ఫుల్ ఫామ్ లో యువ హీరో..!

Update: 2021-04-02 14:30 GMT
యూత్ స్టార్ నితిన్ ఇటీవలే 'రంగ్ దే' అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాని ఆడియెన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు కానీ అనుకున్నంత రేంజ్ లో కాదు. అయితే ఈ సినిమా కార‌ణంగా నితిన్ కు కానీ.. ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ వారికి కానీ ఎవ‌రికీ ఎలాంటి డ్యామేజ్ చెయ్యలేదనే చెప్పాలి. వీరి కాంబినేషన్లో వచ్చిన 'భీష్మ' సినిమా సూపర్ హిట్ అవడంతో 'రంగ్ దే' సినిమాకి బిజినెస్ బాగా జరిగింది. 'భీష్మ' రేంజ్ స‌క్సెస్ కానప్పటికీ 'రంగ్ దే' సినిమా హిట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

హీరో నితిన్ విష‌యానికి వ‌స్తే, 'రంగ్ దే' వచ్చిన తర్వాత అతని లాస్ట్ మూవీ 'చెక్' ని అందరూ మ‌ర్చిపోయారు. 'చెక్' సినిమా ఆశించిన స్థాయిలో విజయం కాకపోవడంతో ఈ ప్రభావం 'రంగ్ దే' పై పడుతుందేమో అనుకుంటున్నారు. కానీ అది హిట్ అవడమే కాకుండా నితిన్ కెరీర్ కు ప్లస్ అయింది. ఈ జోష్ లో నితిన్ ''మ్యాస్ట్రో'' సినిమా చేస్తున్నాడు. 'అంధాదున్' తెలుగు రీమేక్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.

బర్త్ డే నాడు 'మాస్ట్రో' టీజర్ రావడంతో నితిన్ మ‌ళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అది కాస్తా 'రంగ్ దే' మూవీ సెకండ్ వీక్ క‌లెక్ష‌న్స్ కి కొద్దిగా హెల్ప్ అవ్వ‌డం గ‌మ‌నార్హం. ఇక మాస్ట్రో సినిమా జూన్ 11న రిలీజ్ అవుతోంది. అంటే 2021 ఫస్ట్ హాఫ్ లోనే నితిన్ మూడు సినిమాలను విడుదల చేస్తున్నాడన్నమాట. దీని తర్వాత కృష్ణ చైతన్య తో 'పవర్ పేట' సినిమాతో పాటు మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని టాక్. ఏదేమైనా వరుస సినిమాలతో నితిన్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పవచ్చు.
Tags:    

Similar News