'కల్కి 2' సుమతి పాత్ర చుట్టూ అంతుచిక్కని మిస్టరీ!
అయితే పార్ట్ 2 నిర్మాణ సమయానికి దీపికా పదుకొణే ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. దీంతో దీపిక స్థానంలో మరొక నటిని తీసుకొస్తారా? లేదా? అన్న దానిపై రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
'కల్కి 2898 AD' సీక్వెల్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ పార్ట్ సాధించిన విజయం తర్వాత రెండవ భాగం కల్కి 2` అసాధారణ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఈ కథ మొత్తానికి జీవనాడి లాంటి సుమతి పాత్ర చుట్టూ అంతుచిక్కని మిస్టరీ కనిపిస్తుంది. తొలి భాగంలో సుమతి పాత్రలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణే అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. సుమతి గర్భంలో పెరుగుతున్న పిండమే కల్కి అవతారమని చూపించడంతో కథ మొత్తం ఆ పాత్ర రక్షణ చుట్టూనే తిరిగింది. అయితే పార్ట్ 2 నిర్మాణ సమయానికి దీపికా పదుకొణే ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. దీంతో దీపిక స్థానంలో మరొక నటిని తీసుకొస్తారా? లేదా? అన్న దానిపై రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
ఈ క్రమంలో దర్శకుడు నాగశ్విన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ సస్పెన్స్‌ను మరింత పెంచాయి. `కల్కి 2`లో కొత్తగా ఎలాంటి కొత్త పాత్రలు రావడం లేదని పార్ట్ 1లోని పాత్రలే సీక్వెల్‌లో కొనసాగుతాయని పేర్కొన్నారు. దీంతో అసలు సుమతి పాత్ర కథనం సీక్వెల్‌లో ఎలా? ఉండబోతోందనేది పెద్ద పజిల్‌లా మారింది. ఒకవేళ దీపికా స్థానంలో కొత్త నటిని రీ-కాస్ట్ చేసినా? అది పాత పాత్రే అవుతుంది కానీ కొత్త పాత్ర కాదు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
అయితే దీపికా ఎగ్జిట్ నేపథ్యంలో సుమతి పాత్రను అక్కడితోనే ముగిస్తారా? లేక తొలి భాగంలో తీసిన దృశ్యాలతోనే ఆ పాత్రకు ముగింపునిస్తారా? అనేది మిస్టరీగా మారింది. సుమతి పాత్ర ప్రయాణాన్ని పార్ట్ 2 ఆరంభంలోనే ముగించి కథను పూర్తిగా కమల్ హాసన్ (యాస్కిన్), ప్రభాస్ (భైరవ), అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ)ల మధ్య యుద్ధం వైపు మళ్లిస్తారా? అన్న కోణంలో కూడా విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
నాగ్ అశ్విన్ - వైజయంతి మూవీస్ మేకర్స్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సుమతి పాత్ర పరిణామం ఏంటనేది సినిమా థియేటర్లలో విడుదలయ్యే వరకు ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌గా ఉంచాలని భావిస్తున్నారు. నాగవంశీ కూడా ఈ విషయంలో సినిమా రిలీజ్ వరకు ఎలాంటి క్లారిటీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ రహస్యాన్ని థియేటర్లలోనే ప్రేక్షకులు చూసి తెలుసుకోవాలనేది చిత్ర బృందం ప్లాన్‌గా కనిపిస్తోంది.
ఏదేమైనా? ఈ మిస్టరీ పై ఉన్న క్రేజ్ ఆసక్తిని రెట్టింపు చేసింది. మొదటి భాగంలో తెరపైకి వచ్చిన పాత్రల మధ్య జరగబోయే మహా సంగ్రామానికి తోడు సుమతి పాత్ర చుట్టూ ఉన్న ఉత్కంఠ ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తోంది. ఈ సస్పెన్స్ వీడి సుమతి కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.