నానిని పూర్తిగా మార్చేస్తున్న శ్రీకాంత్

నాని హీరోగా ద‌స‌రా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ది ప్యార‌డైజ్ అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2026-02-17 06:07 GMT

నేచురల్ స్టార్ నాని బ‌ర్త్ డే ను ది ప్యార‌డైజ్ టీమ్ ఈసారి మ‌రింత స్పెష‌ల్ గా మార్చ‌బోతుంది. నాని హీరోగా ద‌స‌రా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ది ప్యార‌డైజ్ అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ద‌స‌రా త‌ర్వాత నాని- శ్రీకాంత్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై అంద‌రికీ మంచి అంచ‌నాలున్నాయి. ఆ అంచనాల‌కు ఏ మాత్రం తీసిపోకుండా శ్రీకాంత్ ఈ మూవీని రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తోంది.



 


రా స్టేట్‌మెంట్ కు అద్భుత స్పంద‌న

ఇప్ప‌టికే ది ప్యార‌డైజ్ నుంచి రా స్టేట్‌మెంట్ పేరుతో వ‌చ్చిన టీజ‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ టీజ‌ర్ గ్లింప్స్ చూసిన‌ప్ప‌టి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ‌వుతుందా అని నాని ఫ్యాన్స్ తో పాటూ మూవీ ల‌వ‌ర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సాంగ్ ఆయా షేర్ ను ఫిబ్ర‌వ‌రి 24న నాని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌నున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఆయా షేర్ తో ప్రమోష‌న్స్ మొద‌లు

ఈ సాంగ్ లో నానిని లార్జ‌ర్ దెన్ లైఫ్ అవ‌తార్‌లో చూపించ‌నున్నార‌ని, ఈ పాట‌తోనే సినిమా ప్ర‌మోష‌న్స్ కు ఘ‌నంగా శ్రీకారం చుట్టాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. భారీ సెట్‌లో వంద‌లాది డ్యాన్స‌ర్ల‌తో ఈ సాంగ్ ను షూట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. మూవీ టోన్ కు స‌రిపోయేలా మంచి విజువ‌ల్ ట్రీట్ గా ఈ సాంగ్ ను డిజైన్ చేశార‌ట‌. ఈ సాంగ్ కోసం నాని ప్రెజెన్స్, ఎన‌ర్జీ హైలైట్ అయ్యేలా స్టెప్పుల‌ను కంపోజ్ చేశార‌ని, చూడ‌గానే ఆ స్టెప్పులు అంద‌రికీ న‌చ్చేస్తాయ‌ని మూవీ యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

అంచ‌నాల‌ను పెంచ‌నున్న ఫ‌స్ట్ సాంగ్

అనిరుధ్ అందించిన హై ఓల్టేజ్ మ్యూజిక్, దానికి త‌గ్గ‌ట్టు సుధ‌న్ మాస్ట‌ర్ మాస్ స్టెప్పుల‌ను కొరియోగ్ర‌ఫీ చేసిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయ‌ని మేక‌ర్స్ న‌మ్మ‌కంగా ఉన్నారు. ఆల్రెడీ అనిరుధ్- నాని కాంబినేష‌న్ పై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండ‌గా, ఈ ఇంట్రో సాంగ్ ఆ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా ఉండ‌బోతుంద‌ని అంటున్నారు. ప‌క్కింటి అబ్బాయిలాగా ఉండే నానిని ఆల్రెడీ ద‌స‌రా సినిమా కోసం మాస్ హీరోగా మార్చి, ఆ సినిమాతో మంచి స‌క్సెస్ ను అందుకున్న శ్రీకాంత్, ఇప్పుడు ది ప్యార‌డైజ్ లో మ‌రింత కొత్త‌గా ప్రెజెంట్ చేయ‌బోతుండ‌టం చూస్తుంటే నానిని, శ్రీకాంత్ పూర్తిగా మార్చేస్తున్నట్టు అనిపిస్తోంది.

ఆగ‌స్ట్ 21న ది ప్యార‌డైజ్ రిలీజ్

మ‌రోవైపు నాని బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ కానున్న ఆయా షేర్ సాంగ్ తో సోష‌ల్ మీడియాలో భారీ ట్రెండ్ క్రియేట్ చేయాల‌ని ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. వాస్త‌వానికి ది ప్యార‌డైజ్ మార్చిలోనే రిలీజ‌వాల్సింది కానీ అవుట్‌పుట్ లో కాంప్ర‌మైజ్ అవ‌డం ఇష్టం లేక డైరెక్ట‌ర్ శ్రీకాంత్ షూటింగ్ కు కాస్త ఎక్కువ టైమ్ తీసుకోవ‌డంతో సినిమా ఆగ‌స్ట్ 21కి వాయిదా ప‌డింది. ది ప్యార‌డైజ్ ను ద‌స‌రా సినిమాను నిర్మించిన సుధాక‌ర్ చెరుకూరి త‌న బ్యాన‌ర్ SLV సినిమాస్ లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News