సక్సెస్ ఫుల్ సినిమా సిక్రెట్స్ ఏంటి?

ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ వెనకాలే పరిగెడుతుంది. సినిమా అంటేనే కోట్ల రూపాయలతో కూడిన భారీ వ్యాపారం.. అందుకే ఎవరికైతే విజయాలు వరిస్తాయో వారిని మాత్రమే ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుంది.

Update: 2026-10-28 09:30 GMT

ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ వెనకాలే పరిగెడుతుంది. సినిమా అంటేనే కోట్ల రూపాయలతో కూడిన భారీ వ్యాపారం.. అందుకే ఎవరికైతే విజయాలు వరిస్తాయో వారిని మాత్రమే ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుంది. మిగతా వాళ్ళందరూ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతారు. ఇండస్ట్రీ లో సక్సెస్ సీక్రెట్ ఏంటి? విజయ తీరాలకు చేరాలంటే ఏం చేయాలి?

సక్సెస్ సీక్రెట్ ఏంటి?

ఒక సినిమాకి సక్సెస్ ఎలా వస్తుందనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నిజానికి ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులు ఎలాంటి కథలను ఇష్టపడుతున్నారో అలాంటి కథలను రాసుకుని ప్రేక్షకులకు నచ్చేలా చెప్పినప్పుడే సినిమాలు సక్సెస్ తీరాలకు చేరుతాయి. ఒక కథ ప్రేక్షకుడిని ఎప్పుడు ఎంగేజ్ చేయగలుగుతుందంటే ఆ స్టోరీ కొత్తదనాన్ని యాడ్ చేసి ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు అది ప్రేక్షకుడిలో కొత్త ఆనందాన్ని తీసుకువస్తుంది.. దాంతో ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. తద్వారా సినిమా సక్సెస్ సాధిస్తుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో కొత్తదనాన్ని అనుసరించినప్పుడు ప్రేక్షకుడికి థ్రిల్ ఫీల్ ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో కథ రొటీన్ గా ఉన్న స్క్రీన్ ప్లే బాగుంటే ఆ సినిమాను సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది.

ఇవన్నీ చక్కగా కుదిరినప్పటికి కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. దానికి కారణం సినిమాను సరైన సమయంలో రిలీజ్ చేసి ఉండకపోవచ్చు. లేదంటే అప్పుడున్న ప్రేక్షకుల మైండ్ సెట్ కి ఆ సినిమా అంత ఎఫెక్టివ్ గా అనిపించకపోవచ్చు. ఫైనల్ గా ఆ సినిమాలు టివీ, ఓటిటి ల్లో మంచి ఆదరణ సంపాదించుకున్న క్రమంలో ఆ మూవీస్ కల్ట్ క్లాసిక్స్ గా నిలిచిపోతాయి. బెస్ట్ కథ, కథనాన్ని రాసుకొని మేకింగ్ లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేసిన మూవీని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. ఎమోషన్స్ తో కూడిన స్క్రిప్ట్ మాత్రమే సక్సెస్ సీక్రెట్..

'అల్ఫ్రెడ్ హిచ్ కాక్ ' ఏం చెప్పాడు...

ప్రేక్షకుడిని థియేటర్ లో 3 గంటల పాటు బోర్ లేకుండా కూర్చోబెట్టాలి. రెండు మూడు సార్లు ప్రేక్షకుడిని ఎమోషనల్ గా టచ్ చేస్తే ఆ మూవీ ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చుతుంది. ఈ ఎమోషనల్ సన్నివేశాలు స్క్రిప్ట్ నుంచే రావాలి మధ్యలో ఇరికించినట్టుగా ఉండకూడదు. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ 'అల్ఫ్రెడ్ హిచ్ కాక్' ఒక సినిమా సక్సెస్ కి స్క్రిప్ట్ మాత్రమే ముఖ్యమని చెప్పి సినిమాలు చేసి ప్రూవ్ చేశాడు. చాలా మంది దర్శకులు ఈ విషయాన్ని అంగీకరించారు. కాబట్టి స్క్రిప్ట్ ను బాగా రాసుకుంటే అందులో ప్రేక్షకుడి హృదయానికి తాకే సన్నివేశాలు ఉంటే సినిమా సక్సెస్ సాధిస్తుంది.

Tags:    

Similar News