చంద్రశేఖర్ ఏలేటిని మించి పోవాలి.. డెబ్యూ దర్శకుడికి కీరవాణి బ్లెస్సింగ్స్
టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది.
టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. సంగీత సంచలనం ఎం.ఎం. కీరవాణి ముఖ్య అతిథులుగా విచ్చేసి సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఈ చిత్రంతో ఫాహద్ ఫాజిల్ తెలుగు తెరపైకి పూర్తిస్థాయిలో అడుగుపెడుతుండటం విశేషం.
ఇదే వేదికపై సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనదైన శైలిలో మాట్లాడుతూ అందరిలో జోష్ నింపారు. దర్శకుడు శశాంక్ తన గురువు ఏలేటి చంద్రశేఖర్‌ను మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకోవాలని.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్న కాలభైరవకు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. అలాగే నిర్మాతగా మారుతున్న ఎస్.ఎస్. కార్తికేయకు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం దక్కాలని మనసారా దీవించారు. ఈ సందర్భంగా వేదికపై అందరితో కలిసి `జై బాలయ్య`, `జై ఎన్టీఆర్`, `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` అంటూ ఉత్సాహభరితమైన నినాదాలు చేయించారు.
నిర్మాత శోభు యార్లగడ్డ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మద్దతు తెలిపిన తారక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాహద్ ఫాజిల్ తెలుగులోకి అడుగుపెట్టడం తమ బ్యానర్‌కు ఎంతో గౌరవమని.. ఆయనతో పాటు ధీటుగా నటించిన సారా నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. దర్శకుడు శశాంక్ ఎంతో పట్టుదలతో తన ఆలోచనను నిజం చేసుకున్నారని.. ఈ ప్రాజెక్ట్ వెనుక కష్టపడిన యువ టెక్నీషియన్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదే వేదికపై నిర్మాతగా అడుగుపెడుతున్న ఎస్.ఎస్. కార్తికేయ ప్రయాణాన్ని శోభు యార్లగడ్డ ప్రశంసించారు. తమతో గత 15 సంవత్సరాల అనుబంధం ఉన్న కార్తికేయ.. బడ్జెట్, షెడ్యూల్స్ , దర్శకుడి విజన్‌ను సమన్వయం చేస్తూ ఒక పరిపూర్ణ నిర్మాతగా వ్యవహరించిన తీరు అరుదైనదని తెలిపారు. చివరిగా ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించిన బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. చక్కని వినోదం.. భావోద్వేగాలతో కూడిన ఈ అద్భుతమైన చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రేక్షకులందరూ థియేటర్లలో చూసి విజయవంతం చేయాలని కోరారు.