ప్రతి వారం ఇన్ని సినిమాలా? సంక్రాంతి వరకు థియేటర్లలో రచ్చే!
సినిమా పిచ్చి ఉన్న ప్రేక్షకులకు రాబోయే మూడు నెలలు పండగే పండగ.. అక్టోబర్ చివరి వారం నుంచి మొదలయ్యే ఈ మూవీ ధమాకా.. సంక్రాంతి పండుగ వరకు నాన్‌స్టాప్‌గా కొనసాగనుంది.
సినిమా పిచ్చి ఉన్న ప్రేక్షకులకు రాబోయే మూడు నెలలు పండగే పండగ.. అక్టోబర్ చివరి వారం నుంచి మొదలయ్యే ఈ మూవీ ధమాకా.. సంక్రాంతి పండుగ వరకు నాన్‌స్టాప్‌గా కొనసాగనుంది. ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద డజన్ల కొద్దీ సినిమాలు పోటీ పడుతుండటంతో థియేటర్లలో వినోదాల జాతర కనిపించబోతోంది. బిగ్ స్టార్ హీరోల నుంచి క్రేజీ కాన్సెప్ట్ చిత్రాల వరకు ప్రతివారం విడుదల కానున్న ఆ సినిమాల ముచ్చట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అక్టోబర్ చివరి వారంలో కల్ట్ అండ్ కిల్లర్ హంగామా:
అక్టోబర్ 30న బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు మూడు విభిన్న చిత్రాలు సిద్ధమయ్యాయి. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’అలాగే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘కల్ట్’ చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటితో పాటు జ్యోతి పూర్వాజ్, పూర్వాజ్ లీడ్ రోల్స్‌లో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు నటించిన సెన్సేషనల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ కూడా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
నవంబర్ మొదటి వారంలో పౌరాణికాల నుంచి డబ్బింగ్ సందడి:
నవంబర్ మొదటి వారంలో పెద్ద సినిమాలు క్యూ కట్టాయి. నవంబర్ 5న నితీష్ తివారీ భారీ పౌరాణిక చిత్రం 'రామాయణం: పార్ట్ 1' 3డీలో రాబోతోంది. నవంబర్ 6 దీపావళి కానుకగా సూర్య, నజ్రియా నాజిమ్, నస్లెన్ నటిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'సీన్'మూవీతో పాటు ఇక యూత్‌ఫుల్ మూవీ 'సమ్మర్ హాలిడేస్', సుందర్ సి దర్శకత్వంలో నయనతార నటించిన భక్తి వినోదాత్మక చిత్రం 'మహాశక్తి విడుదల కానున్నాయి.
నవంబర్ 12, 13 తేదీల్లో అరడజనుకు పైగా సినిమాలు:
నవంబర్ 12న శర్వానంద్, డింపుల్ హయాతి నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి', సాయి అనీష్, అనస్వరా రాజన్ ల 'ఇట్లు అర్జున', 'చంద్రయాన్', 'హఠః', అలాగే రాకేష్ వర్రె ప్రొడక్షన్లో వస్తున్న 'మాయా లేడి' సినిమాలు వస్తున్నాయి. ఇక నవంబర్ 13న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన క్రైమ్ కామెడీ 'దొంగ నా కొడుకు', బిందు మాధవి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ 'డార్క్ చాక్లెట్', శివ కందుకూరి 'టాల్కమ్ పౌడర్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
నవంబర్ 19, 20 తేదీల్లో ఈఎన్ఈ సీక్వెల్ అండ్ మల్టీస్టారర్స్:
నవంబర్ 19న తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్' రిలీజ్ అవుతోంది. నవంబర్ 20న దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార', మమ్ముట్టి, ధనుష్, సాయిపల్లవి కాంబోలో రాబోతున్న 'ఓఎమ్ చాప్టర్ 1 ఉధిరం', ఇక తమిళ-తెలుగు బైలింగువల్ 'సత్యవాన్ సావిత్రి' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
నవంబర్ 27న ప్యాన్ ఇండియా అండ్ యాక్షన్ థ్రిల్లర్స్:
నవంబర్ 27న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త మీనన్ జంటగా నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'హైందవ' థియేటర్లలోకి రానుంది. ఇక దాంతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న గిరిజన యోధురాలిగా నటించిన ప్యాన్-ఇండియా చిత్రం 'మైసా' మరియు 'హై' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.
డిసెంబర్ మొదటి రెండు వారాల లైనప్:
డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య 'వృషభకర్మ', నితిన్ 'అలియాస్ రుక్మిణి', 'లెగసీ', 'ట్రైన్' సినిమాలు వస్తున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 11న ఇడుపు కాయితం', 'భూతం ప్రేతం' చిత్రాలు విడుదల కానున్నాయి.
డిసెంబర్ 17, 18 తేదీల్లో హాలీవుడ్ విజువల్ వండర్స్:
డిసెంబర్ 17న మార్వెల్ మోస్ట్ అవేటెడ్ ఎపిక్ 'అవెంజర్స్: డూమ్స్‌డే' భారతదేశంలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఘనంగా విడుదల కాబోతోంది. ఇక డిసెంబర్ 18న డెనిస్ విల్నెయువ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'డ్యూన్: పార్ట్ త్రీ' థియేటర్లలోకి రానుంది.
డిసెంబర్ క్రిస్మస్ వీక్‌లో స్టార్ హీరోల హంగామా:
ఇక డిసెంబర్ 24, 25 తేదీల్లో క్రిస్మస్ పండుగ రేసులో నటసింహం నందమూరి బాలకృష్ణ 'దాదా', నాగార్జున-టబు ల 'కింగ్ 100', ఇక షారుఖ్ ఖాన్ హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్', అలాగే కిరణ్ అబ్బవరం 'రియాలిటీ', మరియు హాలీవుడ్ క్రేజీ ఫ్రాంచైజ్ 'జుమాంజి 3' సినిమాలు థియేటర్లను కుదిపేయడానికి వస్తున్నాయి.
జనవరి ప్రారంభంలో మహాకాళి అండ్ సంక్రాంతి రచ్చ:
జనవరి 8న 'మహాకాళి' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక అసలైన పండుగ సంక్రాంతి పోరు న భూతో న భవిష్యతి అన్నట్లు సాగనుంది.. జనవరి 12న వెంకటేష్-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కాంబో మూవీతో పాటు సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా చిత్రం 'సంబరాల ఏటిగట్టు' రిలీజ్ కానున్నాయి.ఇక జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లాకింగ్ చిత్రం 'కాకా' థియేటర్లలో దిగనుంది.ఇక జనవరి 14న శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మరియు శ్రీవిష్ణు నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'ఫ్యామిలీ ప్యాక్' సినిమాలు సంక్రాంతి ముగింపు హంగామాగా రానున్నాయి.
ఇక వారానికి రెండు మూడు సినిమాలు కాదు.. ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు విడుదలవుతుండటంతో 2026 అక్టోబర్ చివరి నుండి 2027 జనవరి సంక్రాంతి వరకు ప్రేక్షకులకు నాన్‌స్టాప్ సినిమా జాతర ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ భారీ రేసులో ఏ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తాయో వేచి చూడాల్సిందే..