రెండు వారాలు బాల‌య్య కు నిద్ర‌లేని రాత్రుళ్లే!

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-07 08:04 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన‌ట్లు తెలిసింది. ఎలాంటి హ‌డావుడి లేకుండా సింపుల్ గా షూటింగ్ మొద‌లు పెట్టేసారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ప్ర‌త్యేకంగా సిద్దం చేసిన సెట్ లో నైట్ షెడ్యూల్ జ‌రుగుతోంద‌ని తెలిసింది. ఇందులో బాల‌కృష్ణ పాల్గొంటున్నారు. ఆయ‌న స‌హా ప్ర‌ధాన పాత్ర ధారుల‌పై యాక్ష‌న్ స‌న్నివేశాల తో పాటు , టాకీ పార్ట్ కూడా చిత్రీక‌రిస్తున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఇదే సెట్ లో రాత్రి స‌మ‌యంలోనే షూటింగ్ చేస్తార‌ని తెలిసింది.

అంటే ఈ 14 రోజులు బాల‌య్యకు జాగారం త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. కీల‌క స‌న్నివేవాలు కావ‌డంతోనే బాల‌య్య నైట్ షెడ్యూల్ కు హాజ‌ర‌వుతున్నారు. సాధార‌ణంగా స్టార్ హీరోల‌పై నైట్ షెడ్యూల్స్ అన్న‌వి చాలా రేర్గా ఉంటాయి. కొంత మంది హీరోలైతే నైట్ షెడ్యూల్స్ కు అంగీక‌రించారు. ఇలాంటి స‌మ‌యంలో ద‌ర్శ‌కులు అడ్జ‌స్ అయి ప‌నిచేయాల్సి ఉంటుంది. కానీ బాల‌య్య ఆ టైపు కాదు. ఈయ‌న పూర్తిగా ద‌ర్శ‌కుల హీరో. సెట్ లో ద‌ర్శ‌కుడు ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోవ‌డం బాల‌య్య ప్ర‌త్యేక‌త‌. ఓ ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఇవ్వాల్సిన గౌర‌వాన్ని ఇస్తారు.

సూచ‌న‌లు, స‌ల‌హాలు, మ‌ధ్య‌లో వేలు పెట్ట‌డం వంటి ప‌నులు చేయ‌రు. నైట్ షెడ్యూల్స్ బాల‌య్య‌కు కొత్తేం కాదు. ఆయ‌న న‌ట ప్ర‌స్థానంలో ఇలాంటి షెడ్యూల్స్ ఎన్నో చూసారు. బాబి తెర‌కెక్కించిన `డాకు మ‌హారాజ్` చిత్రీకరణ సమయంలో కూడా బాలయ్య ఎన్నో రాత్రులు నిద్రలేకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ , జైలుకు సంబంధించిన సన్నివేశాలను రాత్రి సమయాల్లోనే చిత్రీకరించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఎంత మాత్రం ఆసౌక‌ర్యానికి గురి కాలేదు. ఎంచక్కా షూటింగ్ పూర్తి చేసి వ‌చ్చారు.

సినిమా కోసం రాత్రి పూట షూటింగ్ ఉన్నప్పుడు ఏ మాత్రం అలసట లేకుండా పాల్గొంటారు. బాలకృష్ణ సాధారణంగా ఉదయాన్నే నిద్రలేచి పనులు ప్రారంభించే వ్యక్తి. రాత్రి స‌మ‌యాన్ని అన‌వ‌స‌రంగా వృద్దా చేయ‌రు. ఉంటే సినిమా సెట్స్ లో లేదా? ఇంట్లోనే ఉంటారు. ఇటీవ‌లే బాల‌య్య న‌టించిన `అఖండ 2` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య పాన్ ఇండియాలో ఆ సినిమా రిలీజ్ అయినా అంచ‌నాలు అందుకోలేదు. దీంతో బాల‌య్య లో స‌క్సెస్ దాహం పెరిగిపోతుంది. త‌దుప‌రి చిత్రాన్నివీలైనంత వేగంగా పూర్తిచేసి రిలీజ్ చేయాల‌నే క‌సి క‌నిపిస్తోంది. ఈ వేడిలో బాల‌య్య నైట్ ఏంటి? 24 గంట‌లు షూట్ లో పాల్గొన్న ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

Tags:    

Similar News