డ‌బ్బులుండి రిస్క్ తీసుకోని వాళ్లంతా తెలివైన వాళ్లేనా?

గ్లామ‌ర్ ఫీల్డ్ లో రాణించాల‌ని...ఇక్క‌డ పెద్ద స్టార్ అవ్వాల‌ని ఎవ‌రికి ఉండ‌దు. కానీ ఇది అంద‌రికీ సాధ్యం కాదు.;

Update: 2026-03-07 06:54 GMT

గ్లామ‌ర్ ఫీల్డ్ లో రాణించాల‌ని...ఇక్క‌డ పెద్ద స్టార్ అవ్వాల‌ని ఎవ‌రికి ఉండ‌దు. కానీ ఇది అంద‌రికీ సాధ్యం కాదు. ఫ్యాష‌న్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండాలి. అలాగని బ్యాక్ గ్రౌండ్ లేని వారు స్టార్లు అవ్వ‌రని కాదు. ఇండ‌స్ట్రీలో బ‌ల‌ముంటే న‌టుడు అవ్వ‌డం ఈజీ. ప‌రిచ‌యం చేయ‌డం వ‌ర‌కూ బ్యాక్ గ్రౌండ్ ప‌నికొస్తుంది. ఆ త‌ర్వాత నిల‌దొక్కు కోవ‌డం అన్న‌ది వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారైతే న‌టుడు అవ్వ‌డానికి ఎద‌గ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఇలాంటి ఎదుగుద‌ల అన్న‌ది ఎంతో సాలిడ్ గా ఉంటుంది. త‌న‌ని తాను స్టార్ గా మార్చుకోవ‌డం కోసం ఇండ‌స్ట్రీలో సొంతంగా డ‌బ్బులు కూడా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.

స్టార్ గా ఎదిగే వ‌ర‌కూ ఎదురు డ‌బ్బులిచ్చి న‌టించిన‌ వారెంతో మంది ఉన్నారు. ప‌రిశ్ర‌మ‌లో అలా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. పోటీ పెర‌గ‌డంతో న‌టుల మ‌ధ్య ఈ ర‌క‌మైన ప‌రిస్థితులు త‌లెత్తాయి. అయితే ఇండ‌స్ట్రీలో ఉన్న కొంద‌రు త‌మ మీద తామే ఖ‌ర్చు పెట్టుకోల‌ని స్థితిలో ఉన్నారు? అన్న‌ది అంతే వాస్త‌వం. రానా పెద్ద స్టార్ అవ్వాల‌నుకున్నాడు. చాలా సినిమాల్లో హీరోగానూ న‌టించాడు. కానీ తాను అనుకున్నంత‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. తాత‌య్య రామానాయుడు పెద్ద నిర్మాత‌. ఆయ‌న వార‌స‌త్వాన్ని అందుకుని పెద్ద కుమారుడు సురేష్ బాబు నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు.

ఇప్పుడు రానా కూడా నిర్మాత‌గా బిజీ అయ్యాడు. కానీ రానా మాత్రం త‌న మీద తాను పెట్టుబ‌డి పెట్టుకోవ‌డం లేదు. బ‌య‌ట హీరోల‌తో సినిమాలు నిర్మిస్తున్నాడు త‌ప్ప త‌న మీద ఖ‌ర్చు చేయ‌డం లేదు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు స్వీయా నిర్మాణంలో చేసాడ‌నుకోండి. అలాగే అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ చిన్న కుమారుడు శిరీష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కొన్ని సినిమాల్లో హీరోగా న‌టించాడు. కానీ అనుకున్నంత‌గా స‌క్సెస్ అవ్వ‌క పోవ‌డంతో సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఈ న‌టుడు కూడా త‌న మీద తాను ఖ‌ర్చు పెట్టింది త‌క్కువే.

ప్ర‌స్తుతం బ‌యట బ్యాన‌ర్ల‌లో సినిమాలు చేయ‌లేదు. మరి సొంత బ్యాన‌ర్లో సినిమా చేసే ఛాన్స్ తీసుకుంటాడా? అంటే అదెక్క‌డా క‌నిపించ‌లేదు. బ‌య‌ట స్టార్స్ తో డాడ్ సినిమాలు చేస్తున్నారు గానీ త‌న‌యుడితో మాత్రం నిర్మించ‌డం లేదు. మ‌రి నిర్మాత‌లుగా ఇది తెలివైన నిర్ణ‌య‌మేనా? అంటే నూటిని నూరు శాతం అని చెప్పాలి. నిర్మాణం అన్న‌ది ఎంతో రిస్క్ తో కూడుకున్న‌ది. తేడా జ‌రిగితే కోట్ల‌ల‌లో న‌ష్టాన్ని భ‌రించాల్సి ఉంటుంది. నిర్మాత‌లుగా ఎంతో అనుభవం వారి సొంతం. ఎలాంటి న‌టుడిపై , ఎలాంటి క‌థ‌కు ఖ‌ర్చు చేయాల‌ని ప‌క్కాగా తెలిసిన వారు. నిర్మాణంలో ఎన్నో ఎత్తు ప‌లాలు చూసిన వారు.

Tags:    

Similar News