C/o కంచరపాలెం మేకర్స్ మరోసారి.. టాలీవుడ్ కు ప్రేమలేఖ!
ఇప్పుడు ఆ మూవీ మేకర్స్ మరో సినిమాను తీయనున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు.;
C/o కంచరపాలెం సినిమా గురించి తెలుగు సినీ ప్రియులందరికీ తెలిసిందే. 2018లో రిలీజ్ అయిన ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్పెషల్ సినిమాగా గుర్తింపు సంపాదించుకుంది. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఆ చిత్రం.. కమర్షియల్ గా సక్సెస్ అయింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలను దశల వారీగా సినిమాలో చూపించి ఆకట్టుకున్నారు దర్శకుడు. మూవీలోని ప్రతి రోల్ కూడా కనెక్ట్ అందరికీ అయిపోయింది. అంతలా ఆకట్టుకున్న మూవీ రిలీజ్ అయ్యి ఏడేళ్లు అయిపోయింది. ఇప్పుడు ఆ మూవీ మేకర్స్ మరో సినిమాను తీయనున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు.
అయితే C/O కంచరపాలెం సినిమాను ప్రవాస భారతీయురాలైన పరుచూరి విజయ ప్రవీణ నిర్మించారు. మూవీలో కీలక పాత్ర పోషించారు. రానా దగ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తూ.. సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. మూవీతో మంచి హిట్ ను అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ప్రవీణ పరుచూరి, రానా దగ్గుబాటి చేతులు కలిపారు.
తమ నుంచి రాబోయే సినిమా ఈసారి ప్రత్యేకంగా ఉండబోతుందని మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. "తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాం. వాటితోనే నవ్వాం, ఏడ్చాం, చప్పట్లు, ఈలలు కొట్టాం. అలాంటి మనసుకు దగ్గరైన సినిమాలన్నిటికీ ఇది మా ప్రేమ లేఖ" అంటూ రాసుకొచ్చి మూవీని ఆదివారం ప్రకటించారు మేకర్స్.
దాంతోపాటు స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో కంచరపాలెం మూవీలోని ఆశాపాశం సాంగ్ ప్లే అవుతుండగా.. సినిమాలోని కొన్ని విజువల్స్ చూపించారు. ఆ తర్వాత మరో మాస్టర్ పీస్ ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. తెలుగు సినిమాకు ప్రేమ లేఖ అని తెలిపారు. అప్డేట్స్ కోసం వేచి ఉండడని చెబుతూ వీడియోను ఎండ్ చేశారు.
అయితే సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలు మేకర్స్ ప్రకటించలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని డిటైల్స్ ను త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు మేకర్స్. దీంతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లు నెటిజన్లు, సినీ ప్రియులు చెబుతున్నారు.