రఫ్ అయిన నువ్వు.. టఫ్ అయిన నేను! పర్పుల్ లెహంగాలో దివి వడ్త్యా కిల్లర్ లుక్స్

బిగ్‌బాస్ బ్యూటీ, టాలెంటెడ్ యాక్ట్రెస్ దివి వడ్త్యా సోషల్ మీడియాలో సరికొత్త ఫొటోషూట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Update: 2026-06-28 13:34 GMT

బిగ్‌బాస్ బ్యూటీ, టాలెంటెడ్ యాక్ట్రెస్ దివి వడ్త్యా సోషల్ మీడియాలో సరికొత్త ఫొటోషూట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వైబ్రంట్ పర్పుల్ కలర్ లెహంగా చోళీలో దేవకన్యలా మెరిసిపోతూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. 'రఫ్ అయినా నువ్వు .. టఫ్ అయినా నేను .. మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన క్రేజీ క్యాప్షన్, షేర్ చేసిన గ్లామరస్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.




 


అదిరిపోయిన పర్పుల్ ట్రెడిషనల్ లుక్:

ఈ ఫొటోషూట్ కోసం దివి డిజైనర్ పర్పుల్ లెహంగాను ఎంచుకుంది. ఆమె వేసుకున్న బ్లౌజ్‌పై అద్భుతమైన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో పాటు మధ్యలో నెమలి మోటిఫ్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక దీనికి మ్యాచింగ్ లావెండర్ పర్పుల్ స్కర్ట్, హెవీ గోల్డ్ చోకర్ నెక్లెస్, పెద్ద జుంకాలు మరియు సాంప్రదాయ గాజులతో దివి రాయల్ లుక్‌లో అదరగొట్టేసింది. ఈ ట్రెడిషనల్ మేకోవర్ ఆమె అందాన్ని మరింత పెంచేసింది.




 


మహర్షి నుండి పుష్ప 2 వరకు క్రేజీ జర్నీ:

మహేష్ బాబు మహర్షి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన దివి.. మెగాస్టార్ 'గాడ్‌ఫాదర్' చిత్రంలో 'రేణుక' పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రుద్రాంగి, లంబసింగి, సింబా సినిమాలతో పాటు, ఇక పాన్ ఇండియా హిట్ పుష్ప 2లో న్యూస్ రిపోర్టర్‌గా మెరిసింది. అలాగే ఓటీటీలో మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం వంటి పాపులర్ వెబ్ సిరీస్‌లలో తన బోల్డ్ అండ్ ఎంటర్‌టైనింగ్ నటనతో మెప్పించింది.




 


చేతినిండా ఆఫర్లతో ఫుల్ బిజీ:

రీసెంట్ గా దివి కెరీర్ పీక్స్‌లో ఉంది నవీన్ చంద్రతో కలిసి 'హనీ' అనే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నటించిన ఈమె, బాలీవుడ్‌లో సన్నీ డియోల్ గత ఏడాది వచ్చిన యాక్షన్ మూవీ 'జాత్'లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర మెరిసింది. ఇక వీటితో పాటు 'కర్మస్థలం' అనే పాన్ ఇండియా యాక్షన్ మూవీలో లీడ్ రోల్ లో అలరించింది. ఇక ఇప్పుడు 'Sshhh', 'ద్రౌపతి 2' వంటి సరికొత్త సిరీస్ ప్రాజెక్ట్‌ల చర్చల్లోనూ ఆమె ఉంది.

ఫొటోషూట్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తూ..:

గతంలో కంటే ఇప్పుడు దివి గ్లామర్ డోస్ పెంచి, నెక్స్ట్ లెవెల్ ఫొటోషూట్లతో కెవ్వుకేక పుట్టిస్తోంది. కేవలం లైక్స్ కోసమే కాకుండా, నటిగా తనలోని అన్ని కోణాలను నిరూపించుకోవడానికే ఈ రేంజ్‌లో ఫోజులు ఇస్తోందని టాక్. ఇక ఈ క్రేజీ ఫొటోల వల్లే ఇండస్ట్రీ వర్గాల నుండి ఆమెకు ఇప్పటికే రెండు పెద్ద ఆఫర్లు వచ్చాయని, టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయని టాక్.

దివికి గనక ఒక్క మంచి సాలిడ్ ఛాన్స్ వస్తే కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పర్పుల్ లెహంగా లుక్స్ చూస్తుంటే, హీరోయిన్‌గా టాలీవుడ్‌ను ఏలే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. మరి ఈ బ్యూటీ ముందు ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..

Tags:    

Similar News