STG నైట్ షూట్స్.. మెగా మేనల్లుడి కేరింగ్ ఎంతలా ఉందంటే?

హీరో అంటే షూటింగ్‌ కు రావడం.. తన సీన్లు చేసుకోవడం.. వెళ్లిపోవడం మాత్రమే కాదు. తనతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే హీరో అయితే ఆ కేరింగ్ అదుర్స్.

Update: 2026-09-29 23:30 GMT

హీరో అంటే షూటింగ్‌ కు రావడం.. తన సీన్లు చేసుకోవడం.. వెళ్లిపోవడం మాత్రమే కాదు. తనతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే హీరో అయితే ఆ కేరింగ్ అదుర్స్. ఇప్పుడు మెగా మేనల్లుడు, యంగ్ హీరో సాయిదుర్గ తేజ్ విషయంలో సంబరాల ఏటిగట్టు (SYG) నిర్మాత చైతన్య రెడ్డి చేసిన కామెంట్స్ అదే విషయాన్ని చూపిస్తున్నాయి.

హనుమాన్ తర్వాత సాయిదుర్గ తేజ్ తమకు ఇచ్చిన సపోర్ట్ గురించి చైతన్య రెడ్డి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సినిమా కోసం జరిగిన నైట్ షూట్స్ సమయంలో తేజ్ చూపించిన కేరింగ్‌ ను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాత్రి సమయాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తేజ్ అక్కడి పరిస్థితులను గమనించేవారని చైతన్య రెడ్డి చెప్పారు.

ఇంత రాత్రి సమయంలో కూడా చెల్లెమ్మ(చైతన్య రెడ్డి) ఎందుకు ఇబ్బంది పడుతోందని అడిగేవారని తెలిపారు. అందరినీ పిలిచి ముందుగానే అవసరమైన విషయాలు చూసుకోవాలని సూచించేవారని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని తేజ్ చెప్పేవారని చైతన్య రెడ్డి వెల్లడించారు. తన విషయంలో కూడా సాయిదుర్గ తేజ్ వ్యక్తిగతంగా చాలా కేర్ తీసుకున్నారని తెలిపారు.

దీంతో షూటింగ్‌ లో హీరోగా తన బాధ్యతను పూర్తి చేయడంతో పాటు, తనతో కలిసి పనిచేసే వారి గురించి కూడా తేజ్ ఆలోచించారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. హనుమాన్’ తర్వాత తమ వెనుక సపోర్ట్‌ గా నిలిచిన వ్యక్తుల్లో సాయిదుర్గ తేజ్ ముఖ్యమైనవారని చైతన్య రెడ్డి అన్నారు. కథపై నమ్మకంతో పాటు తమపై కూడా నమ్మకం పెట్టుకుని తమ సినిమాకు అండగా నిలిచారని తెలిపారు.

కేవలం నటుడిగా మాత్రమే కాకుండా సినిమా మేకింగ్ విషయంలోనూ తేజ్ సహకారం అందించారని చెప్పారు. పాత్ర కోసం చేసిన ట్రాన్స్ఫర్మేషన్‌ లోనూ, సినిమా తెరకెక్కించే విధానంలోనూ తమకు మద్దతుగా నిలిచారని చైతన్య రెడ్డి పేర్కొన్నారు. ఇక సంబరాల ఏటిగట్టు విషయానికి వస్తే.. సాయిదుర్గ తేజ్‌ను ఇప్పటివరకు చూడని విధంగా కొత్త అవతార్‌ లో చూపించేందుకు దర్శకుడు రోహిత్ కేపీ ప్రయత్నిస్తున్నారు.

పీరియాడికల్ మిథికల్ యాక్షన్ డ్రామాగా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హనుమాన్ తో భారీ విజయం అందుకున్న ప్రైమ్‌ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ మూవీకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

కథలో నీటి కోసం ప్రజలు పడే కష్టాలు వంటి ఎలిమెంట్స్ మెయిన్ గా ఉంటాయని ఇప్పటికీ మూవీ టీం వెల్లడించింది. భారీ సెట్స్‌ లో వందలాది మంది ఆర్టిస్టులతో కీలక సన్నివేశాలను షూట్ చేసింది. అయితే ఇప్పుడు సంబరాల ఏటిగట్టు మూవీలో సాయి దుర్గ తేజ ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ఒకవైపు ఉంటే.. షూటింగ్ సమయంలో ఆయన చూపించిన కేరింగ్ ఇప్పుడ హాట్ టాపిక్‌ గా మారింది.

Tags:    

Similar News