మ్యాడ్ స్క్వేర్ చేయకుండా ఉండేవాడిని.. వైరల‌వుతోన్న సంగీత్ కామెంట్స్

టాలీవుడ్‌లో యువ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న సంగీత్ శోభ‌న్ మరోసారి తన నిజాయితీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.;

Update: 2026-03-07 10:46 GMT

టాలీవుడ్‌లో యువ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న సంగీత్ శోభ‌న్ మరోసారి తన నిజాయితీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం సంగీత్ రాకాస అనే హారర్ కామెడీ సినిమాలో న‌టించగా, ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్ల‌లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు సంగీత్. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మ్యాడ్ స్వ్కేర్ మూవీ గురించి ఎవ‌రూ ఊహించ‌ని కామెంట్స్ ను చేశారు సంగీత్.

త‌క్కువ టైమ్ లోనే పూర్తైన మ్యాడ్ స్వ్కేర్

ఒక‌వేళ మ్యాడ్ స్క్వేర్ గురించి మ‌ళ్లీ ఆలోచించే ఛాన్స్ ద‌క్కితే ఆ మూవీ చేయ‌కుండా ఉండేవాడిన‌ని సంగీత్ చెప్ప‌డం ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న అభిప్రాయాన్ని ఎలాంటి మొహ‌మాటం లేకుండా బ‌య‌ట‌పెట్ట‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. త‌న కెరీర్లో మ్యాడ్ లాంటి భారీ హిట్ త‌ర్వాత ఏ ప్రాజెక్ట్ చేయాల‌నే విష‌యంలో కొంత గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని సంగీత్ ఒప్పుకున్నారు. మ్యాడ్ స‌క్సెస్ తో అంద‌రం చాలా సంతోషంలో ఉన్నామ‌ని, ఆ టైమ్ లో త‌ర్వాత ఏం చేయాల‌నే విష‌యంలో క్లారిటీ లేద‌ని, ఆ జోష్ లోనే మ్యాడ్ స్వ్కేర్ చాలా త‌క్కువ టైమ్ లోనే పూర్తైంద‌ని, ఇప్పుడు మ‌ళ్లీ ఆలోచిస్తే దాన్ని మ‌రింత భిన్నంగా చేయాల్సిందేమో అనిపిస్తుంద‌ని చెప్పారు. అత‌ని మాట‌ల‌ను బ‌ట్టి చూసుకుంటే సంగీత్ త‌న గ‌త డెసిష‌న్స్ ను ఎంత నిజాయితీగా ప‌రిశీలించుకుంటున్నారో అర్థ‌మ‌వుతుంది.

క్రైమ్ కామెడీ పై ఫోక‌స్ చేయాల్సింది

సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌టులు త‌మ సినిమాల గురించి విమ‌ర్శాత్మ‌కంగా మాట్లాడ‌టం చాలా రేర్. కానీ సంగీత్ మాత్రం త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టంగా వెల్ల‌డించారు. మ్యాడ్ స్వ్కేర్ విష‌యంలో మ‌రింత టైమ్ తీసుకుని క‌థ‌ను మెరుగుప‌ర‌చ‌వ‌చ్చ‌ని, ప్ర‌త్యేకంగా సినిమాలోని క్రైమ్ కామెడీ అంశంపై మ‌రింత ఫోక‌స్ చేసి ఉంటే బావుండేద‌ని, స్టేక్స్ ను కూడా పెంచి క‌థ‌ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చొచ్చనిపిస్తుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఆ సినిమాను ఇష్ట‌ప‌డిన ఆడియ‌న్స్ చాలా మందే ఉన్నార‌ని, ఈ విష‌యంలో నిర్మాత నాగ‌వంశీ కూడా త‌న లానే అభిప్రాయ‌ప‌డ్డార‌ని, మూవీ త్వ‌ర‌గా పూర్త‌వ‌డంతో కొన్ని అంశాల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చే అవ‌కాశం కోల్పోయామ‌ని భావిస్తున్నార‌ని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ మ్యాడ్ స్క్కేర్ మూవీని ఆడియ‌న్స్ ఎంక‌రేజ్ చేశార‌ని, కొంద‌రికైతే మ్యాడ్ కంటే మ్యాడ్ స్వ్కేర్ సినిమానే న‌చ్చింద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు.

మొత్తానికి త‌న గ‌త అనుభ‌వాల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాల‌ని భావిస్తున్న సంగీత్, ఫ్యూచ‌ర్ లో మ‌రింత భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. సినిమా జ‌యాప‌జయాల కంటే వాటి నుంచి నేర్చుకున్న పాఠాలే ఒక నటుడిని మంచి స్థానంలో నిల‌బెడ‌తాయి. మ్యాడ్ స్వ్కేర్ గురించి సంగీత్ శోభ‌న్ చేసిన ఈ నిజాయితీ గ‌ల వ్యాఖ్య‌లు కూడా అదే విష‌యాన్ని మ‌రోసారి గుర్తు చేస్తున్నాయి.

Tags:    

Similar News