పాన్ ఇండియా స్టార్ ఆ విష‌యంలో ప్ర‌త్యేకం!

అయితే ఇలాంటి క్రేజీ మీడియంని ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా వాడుకోవాలో తెలియ‌ని, అస‌లు సోష‌ల్ మీడియా అంటేనే పెద్ద‌గా ఆస‌క్తి లేని స్టార్ అంటూ ఉండ‌రన్న‌ది తెలిసిందే;

Update: 2026-02-17 05:27 GMT

ఈ రోజుల్లో అభిమానుల‌తో అత్యంత చేరువ‌గా ఉండాల‌న్నా... త‌మ సినిమాల ప్ర‌మోష‌న్స్‌ని చేయాల‌న్నా.. త‌మ సినిమాల అప్ డేట్‌ల‌ని ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అందించి హైప్ క్రియేట్ చేయాల‌న్నా ఉన్న ఏకైక మార్గం సోష‌ల్ మీడియా. అయితే ఇలాంటి క్రేజీ మీడియంని ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా వాడుకోవాలో తెలియ‌ని, అస‌లు సోష‌ల్ మీడియా అంటేనే పెద్ద‌గా ఆస‌క్తి లేని స్టార్ అంటూ ఉండ‌రన్న‌ది తెలిసిందే. అయితే అది అవాస్తం అని పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నిరూపిస్తున్నాడ‌ట‌.

ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాపై అంత ఆస‌క్తి లేద‌ని, దాన్ని ఎలా ఉప‌యోగించాలో కూడా తెలియ‌ద‌ని క్రేజీ హీరోయిన్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే తాజాగా ఓ షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. పూజా హెగ్డే ఇటీవ‌ల పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గురించి, ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాతో ఉన్న అనుబంధం, అవ‌గాహ‌న, ఆస‌క్తి గురించి ఇంట్రెస్టింగ్ విష‌యాల్ని వెల్ల‌డించింది. సోష‌ల్ మీడియా ఎలా ప‌ని చేస్తుంద‌న్న‌ది ప్ర‌భాస్‌కు చాలా త‌క్కువ తెలుస‌ని చెప్పుకొచ్చింది. ఒక ద‌శ‌లో దీన్ని పూర్తిగా వ‌దిలేయాల‌ని కూడా ఆలోచించాడ‌ని తెలిపింది.

ప్ర‌భాస్ స‌హ‌జంగానే డిజిట‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌నుకునే వ్య‌క్తి. సోష‌ల్ మీడియాలో రోజు వారి అప్ డేట్‌లు, అభిప్రాయాలు పంచుకోవ‌డానికి అత‌ని దృష్టిలో ఇది వేదిక కాదు. అంతే కాకుండా త‌ను అంద‌రిలా ఆన్ లైన్‌లో చురుగ్గా ఉండే వ్య‌క్తి కూడా కాద‌ని స్ప‌ష్టం చేసింది. ప్రొఫెష‌న‌ల్స్ ప‌ని చేసే మీడియంగా సోష‌ల్ మీడియాని ఆయ‌న భావిస్తార‌ని, ఆయ‌న‌కు సంబంధించిన ఓ వ్య‌క్తిగ‌త బృందం సోష‌ల్ మీడియా అకౌంట్‌ల‌ని నిర్వ‌హిస్తుంద‌ని పేర్కొంది. ప్ర‌భాస్ సోష‌ల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్‌ల‌లో క‌నిపించే పోస్ట్‌లు సినిమా ప్ర‌మోష‌న్‌లు, అధికారిక ప్ర‌క‌ట‌న‌లు, ఆయ‌న ప్రాజెక్ట్‌ల‌కు సంబంధించిన‌వి ఉంటాయంది.

మిగ‌తా హీరోల‌తో పోలిస్తే ప్ర‌భాస్ సోష‌ల్ మీడియా అప్ డేట్‌లు, వ్యక్తిగ‌త బ్రాండింగ్ కంటే వ‌ర్క్‌కే అధిక ప్రాధాన్య‌త ఇస్తాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఉరుకుల ప‌రుగులు జీవితంలో అంద‌రిలా అందిరితో ట‌చ్‌లో ఉంటాలంటే సోష‌ల్ మీడ‌యాలో యాక్టీవ్‌గా ఉండాల్సిందే. కానీ ప్ర‌భాస్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని పూజా చెప్పిన మాట‌ల్లో స్ప‌ష్ట‌మ‌వుతోంది. డిజిట్ యుగంలో ఉన్నా కానీ ఆ మాయ‌లో ప‌డ‌కుండా ప్ర‌భాస్ భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్త త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు.

కేవ‌లం అప్ డేట్‌ల‌పై దృష్టి పెట్ట‌కుండా ఆ బాధ్య‌త‌ని త‌న సోష‌ల్ మీడియా టీమ్‌కు అప్ప‌గించి త‌ను మాత్రం సినిమాలు, షూటింగ్‌ల‌పై దృష్టిపెడుతూ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ల‌కు దూరంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సందీప్ రెడ్డి వంగ `స్పిరిట్‌`, హ‌ను రాఘ‌వ‌పూడి ల‌వ్ వార్ డ్రామా `ఫౌజీ` చిత్రాల్లో న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే `క‌ల్కి` సీక్వెల్ `క‌ల్కి 2` కూడా సెట్స్ పైకి రాబోతోంది. దీని కోసం ప్ర‌భాస్ సిద్ద‌మ‌వుతున్నాడు.

Tags:    

Similar News