తారక్ - త్రివిక్రమ్.. ఫ్యాన్స్ ఫిక్సయినవి కాదన్నమాట
తారక్ త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి టైటిల్ మీదే ఫ్యాన్స్‌లో హడావుడి కనిపిస్తోంది.
తారక్ త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి టైటిల్ మీదే ఫ్యాన్స్‌లో హడావుడి కనిపిస్తోంది. అధికారిక పోస్టర్‌లో కార్తికేయుడి రిఫరెన్స్ ఇచ్చేయడంతో కథ ఏ వైపు వెళ్లబోతోందో ఒక ఐడియా వచ్చింది. అక్కడి నుంచి ‘గాడ్ ఆఫ్ వార్’, ‘దేవసేనాపతి’ పేర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కొందరు అయితే వాటిలో ఒకటి ఫిక్స్ అయిపోయిందనే రేంజ్‌లో ఫ్యాన్ పోస్టర్లు కూడా తయారు చేశారు. అప్పటి నుంచి అసలు పేరు ఏంటన్న క్యూరియాసిటీ పెరిగింది.
ప్రత్యేకంగా ‘దేవసేనాపతి’ పేరు కార్తికేయుడి కథకు సరిపోతుందని ఒక వర్గం ఫ్యాన్స్ బలంగా నమ్మింది. మరోవైపు NTRకి ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా మార్కెట్ చూసి ‘గాడ్ ఆఫ్ వార్’ లాంటి టైటిల్ బెటర్ అని మరికొందరు చెప్పుకున్నారు. సినిమా నుంచి మరో అధికారిక అప్డేట్ రాకపోయినా, ఈ రెండు పేర్లు మాత్రం ప్రాజెక్ట్‌తో కలిసి తిరుగుతూనే వచ్చాయి. దాంతో ఇవే షార్ట్‌లిస్ట్‌లో ఉన్నాయేమో అనే ఫీలింగ్ వచ్చింది.
ఇప్పుడు త్రివిక్రమ్ ఇచ్చిన క్లారిటీతో ఆ ప్రచారానికి కాస్త బ్రేక్ పడింది. ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్‌లో NTR సినిమా గురించి అడిగితే స్క్రిప్ట్ రెడీగా ఉందని చెప్పిన ఆయన, టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని స్పష్టం చేశారు. అంటే ఇప్పటివరకు ఫ్యాన్స్‌లో తిరిగిన పేర్లు ఏవీ అధికారికంగా లాక్ కాలేదు. టీమ్ ఇంకా పేరు మీద నిర్ణయం తీసుకోలేదన్నది క్లియర్ అయింది.
ఈ సినిమాకు టైటిల్ సెట్ చేయడం మాత్రం అంత ఈజీ కాదు. కార్తికేయుడి నేపథ్యం ఉండటంతో తెలుగు ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయ్యే పేరు కావాలి. అదే సమయంలో NTR మార్కెట్ ఇప్పుడు ఇతర భాషల్లో కూడా భారీగా ఉంది. కాబట్టి పేరు లోకల్ ఫీల్ కోల్పోకుండా, బయట మార్కెట్‌లో కూడా సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి. మైథాలజీ టచ్‌ను ముందే చెప్పాలా, లేక కథలోకి వెళ్లాక రివీల్ చేయాలా అన్నదీ పేరుపై ప్రభావం చూపొచ్చు.
అందుకే టైటిల్ ఆలస్యమవుతుందా అనే డౌట్ రావచ్చు. అయితే టీమ్ నుంచి అలాంటి కారణం ఏదీ చెప్పలేదు. స్క్రిప్ట్ పూర్తయిందని త్రివిక్రమ్ చెప్పడం వల్ల కథపై పని ఒక స్టేజ్ దాటిందనే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పేరు ఎంచుకునే విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారన్నదే అసలు పాయింట్. ఇప్పటికే రెండు పేర్లు పాపులర్ కావడంతో, కొత్త టైటిల్ వస్తే మొదటి రియాక్షన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
ఇప్పటికే అధికారిక పోస్టర్ సినిమాకు మైథాలజీ టచ్ ఎంత ముఖ్యమో చెప్పేసింది. ఇప్పుడు టైటిల్ వచ్చాకే మేకర్స్ ఆ కథను ఏ టోన్‌లో మార్కెట్ చేయబోతున్నారో ఇంకాస్త అర్థమవుతుంది. ‘గాడ్ ఆఫ్ వార్’, ‘దేవసేనాపతి’లో ఏదీ కాకుండా పూర్తిగా కొత్త పేరు కూడా రావచ్చు. అందుకే తదుపరి అప్డేట్‌లో ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూసేది కాస్టింగ్ కంటే ముందుగా టైటిల్‌కే కావచ్చు. చూడాలి మరి ఎలా సెట్ చేస్తారో.