రజనీకాంత్ బయోపిక్ పైనా గురిపెట్టిన స్టార్!
అతని పాటలు వింటూ పెరిగిన నటుడు. ఇండస్ట్రీలో గురువుగానూ భావిస్తారు. అతని బయోపిక్ లో నటించాలన్నది ధనుష్ కల.;
కోలీవుడ్ స్టార్ ధనుష్ మల్టీట్యాలెంటెడ్. నటుడిగా, గాయకుడిగా, డైరెక్టర్ గా పరిశ్రమలో రాణిస్తున్నాడు. స్టార్ హీరోగా పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రత్యేకించి బాలీవుడ్ తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. ఎంతో మంది కోలీవుడ్ స్టార్లు ఉన్నా? ఎవరికీ సాధ్యం కాని క్రేజ్ బాలీవుడ్ లో ధనుష్ దక్కిం చుకున్నాడు. ప్రస్తుతం తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోన్న ఏకైక కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒక్కడే.
అలాగే ఇతర స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడం అతడికే చెల్లింది. ఇటీవలే సంగీత దిగ్గజం ఇళయరాజా బయోపిక్ లో నటించే అరుదైన అవకాశం కూడా అందుకున్నాడు. ఎంతో మంది నటులున్నా? ఇళయరాజా పాత్రకు తాను మాత్రమే న్యాయం చేయగలడని భావించిన దర్శకుడు ధనుష్ ని మాత్రమే ఛాయిస్ గా తీసుకుని ఎంచుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇళయారాజా ప్రభావం అతడిపై ఎంతో ఉంది.
అతని పాటలు వింటూ పెరిగిన నటుడు. ఇండస్ట్రీలో గురువుగానూ భావిస్తారు. అతని బయోపిక్ లో నటించాలన్నది ధనుష్ కల. తనని వెతుక్కుంటూ మరీ వచ్చింది. ఈ సందర్భంగా మనసులో ఉన్న మరో కోరికను కూడా ధనుష్ బయట పెట్టాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ లో కూడా నటించాలని ఉందని తెలిపాడు. అవకాశం వస్తే తప్పకుండా ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకుంటానన్నాడు.
మొదటి కల ఇళయరాజా రూపంలో తీరుతుంటే ..రెండవ కలగా రజనీకాంత్ బయోపిక్ గా పేర్కొన్నాడు. రజనీ కాంత్ స్పూర్తితోనే ధనుష్ సినిమాల్లోకి వచ్చాడు. ఎప్పటికైనా అతడిలా ఎదగాలని ఎంతో కష్టపడి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. అటుపై ఆ స్పూర్తిదాత ఇంటికే అల్లుడిగా వెళ్లాడు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకోవడం కొన్నాళ్ల కాపురం అనంతరం విడాకులతో వేరైన సంగతి తెలిసిందే.