షాకిస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ గేమ్ ప్లాన్
పరిశ్రమను ఏలేది ఆ నలుగురు అనేది నిరంతరం వినపడే మాట. పరిశ్రమలో ఏం చేసినా ఆ నలుగురు చేస్తారని అంటారు. థియేటర్లను బ్లాక్ చేసి ఆటాడుతారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక యంగ్ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేసేది కూడా వీళ్లే. ప్యాకేజీలు పేరుతో తెలివిగా కొందరిని లాక్ చేసి ఐదారేళ్ల పాటు వరుసగా సినిమాలు చేసే ఎత్తుగడల్ని వీరు అనుసరిస్తుంటారు. ఇక రెగ్యులర్ గా సినిమాలు తీసేవాళ్లంతా 19 మంది కలిసి నిర్మాతల గిల్డ్ ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లంతా ఇప్పుడు అదే బాటలో ఉన్నారట.
అదంతా సరే కానీ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ - సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ల అధినేతలు అయిన రాధాకృష్ణ- నాగ వంశీ ప్లానింగ్ ఇతర స్టార్ ప్రొడ్యూసర్స్ ప్లాన్స్ కి ఏమాత్రం తీసికట్టుగా లేవు. ఓవైపు హారిక హాసిని కోసం అగ్ర హీరోల్ని బడా దర్శకుల్ని లాక్ చేస్తూనే.. మరోవైపు యంగ్ ట్యాలెంట్ ని కూడా ఖాతాలో వేసేందుకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ ని ఆపరేట్ చేస్తున్నారు. యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లాక్ చేస్తూ ఇటీవల హాట్ టాపిక్ గా మారాడు.
అందుకోసం అతడు తెలివిగా యువహీరోలు సహా ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లను క్యూలో పెడుతున్నాడు. వీళ్లలో నాని-రానా- నితిన్- నాగశౌర్య- విశ్వక్ సేన్- సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువహీరోలు ఉండడం ఆసక్తికరం. ఇటీవల వరుసగా మలయాళ బ్లాక్ బస్టర్ల రైట్స్ కొనుక్కుని స్క్రిప్టుల్ని రెడీ చేయిస్తున్నారు. మారుతి- గౌతమ్ తిన్ననూరి- సుధీర్ వర్మ- కిషోర్ తిరుమల- సైలేష్ కొలను- వివేక్ ఆత్రేయ- సాగర్ చంద్ర తదితరులకు అడ్వాన్సుల్ని ఇచ్చి సదరు బ్యానర్ లాక్ చేసిందని తెలుస్తోంది. వీళ్లంతా సితార బ్యానర్ కోసం స్క్రిప్టుల్ని తయారు చేసే పనిలో ఉన్నారు. వీటిలో కొన్ని ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయని తెలుస్తోంది.
నాని తో `శ్యాం సింఘరాయ్` నితిన్ తో రంగ్ దే.. నాగశౌర్యతో వేరొక సినిమా స్ట్రెయిట్ చిత్రాలు కాగా.. మలయాళ సూపర్ హిట్ చిత్రాలైన అయ్యప్పనమ్ కోషియం- కప్పేల రీమేక్ స్క్రిప్టుల్ని రెడీ చేయిస్తున్నారు. ఈ చిత్రాల స్క్రిప్ట్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. అయ్యప్పనమ్ కోషియం రీమేక్ లో రవితేజ- రానా నటిస్తారని వార్తలొచ్చాయి. కప్పేలా రీమేక్ లో విశ్వక్ సేన్ నటించనున్నారు. ఇక నానీతో చేసే మూవీ అతడి కెరీర్ బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఉంటుందని సమాచారం. జెర్సీ లాంటి క్లాసిక్ హిట్ ని రూపొందించిన సితార బ్యానర్ నానీకి మరో బిగ్ గిఫ్ట్ ఇవ్వనుంది. అలాగే కృష్ణ అండ్ హిజ్ లీలా ఫేం సిద్ధు జొన్నలగడ్డతోనే ఓ సెటైరికల్ కామెడీని రూపొందించేందుకు సితార బ్యానర్ ప్రణాళికల్లో ఉంది.