తండ్రీ-కూతుళ్ల మ‌ధ్య ఫైటింగా?

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, ఆయ‌న కుమార్తె సుహానాఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సిద్దార్ద్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `కింగ్` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-07 08:30 GMT

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, ఆయ‌న కుమార్తె సుహానాఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సిద్దార్ద్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `కింగ్` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా విష‌యంలో ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చాయి. తండ్రీ కుమార్తెల పాత్ర‌ల్లో ఎవ‌రి పాత్ర హైలైట్ అవుతుందంటే? కొంద‌రు షారుక్ పాత్ర‌గా పేర్కొన‌గా మ‌రికొంత మంది సుహానాఖాన్ పాత్ర హైలైట్ చేసారు. కుమార్తె కోసం షారుక్ ఖాన్ త‌న ఇమేజ్ ను సైతం ప‌క్క‌న బెట్టి చేస్తోన్న చిత్రంగానూ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇందులో ఏది నిజం? ఏది అబద్దం అన్న‌ది మ‌రికొన్ని రోజులు ఎదురు చూస్తేగానీ క్లారిటీ రాదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ గాసిప్ తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ముంబైలో ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం ప్ర‌త్యేకంగా ఓ భారీ సెట్ ను నిర్మించారు. అందులోనూ వంద‌లాది మంది మ‌ధ్య ఈ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఇదే యాక్ష‌న్ స‌న్నివేశంలో షారుక్ ఖాన్-సుహానాఖాన్ త‌ల ప‌డుతున్నారుట‌. ఇద్ద‌రి మధ్యా ఈ యాక్ష‌న్ స‌న్నివేశం త‌గ్గాఫ్ వార్ గా ఉంటుందంటున్నారు. దీంతో మ‌ళ్లీ నెగిటివ్ రోల్ అంశంపై చ‌ర్చ మొద‌లైంది.

తొలుత షారుక్ ఖాన్ నెగిటివ్ రోల్ లో క‌నిపించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కొన్ని రోజులకు అదంతా అవాస్త‌వ‌మ‌ని వార్త‌లొచ్చాయి. తాజా యాక్ష‌న్ స‌న్నివేశం నేప‌థ్యంలో సుహానాఖాన్ నెగిటివ్ రోల్ పోషిస్తుంద‌ని వార్త‌లొస్తున్నాయి. దీంతో ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య మ‌రోసారి క‌న్ప్యూజ‌న్ మొద‌లైంది. వీటిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు క్లారిటీ ఇవ్వ‌లేదు. మరి ఇప్పుడైనా స్పందిస్తారా? లేదా? అన్న‌ది చూడాలి. సుహానా శ‌క్తి వంత‌మైన పాత్ర‌లో క‌నిపిం చేందుకు అనేక యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను సాధ‌న చేసింద‌న్న‌ది స‌న్నిహితుల నుంచి అందుతోన్న స‌మాచారం.

అలాగే కింగ్ చిత్రాన్ని పూర్తి చేసే వ‌ర‌కూ మ‌రో సినిమాకు క‌మిట్ అవ్వ‌కూడ‌ద‌ని షారుక్ నిర్ణ‌యం తీసుకున్నారు. చివ‌రిగా ఆయ‌న హీరోగా న‌టించిన `డంకీ` రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్ప‌టి నుంచి చాలా క‌థ‌లు విన్నారు. వాటిలో `కింగ్` చిత్రాన్ని మాత్ర‌మే ఫైన‌ల్ చేసి ముందుకెళ్లారు. న‌చ్చిన చాలా క‌థ‌ల్ని హోల్డ్ లో పెట్టారు. `కింగ్` చిత్రం ఇప్ప‌ట్లో రిలీజ్ కాదు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్లోనే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా షూటింగ్ కూడా కంగారు ప‌డ‌కుండా నెమ్మ‌దిగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అనంత‌ర‌మే షారుక్ కొత్త సినిమా అప్ డేట్ ఏంటి? అన్న‌ది తెలుస్తుంది.

Tags:    

Similar News