• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

| ‘పెద్ది’ కోసం 16 నెలల పాటు కష్టపడి పహిల్వాన్ ఫిజిక్ సాధించిన రామ్ చరణ్, ఇప్పుడు సుకుమార్‌తో చేయబోయే #RC17 కోసం మళ్లీ లుక్ మార్చుకుంటున్నారు. జుట్టు, శరీరాకృతిలో మార్పులు చేసుకుంటూ కొత్త పాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమయ్యేలోపు అనుకున్న లుక్‌లోకి మారేందుకు కసరత్తు చేస్తున్నారు.

By - M Prashanth
Update: 2026-11-21 08:35 GMT

రామ్ చరణ్‌కు ఈ మధ్యకాలంలో సినిమా షూటింగ్ కంటే లుక్ మార్చుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఒక సినిమా కోసం నెలల తరబడి బరువు పెరిగితే, మరో సినిమా కోసం అదే బరువును తగ్గించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా 'పెద్ది' కోసం చరణ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ సినిమా నుంచి బయటకు వచ్చి మరో కొత్త పాత్ర కోసం మళ్లీ మొదటి నుంచి కసరత్తులు మొదలుపెట్టారు.

'రంగస్థలం'తో చరణ్ లుక్‌ను పూర్తిగా మార్చేసిన దర్శకుడు సుకుమార్. అంతకుముందు ఎక్కువగా స్టైలిష్ లుక్స్‌లో కనిపించిన చరణ్‌ను పల్లెటూరి కుర్రాడిగా చూపించారు. ఆ తర్వాత రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' కోసం చరణ్ మరింత ఫిట్‌గా తయారయ్యారు. అయితే బుచ్చిబాబు 'పెద్ది' కోసం మాత్రం రెగ్యులర్ జిమ్ బాడీ కాకుండా పహిల్వాన్ తరహా ఫిజిక్ అవసరమైంది. అందుకు తగ్గట్టుగా చరణ్ తన వర్కౌట్స్‌ను మార్చుకున్నారు.

'పెద్ది'లో చరణ్ ఫిజిక్ కోసం దాదాపు 16 నెలలు కేటాయించినట్లు ఫిట్‌నెస్ ట్రైనర్ రాకేష్ ఉద్దియార్ అప్పట్లో వెల్లడించారు. వారంలో మూడు రోజులు వెయిట్ ట్రైనింగ్, మరో మూడు రోజులు కుస్తీకి సంబంధించిన వ్యాయామాలు చేసేవారట. షూటింగ్ ఉన్న రోజుల్లో కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకే వర్కౌట్స్ మొదలుపెట్టేవారని చెప్పారు. షూటింగ్ లొకేషన్‌లోనే జిమ్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందట.

అయితే ఇంత కష్టపడి పెంచిన బాడీని ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం తగ్గించుకోవాల్సి వస్తోంది. 'పెద్ది' కోసం పెంచిన జుట్టుతో పాటు ఫిజిక్‌ను కూడా పూర్తిగా మార్చుకుంటున్నట్లు సమాచారం. వరుసగా రెండు సినిమాలకు భిన్నమైన లుక్స్ అవసరం కావడంతో చరణ్‌కు మధ్యలో పెద్దగా బ్రేక్ కూడా దొరకడం లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తే ఫిట్‌నెస్ విషయంలో ఇన్ని మార్పులు అవసరం ఉండవు.

ముఖ్యంగా 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్', 'పెద్ది' చిత్రాల్లో చరణ్ రగ్గడ్ లుక్స్‌లో కనిపించారు. ఈసారి సుకుమార్ ఎలాంటి లుక్ సెట్ చేస్తారనే క్యూరియాసిటీ అభిమానుల్లో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌లో శ్రీకృష్ణకు సంబంధించిన హింట్స్ ఇచ్చారు. అయితే కథ ఏ కాలంలో జరుగుతుంది, చరణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇటీవల చరణ్ మళ్లీ తన ఫిట్‌నెస్ ట్రైనింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించేలోపు సుకుమార్ అనుకున్న లుక్‌లోకి మారేందుకు సిద్ధమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Tags:    
  • ramcharan 
  • rc17 
  • peddi 
  • sukumar 
  • mythrifilmmakers 
  • rangasthalam 

Similar News

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...

2026-11-21 08:38 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

సమంత కొడుకు పేరు వెనుక కథ ఏమిటి?

2026-11-21 08:35 GMT

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

2026-11-21 08:35 GMT

పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!

2026-11-21 07:30 GMT

తండ్రిని మించిన‌ సూప‌ర్ స్టార్ల‌గా యాత్ర‌-లింగ‌!

2026-11-21 06:38 GMT

అత్యంత పిరికి జేమ్స్ బాండ్ గా కొత్త బాండ్!

2026-11-21 06:34 GMT

ఆలియా భట్‌కు ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి!

2026-11-21 06:33 GMT

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. సంచలన కామెంట్స్ చేసిన ఉపాసన

2026-11-21 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS