సెలబ్రిటీ టాక్ షోలలో గెస్ట్ లకు బన్నీతో స్పెషల్ సర్ప్రైజ్.. ఏం టైమింగ్ గురూ!
కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’ షోలో టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతోనే కాకుండా, తోటి నటీనటులతో ఉండే స్నేహపూర్వక సంబంధాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. టాక్ షోల్లో పాల్గొనే తన సహనటులకు అర్ధరాత్రి వేళల్లోనూ లైవ్ కాల్స్ చేసి సర్ప్రైజ్ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే వంటి స్టార్లతో బన్నీ సరదాగా మాట్లాడిన మాటలు వారి మధ్య ఉన్న బాండింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ విశేషాలేంటో చూద్దాం.
కాఫీ విత్ కరణ్‌లో విజయ్‌కి అర్ధరాత్రి కాల్:
కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’ షోలో టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. షోలో ఓ టాస్క్‌లో భాగంగా విజయ్ దేవరకొండ అర్ధరాత్రి 11 గంటలకు అల్లు అర్జున్‌కు ఫోన్ చేశారు. ఆ సమయంలోనూ బన్నీ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఆప్యాయంగా మాట్లాడారు. “ఈ టైమ్‌లో నీకు కాల్ చేసినా నువ్వు ఏమి అనవని తెలుసు. అందుకే నీకే ఫోన్ చేశా అన్నా” అని విజయ్ చెప్పడం వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అర్ధం అవుతుంది.
జగపతిబాబు షోలో ‘బుట్టబొమ్మ’కు మైండ్ బ్లాకింగ్ సర్ప్రైజ్:
ఇక సీనియర్ నటుడు జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జీ తెలుగు పాపులర్ టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా సీజన్ 2'లో పూజా హెగ్డే పాలోననున్నారు. తాజాగా ప్రోమో విడుదల చేసారు అందులో బన్నీ ఫోన్ కాల్ ద్వారా పూజను సప్రైజ్ చేసారు. ఇక స్వయంగా అల్లు అర్జున్ పూజను బుట్టబొమ్మ అని పిలవటం, జగపతి బాబు పూజను చూస్తూ "నిన్ను బుట్టబొమ్మ అని పిలవాలా.. అరవిందా అని పిలవాలా?" అని అడగడం, 'అల వైకుంఠపురములో' జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఈ ఎపిసోడ్‌లోనే ప్రత్యేక హైలెట్ గా నిలిచాయి.
ఫ్రెండ్షిప్కు బన్నీ ఇచ్చే విలువ:
ఫిలిం ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా తనతో పనిచేసే తోటి నటీనటులకు, స్నేహితులకు అల్లు అర్జున్ ఇచ్చే రెస్పెక్ట్, సపోర్ట్ మరోసారి స్పష్టమైంది. షో ఏదైనా, టైమ్ ఏదైనా సరే ఫ్రెండ్స్ కోసం అందుబాటులో ఉంటూ సర్ప్రైజ్ ఇవ్వడం ఒక్క ఐకాన్ స్టార్కే చెల్లిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక బన్నీ ఫ్రెండ్లీ నేచర్ మరియు ఆయన పర్ఫెక్ట్ టైమింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
అట్లీ దర్శకత్వంలో 'రాకా' హంగామా:
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్, సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలో దీపికా పడుకోణ్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొంది.
ఇక మొత్తానికి చూస్తే, అటు వెండితెరపై భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతూనే, ఇటు బుల్లితెర టాక్ షోలలో స్పెషల్ ఫోన్ కాల్స్‌తో సందడి చేస్తున్నారు ఐకాన్ స్టార్. ఫ్రెండ్స్ కోసం బన్నీ ఇచ్చే ఈ స్పెషల్ సర్ప్రైజ్లు, ఆయన చూపించే ప్రేమాభిమానాలు ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.