• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెళ్లి పిలుపు ఓకే......

పెళ్లి పిలుపు ఓకే... షర్మిల వ్యూహం మీదనే ఎన్నో ప్రశ్నలు !

| ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయ వ్యూహాలపై చర్చ జరుగుతోంది. అధికార కూటమిని ప్రశ్నించడం కంటే వైసీపీ అధినేత జగన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు కుమార్తె పెళ్లి ఆహ్వానం ఇవ్వడం, టీడీపీ నేతల నుంచి మద్దతు లభించడం రాజకీయ చర్చకు దారితీశాయి. కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకుండా టీడీపీకి బీ-టీమ్‌గా మారుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

By - Satya P
Update: 2026-11-19 03:03 GMT

ఏపీలో కాంగ్రెస్ కి నామమాత్రం బలం కూడా లేదు. ఆ పార్టీ నేతల సౌండ్ పెద్దగా మీడియాలో వినిపించదు. కానీ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిలకి మాత్రం మీడియాలో మంచి హైప్ వస్తోంది. అది కాంగ్రెస్ పరంగా కాదు, టీడీపీ వైసీపీల మధ్య ఉన్న తీవ్ర స్థాయి రాజకీయ విభేదాల మధ్యలో షర్మిల ఉండడం వల్లనే అన్నది ఒక విశ్లేషణ. అందుకే షర్మిల ఏమి చేసినా అటూ ఇటూ అనుకూల వ్యతిరేక మీడియాలో కవరేజ్ వస్తూంటుంది. ఇంతకీ ఇది షర్మిల వ్యూహమా లేక అసలు రాజకీయం ఏమిటి అన్నది అయితే మాత్రం సగటు జనాల నుంచి ప్రశ్నల పరంపరగానే సాగుతోంది.

తప్పు పట్టాల్సింది లేదు :

ముఖ్యమంత్రి చంద్రబాబుకు పీసీసీ చీఫ్ హోదాలో తన కుమార్తె పెళ్ళి పత్రికను అందించడాన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మర్యాదపూరకమైన వ్యవహారం. అయితే దీని మీద వైసీపీ సొంత పత్రికలో వచ్చిన కధనాలే రాజకీయ మంట పుట్టించాయి. దాంతో రగిలిన షర్మిల తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా అని గట్టిగానే సదరు మీడియా సంస్థను వైసీపీ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు.ఇదే సమయంలో ఆమెకు మద్దతుగా మంత్రి నారా లోకేష్ నిలవడంతో రాజకీయం మరింత పాకాన పడింది. ఇక్కడ కుటుంబ సంప్రదాయాల ప్రకారం అన్న కోణంలో అయితే ఆమె చేసింది ఎవరూ నిందించాల్సింది లేదు. కానీ టీడీపీ మంత్రి నుంచి వెంటనే మద్దతుగా రావడంతోనే ఇది రాజకీయంగా వేరే మలుపు తీసుకుంటోంది అని అంటున్నారు. ఇక చూస్తే 2024 జనవరిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల గడచిన మూడేళ్ళ కాలంలో వేస్తున్న రాజకీయ అడుగులు ఆమె కాంగ్రెస్ నాయకురాలిగా అనుసరిస్తున్న వ్యవహార శైలి ఇవన్నీ కూడా ఈ తరహా కధనాలకు ఆస్కారం కలిగిస్తున్నాయేమో అన్న సందేహాలు సగటు జనంలో వ్యక్తం అవుతున్నాయి.

వైసీపీ పైనే ఎందుకు గురి:

ఏపీలో చూస్తే అధికారంలో ఉన్నది టీడీపీ కూటమి. విపక్షంలో ఉన్నది వైసీపీ. సహజంగా ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలు ఎవరిని ప్రశ్నించాలి అన్నది కీలక ప్రశ్న. కానీ పీసీసీ చీఫ్‌గా ఉన్న షర్మిల చేస్తున్న ప్రసంగాలు వేస్తున్న ట్వీట్లు గమనిస్తే ఆమె లక్ష్యం అధికార కూటమి కంటే ఎక్కువగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డే అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన మీద వారు ఇచ్చిన హామీల అమలు మీద ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలకు ఉంది కదా అని అంటున్నారు. అయినా సరే తన సోదరుడు జగన్ పైనే షర్మిల వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేయడం వెనుక ఆంతర్యమేమిటని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని టార్గెట్ చేయడం ద్వారా ఆమె ఏం సాధించాలనుకుంటున్నారనేది కూడా మరో ప్రశ్నగా ముందుకు వస్తోంది.

