బిగ్ బాస్ 9.. ఆ ఇద్దరి మధ్యలోనే టైటిల్ ఫైట్..?
సీజన్ మొదటి నుంచి ఒక కంటెస్టెంట్ తన ఆట తీరుతో టాప్ లో కొనసాగుతుండగా కామనర్ గా వచ్చిన ఒక కంటెస్టెంట్ కూడా 10వ వారం నుంచి చివరి ఐదారు వారాల్లో తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు.;
బిగ్ బాస్ సీజన్ 9లో టైటిల్ ఫైట్ ఎవరి మధ్య అన్నది దాదాపు తేలిపోయింది. సీజన్ మొదటి నుంచి ఒక కంటెస్టెంట్ తన ఆట తీరుతో టాప్ లో కొనసాగుతుండగా కామనర్ గా వచ్చిన ఒక కంటెస్టెంట్ కూడా 10వ వారం నుంచి చివరి ఐదారు వారాల్లో తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా సీజన్ 9 టైటిల్ విన్నర్ గా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని అనిపిస్తుంది.
టాప్ 3, 4, 5 స్థానాల్లో..
సీజన్ 9లో టాప్ 5 గా కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజన గర్లాని ఉన్నారు. ఐతే వీరిలో టాప్ 3, 4, 5 స్థానాల్లో కాస్త అటు ఇటు మార్పులు ఉండొచ్చని తెలుస్తుంది. ఎందుకంటే డీమాన్ పవన్ బీస్ట్ మోడ్ లెవెల్ లో ఆట ఆడుతుండగా అతను కూడా టాప్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఐతే ఏది ఏమైనా టాప్ 1, 2 పొజిషన్ లో మాత్రం కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి మధ్య మాత్రమే అని తెలుస్తుంది.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా సీజన్ 9లో ఎంటర్ అయిన కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్ గా చేసి వచ్చాడు. ఐతే అతను బిగ్ బాస్ కోసం అక్కడ లాంగ్ లీవ్ తీసుకుని వచ్చాడు. సీజన్ 9లో అతని ఆట తీరుతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ వీక్ తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ మరింత పెరింది. ఫైనల్ గా ఈ సీజన్ విన్నర్ అతనే అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు.
ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్స్..
ఇక నెక్స్ట్ టాప్ 2 లో ఉంటూ తన సత్తా చాటుతూ వస్తుంది తనూజ. ఆమె కూడా ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. సీజన్ 9 మొదటి నుంచి ఆడియన్స్ కు ఆమె ఫేవరెట్ కంటెస్టెంట్ గా ఉంటూ వచ్చింది. సీరియల్ స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా సీజన్ 9లో తనూజ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇక సీజన్ 9 విన్నర్ రేసులో కళ్యాణ్, తనూజ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇద్దరిలో ఎవరు గెలిచినా సరే వాళ్లు దానికి అర్హులే అన్నట్టుగా ఆడియన్స్ భావిస్తున్నారు. ఐతే మధ్యలో ఇమ్మాన్యుయెల్ కూడా సీజన్ విన్నర్ అవుతాడని అనిపించినా లాస్ట్ 2, 3 వారాలుగా అతను టాప్ 3కి మాత్రమే ఫిక్స్ అనేలా కనిపించాడు. అంతేకాదు డీమాన్ పవన్ ఈ వీక్ ఒక రేంజ్ లో ఆట ఆడుతుండగా టాప్ 3 పొజిషన్ కి ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ మధ్య పోటీ ఏర్పడేలా ఉంది.
బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 21 ఆదివారం జరుగుతుంది. ప్రతి సీజన్ లానే టైటిల్ విన్నర్ పై ఆడియన్స్ లో ఇద్దరి ముగ్గురు కంటెస్టెంట్స్ మీద ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో సీజన్ 9 విన్నర్ ఎవరన్న దాని మీద ఒక రేంజ్ లో డిస్కషన్ నడుస్తుంది.