మోడీతో రాహుల్ అలా...కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇలా !
| ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గంటకు పైగా భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో కరువు పరిస్థితులు, ఆర్థిక సాయం, ఖేలో ఇండియా కార్యక్రమానికి రావాలని రేవంత్ కోరారు. మరోవైపు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా మోడీతో సన్నిహితంగా మెలిగారు. కాంగ్రెస్ అగ్రనేతలు మోడీని విమర్శిస్తున్నా, ఆ పార్టీ సీఎంలు ఆయనతో సాన్నిహిత్యంగా ఉండటం ఆసక్తి రేపుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో ఆకర్షణ మంత్రం ఏదో ఉంది. ఆయన అందుకే ఈ రోజుకీ ఓటమి ఎరగని నేతగా ఉన్నారు. పాతికేళ్ళ పాటు ప్రభుత్వ సారధిగా ఉన్నారు. అందులో పదమూడేళ్లు ముఖ్యమంత్రిత్వం ఉంటే మరో పన్నెండేళ్ళు ప్రధానమంత్రి త్వం ఉంది. ఇక మోడీ ముఖ్యమంత్రి నుంచి ప్రధాని అయ్యారు. అయితే ఆయన తన పర భేదాలు లేకుండా వివిధ పార్టీల ముఖ్యమంత్రులకు అపాయింట్మెంట్లు ఇస్తారు. వారితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఆయా రాష్ట్రాలకు వెళ్ళినపుడు వారితో కలిసి వేదికల మీద ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సంభాషిస్తారు. అభివృద్ధి మంత్రంతో పాటు మోడీ మంత్రం కూడా ఇందులో ఉంది అని అంతా అంటారు.
రేవంత్ తో గంట సేపు :
ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలో నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట సేపు పైగా భేటీ అయి అనేక అంశాల గురించి చర్చించడం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఒక ప్రధాని ఒక ముఖ్యమంత్రి కలిసి చర్చించడంలో ఆసక్తి ఏమి ఉంటుంది అనుకోవచ్చు. నిజమే సమాఖ్య వ్యవస్థలో ప్రధానితో ముఖ్యమంత్రుల సమావేశాలు సహజమైనవి. అయితే ఇందులో కూడా రాజకీయ పరమైన అంతరాలు ఉంటాయని గత అనుభవాలు నిరూపించాయి. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులకు సాధారణంగా ప్రధానులు ఎక్కువ సమయం ఇవ్వరని కూడా ఉంది. అందుకే చెప్పాల్సింది ఏదో చెప్పేసి వారు చెప్పేసి వెళ్తారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డికి ప్రధాని గంటకు పైగా సమయం కేటాయించారు. ఈ ఇద్దరి భేటీలో ఖేలో ఇండియా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని నరేంద్ర మోడీని రేవంత్ మోదీని ఆహ్వానించారని తెలుస్తోంది. అలాగే తెలంగాణాలో ఎల్ నినో తో 161 మండలాలు తీవ్ర కరువుతో ఇబ్బంది పడుతున్నాయని మోడీ దృష్టికి రేవంత్ రెడ్డి తెచ్చారు. తమ రాష్ట్రాన్ని అన్ని విధాలుగానూ, ఆర్థికంగానూ ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రధానికి వినతి చేసారు. రేవంత్ రెడ్డి వినతులకు మోడీ సానుకూలంగా స్పందించారు అని చెబుతున్నారు.
డీకే సైతం :
ఇక కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తన రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీతో వేదిక పంచుకుని ఎన్నో విషయాలను ముచ్చటించారు. తమ రాష్ట్ర సమస్యలను కూడా మోడీకి వివరించినట్లుగా డీకే శివ కుమార్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని తో కలిసి పనిచేస్తామని కూడా డీకే స్పష్టం చేశారు. ఇక మోడీతో డీకే సరదాగా సంభాషించిన దాని మీద కూడా మీడియాలో చర్చ వచ్చింది. అయినా సరే సమాఖ్య వ్యవస్థలో ఇది అవసరం అని డీకే క్లారిటీ ఇచ్చారు.
మోడీ అంటేనే మరి :
ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోడీ అంటేనే మండిపడుతూంటారు. అయిన దానికీ కానిదానికీ మోడీని మధ్యలోకి తెచ్చి మరీ విమర్శిస్తారు అని అంటారు. మోడీని ఆయన అనేక రకాలుగా నిందిస్తూ ఉంటారని బీజేపీ నేతలు కూడా ఫైర్ అవుతూంటారు. ఇక సోనియా గాంధీ ఆత్మ కధలో కూడా మోడీని తనతో పెద్దగా మాట్లాడరు అని చెప్పిన వ్యాఖ్యానం ఉంది. ఇలా చూస్తే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మరీ ముఖ్యంగా గాంధీలు అంతా మోడీ పొడ గిట్టనట్లుగా ఉంటూంటే అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు మాత్రం మోడీతో ఎంతో బాగా ఉండడం అయితే రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతోంది. అయితే ఇందులో చెప్పుకోవడానికి ప్రత్యేకత ఏమీ లేదని ఇదంతా సీఎం పీఎం ల మధ్య ఉండే ప్రభుత్వ పరమైన లాంచనం మాత్రమే అని ఎంత చెప్పినా కూడా గతంలో వేరే పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు ప్రధానుల మధ్య ఇంత సయోధ్య లేదని కూడా గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మోడీ తీరు స్పెషల్ అనుకోవాల్సిందే.