడైతే ఉండదు అది మాత్రం వాస్తవం.
కానీ వాళ్ళ మధ్య పర్సనల్ రిలేషన్ షిప్ చెడిపోయేంత విభేదాలైతే ఏమీ ఉండవు అందరు బాగానే మాట్లాడుకుంటారు. హీరో డైరెక్టర్స్ అందరూ బ్రదర్స్ ల కలిసిపోయి ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మన స్టార్ హీరోలు దర్శకులు పాన్ ఇండియాలో సినిమాలను చేస్తు సక్సెస్ లను సాధిస్తూ మిగతా ఇండస్ట్రీ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా మారుతున్నారు. మరిన్ని కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడానికి మనవాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నారు...