టాలీవుడ్ వ‌ర్సెస్ బాలీవుడ్ త‌ప్ప‌దా?

కానీ లోలోప‌ల మాత్రం సౌత్ ఇండ‌స్ట్రీ ఎదుగుద‌ల‌ను ఎంత మాత్రం ఓర్వ‌లేక‌పోతున్నారు? అన్న‌ది కాద‌న‌లేని నిజం.;

Update: 2026-02-17 04:03 GMT

ఒక‌ప్పుడు బాలీవుడ్ సౌత్ ఇండ‌స్ట్రీని ఎలా ట్రీట్ చేసేదో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ ఇండ‌స్ట్రీగా బాలీవుడ్ కొన‌సాగినంత కాలం సినిమాలంటే? హిందీ చిత్రాలు మాత్ర‌మే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించేది. కానీ కాలం అన్ని వేళ‌లా ఒక‌వైపే ఉండ‌ద‌ని కాల క్ర‌మంలో అర్ద‌మైంది. సౌత్ సినిమాలు..ప్ర‌త్యేకించి తెలుగు సినిమాలు పాన్ ఇండియాలో స‌త్తా చాట‌డంతో? బాలీవుడ్ స్వ‌రం మార్చుకునే ప్ర‌య‌త్నం చేసింది. త‌మ‌లో కలుపుకునే త‌త్వాన్ని అల‌వాటు చేసుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. అప్ప‌టి వ‌ర‌కూ బాలీవుడ్ సినిమా అన్న నోళ్లు..ఇండియ‌న్ సినిమా అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.

కానీ లోలోప‌ల మాత్రం సౌత్ ఇండ‌స్ట్రీ ఎదుగుద‌ల‌ను ఎంత మాత్రం ఓర్వ‌లేక‌పోతున్నారు? అన్న‌ది కాద‌న‌లేని నిజం. `ధురంధ‌ర్` 1300 కోట్ల వ‌సూళ్ల‌ను ఒక్క హిందీ భాష‌లోనే సాధించ‌డంతో? తామే నెంబ‌ర్ వ‌న్ అనే అంశాన్ని మ‌ళ్లీ లేవ‌నెత్తినంత ప‌ని చేసారు. సింగిల్ లాంగ్వేజ్ లో సాధించిన వ‌సూళ్లు ఇవి అంటూ టాలీవుడ్ పై పంచ్ వేసారు. తెలుగు సినిమాల‌న్నీ పాన్ ఇండియాలో రిలీజ్ అయి 1000 కోట్లు..1800 కోట్లు సాధించాయ‌ని గుర్తు చేసారు. సింగిల్ లాంగ్వేజ్ అంటూ బాలీవుడ్ పోస్ట‌ర్ వేయ‌డంపై ఇది టాలీవుడ్ పై ఉన్న అక్క‌సు అన్న‌ది బ‌య‌ట ప‌డింది.

అంత‌కు ముందు చోటు చేసుకున్న మ‌రికొన్ని ప‌రిణామ‌లు కూడా ఇలాంటి స‌న్నివేశాన్నే హైలైట్ చేసాయి. తెలుగు సినిమాకు ఆస్కార్ వ‌రించిన స‌మ‌యంలో బాలీవుడ్ స్త‌బ్దుగా ఉంది. తెలుగు వారి ప్ర‌తిభ‌ను కీర్తిస్తూ బాలీవుడ్ నుంచి పెద్ద‌గా ఎవ‌రూ స్పందించ‌లేదు. `ఆర్ ఆర్ ఆర్` కు అంత‌ర్జాతీయంగా వ‌చ్చిన గుర్తింపును గుర్తించ‌లేదు. `పుష్ప 2` బాలీవుడ్ లో వ‌సూళ్ల‌తో దున్నేస్తే? ఆ సినిమా గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడిన వారు అంటూ పెద్ద‌గా లేరు. ఇవ‌న్నీ తెలుగు సినిమాపై బాలీవుడ్ ఎంత అసంతృప్తిగా ఉంది? అన‌డానికి సూచిక‌లుగా అప్ప‌ట్లోనే అనుమానం వ్య‌క్త‌మైంది.

అలాగే బాలీవుడ్, తెలుగు ద‌ర్శ‌కుల‌కు, హీరోల‌కు అవ‌కాశాలు క‌ల్పించినా అక్క‌డ‌కు వెళ్లి ప‌ని చేయ‌డానికి ఎవ్వ‌రూ ఆస‌క్తి చూపించ‌లేదు. తాము ఏది సాధించాల‌నుకున్నా? హైద‌రాబాద్ లో ఉండే..తెలుగు సినిమా స‌త్తా ప్ర‌పంచానికి చాటుతాం అన్న తీరులో? బ‌ధులిచ్చారు. ఇవ‌న్నీ బాలీవుడ్ లో మ‌రింత ఆక్రోశాన్ని పెంచాయి. ఓపెన్ గా మాట్లాడ‌లేదు గానీ లోలోప‌ల మాత్రం ర‌గిలిపోతున్నారు. `ధురంధ‌ర్` విజ‌యంతో బాలీవుడ్ కి మ‌ళ్లీ రెక్క‌లొచ్చాయి. పాత ప‌ద్ద‌తిలో మ‌ళ్లీ గ‌ళం పెంచుతోంది. దీంతో ప‌రిస్థితులు మ‌ళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌ణ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. బాలీవుడ్ వ‌ర్సెస్ టాలీవుడ్ త‌ప్ప‌ద‌న్న సంకేతాలు అంత‌కంత‌కు బ ల‌ప‌డుతున్నాయి.

Tags:    

Similar News