ఒక్క మెసేజ్‌తో ప్రేయ‌సి జాన్వీ గుండె గిల్లిన ప్రియుడు

బాలీవుడ్ అతిలోక సుందరి జాన్వీ కపూర్.. ఆమె ప్రియుడు శిఖర్ పహారియా మధ్య ఉన్న ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది.;

Update: 2026-03-07 10:44 GMT

బాలీవుడ్ అతిలోక సుందరి జాన్వీ కపూర్.. ఆమె ప్రియుడు శిఖర్ పహారియా మధ్య ఉన్న ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా శిఖర్ పహారియా తన ప్రియురాలికి పంపిన ప్రేమపూర్వక సందేశం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా కానీ.. నిరంత‌రం ఏదో ఒక సంద‌ర్భంలో కలిసి కనిపిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.




 


జాన్వీ కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని శిఖర్ పహారియా ఒక క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ తన ప్రేమను చాటుకున్నారు. ఆ ఫోటోతో పాటు కేవలం `హ్యాపీ బర్త్‌డే` అని రాసి, పక్కన ఒక హార్ట్ ఎమోజీని జోడించారు. ఈ సందేశం చాలా సింపుల్‌గా ఉన్నా కానీ.. అందులో ఉన్న ఆత్మీయత నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తన ప్రియురాలికి ప్రత్యేకమైన రోజున ఇంత అందమైన విషెస్ చెప్పడంపై అభిమానులు ఫిదా అవుతున్నారు. శిఖర్ పహారియా ఎప్పుడూ జాన్వీకి వెన్నంటి ఉంటూ.. త‌న‌కు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్నారు. సినిమాల షూటింగ్స్ సమయంలో కానీ.. వ్యక్తిగత పర్యటనల్లో కానీ వీరిద్దరూ జంటగా కనిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా జాన్వీని విడిచి శిఖర్ ఉండలేరని, వారి మధ్య అంతటి ఘాఢమైన అనుబంధం ఉందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటుంటాయి.




 


వీరిద్దరి కెమిస్ట్రీని చూసి అభిమానులు కూడా ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాలని కోరుకుంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జాన్వీ తండ్రి బోనీ కపూర్ కూడా ఈ స్నేహాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు. శిఖర్ పహారియా తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోవడం.. జాన్వీ పట్ల ఆయన చూపే శ్రద్ధ బోనీ కపూర్‌కు నచ్చింది. గతంలో కూడా పలు సందర్భాల్లో బోనీ కపూర్... మంచి బాలుడు శిఖర్ గురించి సానుకూలంగా స్పందించారు. తండ్రి ఆశీస్సులు కూడా ఉండటంతో ఈ ప్రేమ పక్షులు తమ బంధంలో చాలా సంతోషంగా ఉన్నారు. సోషల్ మీడియాలో శిఖర్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

`సో క్యూట్` అని కొందరు, `పర్ఫెక్ట్ కపుల్` అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి దేవాలయాలను సందర్శించడం.. వెకేషన్లకు వెళ్లడం వంటి ఫోటోలు తరచుగా వైరల్ అవుతుండటంతో.. శిఖర్ లేటెస్ట్ బర్త్‌డే విష్ కూడా ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. జాన్వీ- శిఖర్ జంట‌ మధ్య ఉన్న ఈ స్వచ్ఛమైన ప్రేమకు ఇదొక నిదర్శనంగా నిలిచింది. మొత్తానికి జాన్వీ కపూర్ కెరీర్ పరంగా వరుస సినిమాలతో దూసుకుపోతుండ‌గా.. త‌న‌ వ్యక్తిగత జీవితంలో శిఖర్ పహారియా వంటి తోడు ఉండటం మరింత ధైర్యాన్ని ఇస్తోంది. అండగా నిలిచే ప్రియుడు, ప్రోత్సహించే తండ్రి వెంటే ఉండటంతో జాన్వీ తన ప్రయాణాన్ని ఎంతో ఉత్సాహంగా సాగిస్తోంది. వీరిద్దరి ప్రేమాయణం భవిష్యత్తులో మరిన్ని మలుపులు తిరిగి అందమైన పెళ్లితో శిఖ‌రాగ్రానికి చేరుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. జాన్వీ కపూర్ త‌దుప‌రి సినిమాలు: జాన్వీ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్ర‌స్తుతం పెద్ది (RC 16)లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న‌ సినిమాలో జాన్వీ కథానాయికగా న‌టిస్తోంది. ఉలజ్ అనే పొలిటికల్ థ్రిల్లర్ లో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. దేవర: పార్ట్ 2 లో ఎన్టీఆర్ సరసన తంగం పాత్రలో జాన్వీ నటించ‌నుంది.

Tags:    

Similar News