• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరంజీవి 'కాకా' మూవీలో ఆ...

చిరంజీవి 'కాకా' మూవీలో ఆ పాత్రలో కనిపించబోతున్నారా?

| చిరంజీవి తొలిసారి ఫుల్ లెంగ్త్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం 'కాకా' సినిమాపై ఆసక్తి పెంచుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కలకత్తాను గడగడలాడించిన డాన్ తన గుర్తింపును మార్చుకోవాల్సిన పరిస్థితులు కథలో కీలకంగా ఉంటాయని టాక్. గతంలో 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవిని కొత్తగా చూపించిన బాబీ, ఈసారి కూడా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By - Gopi Velupala
Update: 2026-11-15 20:24 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలుగా ఎనలేని సేవలను అందిస్తూ ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి... ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రతి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న చిరంజీవి 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా అభిమానుల కోరిక మేరకు సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికి తన నుంచి వచ్చే సినిమాలు సగటు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయంటే ఆయన స్టోరీ సెలక్షన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు...

'కాకా' లో డాన్ గా చిరంజీవి

చిరంజీవి ఇప్పటివరకు ఫుల్ లెంత్ డాన్ క్యారెక్టర్ లో కనిపించలేదు. ఆయన చేసిన ప్రతి పాత్ర చాలా ప్రత్యేకంగా నిలిచాయి. ప్రస్తుతం బాబీ చిరంజీవిని డాన్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు. కలకత్తా నగరాన్ని అల్లల్లాడించిన ఒక డాన్ కొంతమందిని చంపడానికి తన ఐడెంటిటి మార్చుకోవాల్సి వస్తుందట. దానివల్ల ఆయన ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. ఫైనల్ గా డాన్ ఏం చేశాడనేది ఈ సినిమా స్టోరీ అంటూ సినీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

బాబీ డైరెక్షన్ లో ప్లస్ పాయింట్ అదే...

బాబీ రెగ్యూలర్ కమర్షియల్ కథలను తీసుకున్న కూడా దానిని చాలా ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేస్తాడు. అందుకే బాబీ డైరెక్షన్ లో నటించడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి ని 'వాల్తేరు వీరయ్య' సినిమాలో డిఫరెంట్ గా చూపించిన బాబీ కాకా లో మరోసారి కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకు ముందు బాలయ్య తో చేసిన 'డాకు మహారాజ్' సినిమా మేకింగ్ విషయంలో బాబీ చాలా క్లారిటీ మెయింటైన్ చేశాడు. అందుకే సినిమాలోని విజువల్స్ కానీ ఎమోషనల్ సన్నివేశాలను చాలా బాగా హ్యాండిల్ చేయగలిగాడు...

సీనియర్ హీరోలకు కమర్షియల్ డైరెక్టర్స్ కావాలా?

ఒకరకంగా సీనియర్ హీరోలందరు కెరీర్ స్టార్టింగ్ నుంచి కమర్షియల్ సినిమాలే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేసిన ప్రేక్షకుల నుంచి పూర్తి స్థాయిలో ఆదరణ వస్తుందనే నమ్మకం లేదు. కాబట్టి ప్రొడ్యూసర్ ను సేఫ్ జోన్ లో ఉంచే విధంగా కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఫర్ఫెక్ట్ గా చూపించే దర్శకుల వెంట పడుతున్నారు...

Tags:    
  • chiranjeevi 
  • megastar 
  • kaaka 
  • bobby 
  • waltairveerayya 
  • tollywood 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS