ఫరియా వర్కౌట్స్ చాలా డిఫరెంట్‌ గురూ

జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా సందడి చేస్తూనే ఉంటుంది. ఫోటోలు, వీడియోలను షేర్‌ చేయడం ద్వారా అభిమానులకు చేరువగా ఉంటుంది.;

Update: 2025-05-13 11:40 GMT

జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా సందడి చేస్తూనే ఉంటుంది. ఫోటోలు, వీడియోలను షేర్‌ చేయడం ద్వారా అభిమానులకు చేరువగా ఉంటుంది. 10 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈమె షేర్‌ చేసే ఫోటోలు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా ఈమె వర్కౌట్‌ వీడియోను షేర్ చేసింది. వర్కౌట్‌కి ముందు, వర్కౌట్‌ తర్వాత అన్నట్లుగా వీడియోను షేర్ చేసింది. సాధారణంగా వర్కౌట్స్ అంటే చాలా కష్టపడి చేస్తూ ఉంటారు. కానీ ఫరియా మాత్రం చాలా సరదాగా, సింపుల్‌గా, కష్టం అనిపించుకోకుండా డాన్స్ చేసినట్లుగానే వర్కౌట్‌ చేయడం భలే ఉంది అంటూ అంతా కామెంట్‌ చేశారు.

హీరోయిన్స్ కచ్చితంగా వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. కొందరు వర్కౌట్‌ చేయకున్నా సన్నగా నాజూకుగా ఉంటారు అంటారు. ఫరియా అబ్దుల్లా కూడా పెద్దగా వర్కౌట్స్ చేయకుండానే సన్నగా నాజూకుగా ఉంటుందని అంతా భావిస్తారు. కానీ ఆమె కచ్చితంగా వర్కౌట్స్ చేస్తుంది. అయితే మరీ ఎక్కువగా కాకుండా, పదుల కేజీల బరువు ఎత్తకుండా సింపుల్‌ ట్రిక్స్ ఉపయోగించి, వర్కౌట్స్ చేయడం ద్వారా సన్నగా ఉంటుంది. ఆ మధ్య కాస్త బొద్దుగా అనిపించిన ఫరియా అబ్దుల్లా మరోసారి సన్నబడింది. తన అందంతో మెప్పించింది. ఆకట్టుకునే అందంతో పాటు ఫరియా అబ్దుల్లా ఫిజిక్ కారణంగా చాలా మంది అభిమానిస్తారు అనడంలో సందేహం లేదు.

తాజాగా ఫరియా అబ్దుల్లా షేర్ చేసిన వీడియో కారణంగా మరింత ఆమె పై అభిమానం పెరిగింది అంటూ అభిమానులు మాట్లాడుతున్నారు. ఫరియా అబ్దుల్లా ఇతర హీరోయిన్స్‌తో పోల్చితే కాస్త ఎక్కువ బరువు ఉంటుందని, అందుకే ఈమెకు ఆఫర్లు రావడం లేదు అనే టాక్ ఉంది. తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కచ్చితంగా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాతిరత్నాలు సినిమాలో కామెడీ యాంగిల్ చూపించిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లోనూ కామెడీతో మెప్పించే ప్రయత్నం చేసింది.

ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమాతో పరిచయం కాగా, అదే ఏడాదిలో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాలోనూ కనిపించింది. బంగార్రాజు సినిమాలో ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది. గత ఏడాది ఈమె నటించి మత్తు వదలరా 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక తమిళ్ మూవీ ఉంది. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత తమిళ్‌లో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఒకటి రెండు సినిమాలకు ఈమె సైన్ చేసిందని, త్వరలోనే మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News