చిన్న హీరోలకి నిదానమే ప్రధానమా.. లేదా పరుగు ముఖ్యమా..!

లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మౌళి.. ఆ సినిమా తర్వాత వెంటనే వరుస సినిమాలు చేయలేదు

Update: 2026-10-28 09:38 GMT

లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మౌళి.. ఆ సినిమా తర్వాత వెంటనే వరుస సినిమాలు చేయలేదు. దీంతో మౌళి కొత్త సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదనే మాటలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించా. కొంతమంది ఆయన ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతున్నారని అన్నారు. మరికొందరు మంచి కథల కోసం ఎదురుచూస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా ఈ విషయంపై మౌళి స్పందించారు.

మౌళి నటించిన కొత్త సినిమా దొంగ నా కొడకా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈ ప్రశ్న ఎదురైంది. తుపాకీ జర్నలిస్ట్ ఆయనను లిటిల్ హార్ట్స్ సినిమా తర్వాత ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారని అడిగారు. దీనికి మౌళి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

లిటిల్ హార్ట్స్ తర్వాత తాను చాలా కథలు విన్నానని మౌళి తెలిపారు. అయితే వాటిని రిజెక్ట్ చేశానని చెప్పలేనని అన్నారు. కొన్ని కథలు తనకు సరిపోవని అనిపించిందని వివరించారు. రోజుకు మూడు కథలు విన్న రోజులు కూడా ఉన్నాయని చెప్పారు. అలా చాలా స్క్రిప్టులు విన్నప్పటికీ, తనకు బాగా సరిపోతుందని అనిపించిన కథ మాత్రం దొంగ నా కొడకా అని వెల్లడించారు.

దీంతో లిటిల్ హార్ట్స్ తర్వాత మౌళి సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం మంచి కథల కోసం ఎదురుచూడటమేనని అర్థమవుతోంది. అయితే ఇక్కడ ఒక సందేహం కూడా వస్తోంది.

చాలాసార్లు చిన్న హీరోలు వరసగా సినిమాలు చేసిన తప్పే లేదు చేయకపోయినా తప్పే అన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న హీరో వరుసగా సినిమాల ఒప్పుకుని అవి కాస్త వరుసగా ఫ్లాప్ అయితే.. వాళ్ల కెరియర్ ముగిసిపోతుంది. అలా అని ఒక చిన్న హీరో కథలు వింటూ చాలా చిన్నగా రెండు సంవత్సరాలకి ఒకటి చేస్తే.. ఈ హీరోయిన్ ఏంటి పెద్ద స్టార్ హీరో లాగా రెండు సంవత్సరాలకి ఒకటి చేస్తున్నారు అని నెగెటివిటీ కూడా వస్తుంది. కాబట్టి చిన్న హీరోలు ఈ రెండిటి మధ్య బాలన్స్ చేయడం అనేది చాలా కష్టమైన పని.

కాబట్టి నిదానమే ప్రధానమా లేకపోతే పరుగు ముఖ్యమా అనేది ఎప్పుడు చిన్న హీరోలకు ఉండే ప్రశ్న గానే మిగిలిపోతుంది. ఏదేమైనా మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని ప్రేక్షకుల మధ్యలో గుర్తుండే సినిమాలు చేస్తే.. ఈ తరం చిన్న హీరోలే వచ్చేతరం స్టార్ హీరోలా అవుతారు అని చూపడంలో సందేహం లేదు.



Tags:    

Similar News