AI క‌లిపిన బంధం.. షికంజ మాలిక్ మీట్స్ బ్లాక్ స్వోర్డ్

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మంచు మోహన్‌బాబు- మంచు మనోజ్ కలయికకు సంబంధించిన ఒక సరికొత్త ఇన్‌స్టాగ్రామ్ రీల్ గురించే చర్చ జరుగుతోంది.

Update: 2026-09-29 16:31 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మంచు మోహన్‌బాబు- మంచు మనోజ్ కలయికకు సంబంధించిన ఒక సరికొత్త ఇన్‌స్టాగ్రామ్ రీల్ గురించే చర్చ జరుగుతోంది. లెజెండరీ నటుడు మోహన్‌బాబు `ది ప్యారడైజ్` చిత్రంలో అత్యంత పవర్‌ఫుల్ అయిన `షికంజ మాలిక్` పాత్రలో అల‌రించ‌గా.. ఆయన తనయుడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ `మిరాయ్` చిత్రంలో `ది బ్లాక్ స్వోర్డ్` (మహాబీర్ లామా) అనే భీకరమైన గెటప్‌లో అలరించారు. ఈ రెండు క్రేజీ క్యారెక్టర్లు ఒకే ఫ్రేమ్‌లో ప్రత్యక్షం కావడం సినిమా ప్రియులలో ఉత్సాహం నింపింది.

ఈ స్పెషల్ రీల్‌లో తండ్రీకొడుకులు ఇద్దరూ తమ సినిమాలలోని మాస్ అండ్ ఇంటెన్స్ గెటప్‌లతో పాటు పాప్ స్టార్స్ తరహా స్వాగ్- స్టైలిష్ ఎప్రోచ్‌తో అదరగొట్టారు. ఒకవైపు మోహన్‌బాబు తనదైన గంభీరమైన అప్పీయరెన్స్, సీరియస్ లుక్‌తో `షికంజ మాలిక్` వైబ్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లగా.. మరోవైపు మంచు మనోజ్`ది బ్లాక్ స్వోర్డ్` రూపంలో సరికొత్త యాక్షన్ వైబ్రేషన్స్‌ను క్రియేట్ చేశారు. కేవలం సినిమా ప్రమోషన్స్ కాకుండా ఒక పాప్ మ్యూజిక్ ఆల్బమ్ తరహాలో ఈ వీడియోను డిజైన్ చేయడం యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇది ఒక ఏఐ వీడియో మాత్ర‌మే అనేది గ్ర‌హించాలి.

మంచు ఫ్యామిలీలో ఇటీవ‌లి క‌ల‌త‌ల గురించి తెలిసిందే. మోహ‌న్ బాబు ఆయ‌న కుమారుడు మంచు మ‌నోజ్ మ‌ధ్య కొన్ని మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయి. ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు దూర‌మ‌వ్వ‌డం అభిమానుల్ని క‌ల‌చివేసింది. కానీ ఇప్పుడు ఈ ఏఐ వీడియో వారిద్ద‌రినీ ద‌గ్గ‌ర‌గా క‌లిపింది. అందుకే ఇది సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. తండ్రి కొడుకుల‌ మాస్ కొలాబరేషన్ చూసిన నెటిజన్లు, అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

మొత్తానికి, `షికంజ మాలిక్`.. `ది బ్లాక్ స్వోర్డ్`ల సరికొత్త కలయిక సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. స్టైల్, యాక్షన్, మాస్ ఎలివేషన్స్ కలబోతగా వచ్చిన ఈ ఏఐ వీడియో టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మంచు మనోజ్..లెజెండరీ మోహన్‌బాబుతో కలిసి చేసిన ఈ మ్యాజిక్ ఆస‌క్తిని క‌లిగించింది.




Tags:    

Similar News