యాక్షన్ తో 'ఛాంపియన్'.. చరణ్ నోట 'లగాన్' మాట!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఈవెంట్ కు వస్తున్నారంటే ఆ కిక్ వేరుగా ఉంటుంది.;

Update: 2025-12-18 19:13 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఈవెంట్ కు వస్తున్నారంటే ఆ కిక్ వేరుగా ఉంటుంది. లేటెస్ట్ గా మేక రోషన్ హీరోగా నటిస్తున్న 'ఛాంపియన్' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాజిటివ్ వైబ్స్ తో జరిగింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలతో ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దానికి తోడు ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా వచ్చి సినిమా గురించి మాట్లాడటంతో హైప్ మరో లెవెల్ కు వెళ్లిపోయింది. ఈ ఈవెంట్ లో చరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రైలర్ చూసిన తర్వాత చరణ్ సినిమాపై పాజిటివ్ గా స్పందించారు. ముఖ్యంగా ఈ సినిమాను ఒక క్లాసిక్ తో పోల్చడం విశేషం. "ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ లగాన్ సినిమా లాగా ఉంది" అని చరణ్ కామెంట్ చేశారు. లగాన్ ఎంతటి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామానో మనందరికీ తెలిసిందే. దానికి యాక్షన్ జోడించి ఛాంపియన్ ను తీర్చిదిద్దారని చరణ్ చెప్పడంతో, కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతోంది. ఒక్క మాటతో సినిమా రేంజ్ ను చరణ్ పెంచేశారు.

హీరో రోషన్ లుక్స్ గురించి కూడా చరణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమాలో రోషన్ ను చూస్తుంటే ఒక హాలీవుడ్ స్టార్ లాగా కనిపిస్తున్నాడని కాంప్లిమెంట్ ఇచ్చారు. తన కెరీర్ మొదట్లో ఇలాంటి ఒక ఎపిక్ సినిమాను డెలివరీ చేసినందుకు రోషన్ ను అభినందించారు. ప్రతీ టెక్నికల్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరమీద కనిపిస్తోందని, ఇదొక క్లాసికల్ ఫిల్మ్ అవుతుందని చరణ్ జోస్యం చెప్పారు.

హీరో రోషన్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం తాను చేసిన నాలుగేళ్ల నిరీక్షణ వృధా పోలేదని ఎమోషనల్ అయ్యారు. ఇంతటి క్లాసిక్ సినిమాను తనకు ఇచ్చినందుకు స్వప్న సినిమా, దర్శకుడు ప్రదీప్ అద్వైతం, నిర్మాత ప్రియాంక దత్ లకు కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్ సమయంలో నిర్మాతలు ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకోవడం వల్ల తనకు ఎలాంటి ప్రెజర్ అనిపించలేదని, అందుకే తన బెస్ట్ ఇవ్వగలిగానని రోషన్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా చరణ్ తన డెబ్యూ సినిమా 'చిరుత' ను గుర్తు చేసుకున్నారు. వైజయంతీ మూవీస్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అశ్వినీ దత్ గారి లాగే వాళ్ళ అమ్మాయిలు స్వప్న, ప్రియాంక కూడా సినిమా పట్ల ఎంతో ప్యాషన్ తో ఉంటారని అన్నారు. ఇలాంటి నిర్మాతలు ఉన్నప్పుడు ఆర్టిస్టులకు పని చేయడం చాలా ఈజీ అయిపోతుందని, వాళ్లు సినిమాను అంత బాగా చూసుకుంటారని కొనియాడారు.

చరణ్ రాకతో 'ఛాంపియన్' టీమ్ లో కొత్త జోష్ వచ్చింది. రోషన్, అనస్వర రాజన్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి లాంటి యంగ్ టాలెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది. లగాన్ లాంటి ఎమోషన్, హాలీవుడ్ రేంజ్ మేకింగ్ అని చరణ్ సర్టిఫికెట్ ఇచ్చేశాక ఇక ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి సినిమా కంటెంట్ బిగ్ స్క్రీన్ పై ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.

Tags:    

Similar News