జూనియర్ ఖుష్బూ అరంగేట్రం చేసేసింది!
అయితే అది తమిళ ఇండస్ట్రీ నుంచి కాదు.. మలయాళ ఇండస్ట్రీ నుంచి. అవంతికి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న మలయాళ మూవీ `ఆరంభం`.;
ప్రతి రంగంలో వారసులు అరంగేట్రం చేస్తున్నారు. వారి ఫ్యామిలీ లెగసీని కొంత మంది కంటిన్యూ చేస్తూ ఆ స్థాయి స్టార్‌లుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. కొంత మంది మాత్రం వారసత్వంతో ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ స్టార్‌లుగా నిలబడలేకపోతున్నారు. స్టిల్ అందు కోసం యుద్దం చేస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోనూ వారసులకు కొదవలేదు. క్రేజీ స్టార్‌లకు సంబంధించిన వారసులు అరంగేట్రం చేయడం స్టార్‌లుగా గుర్తింపుని తెచ్చుకోవడం తెలిసిందే. ఇప్పుడు మరో వారసురాలు తెరంగేట్రం చేస్తోంది.
తమిళనాట భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుని దేవతగా జేజేలందుకోవడమే కాకుండా గుడులు కూడా కట్టించుకునే స్థాయికి వెళ్లిన అలనాటి కథనాయిక ఖుష్బూ. ఆమె ఫ్యామిలీ నుంచి వారసురాలు ఎప్పుడెప్పుడు అరంగేట్రం చేస్తుందా? అని ఆమె అభిమానులు గత కొంత కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు వారసురాలి ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఏదీ నిజం కాలేదు. అయితే తాజాగా అది నిజమవుతోంది. అలనాటి కథనాయిక ఖుష్బూ, డైరెక్టర్ సుందర్‌ల కుమార్తె అవంతిక సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది.
అయితే అది తమిళ ఇండస్ట్రీ నుంచి కాదు.. మలయాళ ఇండస్ట్రీ నుంచి. అవంతికి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న మలయాళ మూవీ `ఆరంభం`. సుజేష్ అన్నీ ఏపెన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేరళలోని త్రిసూర్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. మలయాళంలో రూపొందుతున్న ఈ మూవీ తమిళంలోనూ రిలీజ్ కానుంది. ఇతర కీలక పాత్రల్లో సరిత, అల్తాఫ్ సలీమ్, ఇంద్రన్స్, విజయరాఘవన్, కృష్ణ శంకర్, కళాభవన్ షాజోన్, సునీల్ సుగత, విజి వెంకటేష్, నోబీ మార్కోస్, రాజేష్ శర్మ, రమేష్ కొట్టాయం తదితరులు నటిస్తున్నారు.
తన కుమార్తె అరంగేట్రానికి సంబంధించిన ఆనంద క్షణాలని నటి ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవంతికి ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తుందని చాలా రోజులుగా వార్తలు షికారు చేస్తున్నా కార్యరూపం దాల్చకపోవడంతో అంతా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా తను ప్రత్యేకంగా ఓ ఫొటో షూట్‌లో పాల్గొనడంతో అవంతిక ఎంట్రీకి టైమ్ వచ్చేసిందని క్లారిటీ వచ్చేసింది. అనుకున్నట్టే తమిళ సినిమాతో కాకుండా మలయాళ మూవీతో పరిచయం అవుతుండటం గమనార్హం.
గతంలో ఓ మీడియాతో మాట్లాడుతూ అవంతిక సినిమా రంగంలో తన ఎంట్రీకి సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఇండస్ట్రీలోకి రావాలనే ఉందని, అయితే తన హైట్ కారణంగా ఆలోచనలో పడ్డానని వెల్లడించింది. తాను 5:11 ఉంటానని, అది ఇబ్బందికలిగిస్తుందని భావించానని తెలిపింది. చాలా కాలంగా సినిమాల్లోకి రావాలని ఎదురుచూస్తున్నాను. ఒకప్పుడు లావుగా ఉన్నాను. కరోనా సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాను. ఇండస్ట్రీలోకి రావాలనే తపనతో ఇలా నాజూగ్గా మారిపోయాను` అని అప్పట్లో వెల్లడించింది. అనుకున్నట్టే హీరోయిన్‌గా ఆరంభంతో ఆరంభించింది.