జగన్ ని విమర్శిస్తేనే :

ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాలలో కంటే ఆమె జగన్ ని టార్గెట్ చేసినపుడే టీడీపీ టీడీపీ అనుకూల మీడియాలో విపరీతమైన ప్రచారం ఎందుకు వస్తోంది అన్నది కూడా ఆలోచించాలి అంటున్నారు.ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో వివాహ వేడుకల అనుమతుల విషయంలో జగన్ షర్మిల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రెస్ మీట్ లో స్వయంగా షర్మిలకు మద్దతుగా నిలవడం అదే సమయంలో జగన్‌ను విమర్శించడం అందరికీ తెలిసిందే. ఇలా ఒకవైపు టీడీపీ అధినాయకత్వం మరో వైపు టీడీపీ అనుకూల మీడియా షర్మిలకు అండగా నిలవడం అన్నది చూస్తే తెరవెనుక ఏదో రాజకీయ అవగాహన నడుస్తోందన్న అనుమానాలకు ఆస్కారం ఉంటుంది కదా అన్నదే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్ బలోపేతం ఎక్కడ :

ఏ రాజకీయ పార్టీ అయినా తాము బలోపేతం కావాలని కోరుకుంటారు. ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ అలా ఏమైనా పెంచే కార్యక్రమాలు జరిగాయా అన్నది కూడా ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తానంటూ బాధ్యతలు చేపట్టిన షర్మిల నిజానికి ఆ దిశగా క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారన్నది మరో పెద్ద ప్రశ్నగా ఉంది. ఇక ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా బలహీనపడిన కాంగ్రెస్ క్యాడర్‌ను బలోపేతం చేయడం అదే విధంగా గ్రామీణ స్థాయిలో పార్టీ నిర్మాణం చేపట్టడం వంటి అంశాలపై షర్మిల దృష్టి పెట్టిన ఉదంతాలు ఉన్నాయా అన్నది సొంత పార్టీ వర్గాల్లోనే ప్రశ్నిస్తూ గుసగుసలు పోతున్న పరిస్థితి ఉంది.

టీడీపీకి బీ టీం గా :

ఎక్కడ కాంగ్రెస్ ఏమిటీ దుస్థితి అని ఏపీలో అసలైన కాంగ్రెస్ వాదులు చింతిస్తున్న నేపధ్యం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ టీడీపీల మధ్య ఢీ అంటే ఢీ అన్న రాజకీయాలను ఆంధ్ర నేల చూసింది. అలాంటి చోట అదే టీడీపీకి కాంగ్రెస్ ని బీ టీం గా మార్చేస్తున్నారా అన్న సందేహాలు మొదలైతే ఆ తప్పు ఎవరిది అన్నది కీలక ప్రశ్న. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ కేంద్రంలో ఉండగా ఇచ్చిన హామీ. దానికి సాధించకపోయిన కూటమిని నిలదీయాల్సి ఉంది. అలాగే పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, రైతుల కష్టాలు వంటి అంశాలపై అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం, జగన్ వ్యక్తిగత విమర్శల చుట్టూనే షర్మిల రాజకీయం తిరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ రకమైన రాజకీయాల వల్ల కాంగ్రెస్ టీడీపీకి 'బీ-టీమ్'లా ముద్రపడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

చేతల్లో చూపాలి :

ఎవరో ఏదో అన్నారని కాదు అలాంటి ముద్ర పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఏపీ నాయకత్వం మీద ఉంది అని అంటున్నారు. కుమార్తె పెళ్లికి ముఖ్యమంత్రిని ఆహ్వానించడం అనేది వ్యక్తిగత, కుటుంబ సంప్రదాయానికి సంబంధించిన విషయమే. కానీ, రాజకీయాల్లో ప్రజలు కేవలం ఒక సంఘటనను మాత్రమే కాకుండా నాయకుల మొత్తం ప్రవర్తనను, వారి రాజకీయ ప్రాధాన్యతలను బేరీజు వేసుకుంటారు. ఒక వైపు అధికార పక్షంతో సఖ్యతగా ఉంటూ, ప్రతిపక్ష నేతపైనే నిరంతరం కత్తులు దూస్తున్నారన్న విమర్శలకు షర్మిల తన చేతల ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. లేనిపక్షంలో పెళ్లి పిలుపును సైతం రాజకీయ కోణంలో చూసే పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ ఉంటాయని గుర్తు చేస్తున్నారు.

Tags:    
  • yssharmila 
  • apcongress 
  • tdp 
  • ysjagan 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS