• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏఐ విజువల్స్ పై రాంగోపాల్...

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

| దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏఐ విజువల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ ఎంత అద్భుతమైన విజువల్స్ సృష్టించినా వాటికి మనుషులు రూపొందించిన కళకు ఉన్న గుర్తింపు, విలువ ఉండవని అభిప్రాయపడ్డారు. ఒక పెయింటింగ్‌కు దాని సృష్టికర్త పేరు బ్రాండ్‌గా మారినప్పుడే గుర్తింపు వస్తుందని, ఏఐ విజువల్స్‌కు అలాంటి విలువ ఉండదని పేర్కొన్నారు.

By - Madhu Reddy
Update: 2026-11-21 08:39 GMT

చిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాంగోపాల్ వర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తూ వివాదాస్పద దర్శకుడిగా కూడా ఈయన పేరు సొంతం చేసుకున్నారు. అయితే పేరుకైతే అలా ఆడియన్స్ చేత పిలిపించుకుంటున్నారు కానీ ఆయన దర్శకత్వ విలువలకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా క్షణక్షణం, గోవిందా గోవిందా, రక్త చరిత్ర, శివ లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు ఆయన డైరెక్షన్ విజన్ కి అద్దం పడుతున్నాయి.

అలాంటి ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాంగోపాల్ వర్మ ఈమధ్యకాలంలో అడపాదడపా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. తాజాగా ఏఐ విజువల్స్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంగోపాల్ వర్మ.. ఏఐ విజువల్స్ పై మాట్లాడుతూ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. సాధారణంగా అనుభవజ్ఞులంతా కూడా ఇది ఫేక్.. ఇది ఒరిజినల్ అని కంపేర్ చేసి మరీ మనకు చెబుతున్నారు. కానీ ఏఐ ఫేక్ చేయదు. మనకు ఎలా కావాలంటే అలా పిక్చర్ ఇస్తుంది. దీనిని ఎక్స్పర్ట్ కూడా గుర్తించలేడు.

నిజానికి ఒకప్పుడు ఏఐ లేదు కాబట్టి ఇది గ్యారెంటీగా తర్వాత వచ్చింది.. ఇంతకాలం బయటపడలేదు కాబట్టి ఇది ఫేక్ అని చెప్పవచ్చు. కానీ మెటీరియలైజ్ ఇవ్వలేము. అలాంటి ఏఐ ఇప్పుడు బ్రహ్మాండమైన విజువల్స్ చేస్తూ ఉంటే.. ఇక దానికి గుర్తింపు ఎలా ఉంటుంది. బాహుబలి వచ్చాక దాని విజువల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రెండేళ్లకు దాని సీక్వెల్ కూడా వచ్చింది. ఆ విజువల్స్ కి అభిమానులు, సినీ ప్రియులు ముచ్చట పడిపోయారు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చాక అలాంటి విజువల్స్ రోజుకు 1000 ఇస్తుంది. మీరు భవిష్యత్తులో కూడా కనీవినీ ఎరుగని విజువల్స్ ఇస్తుంది. అయితే అలాంటి కనీవినీ ఎరుగని విజువల్స్ కి విలువ ఉంటుందా? అసలు ఎవరికి ఉంటుంది? దేనికి ఉంటుంది?

ఉదాహరణకు మీకు చెప్పాలి అంటే.. పెయింటింగ్ అనేది ఫలానా వ్యక్తి గీశాడు అని, దానిపైన ఆ గీసిన వ్యక్తి పేరు ఉన్నప్పుడే ఆ పెయింటింగ్ కి గుర్తింపు ఉంటుంది. అయితే పేరు లేకుండా అదే పెయింటింగ్ తీసుకెళ్లి మీరు అమీర్ పేట్ లో పెడితే పది రూపాయలు కూడా రావు. ఎందుకంటే పేరు అనేది ఒక స్టేటస్ సింబల్. నా దగ్గర రోల్స్ రాయిస్ ఉంది అంటే ఆ బ్రాండ్ ని చూసి ఎవరైనా సరే దానిని కొంటారు. అందుకే చెబుతున్న ఏఐ లాంటి ఎన్ని విజువల్స్ మార్కెట్లోకి వచ్చినా.. వాటికి గుర్తింపు ఉండదు. కాబట్టి విలువ ఉండదు. అదే విజువల్ ని ఒక మనిషి రూపొందిస్తే.. దానికి ఎంత విలువ ఉంటుందో ఆలోచించండి అంటూ మనిషి ఆలోచనలకు, ఏఐ విజువల్స్ కి మధ్య తేడాను రాంగోపాల్ వర్మ స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఏదైనా సరే బ్రాండ్ ఉంటేనే దానికి విలువ అంటూ చెప్పిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Tags:    
  • ramgopalvarma 
  • rgv 
  • aivisuals 
  • artificialintelligence 
  • aicreativity 

Similar News

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...

2026-11-21 08:38 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

2026-11-21 08:35 GMT

సమంత కొడుకు పేరు వెనుక కథ ఏమిటి?

2026-11-21 08:35 GMT

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

2026-11-21 08:35 GMT

పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!

2026-11-21 07:30 GMT

తండ్రిని మించిన‌ సూప‌ర్ స్టార్ల‌గా యాత్ర‌-లింగ‌!

2026-11-21 06:38 GMT

అత్యంత పిరికి జేమ్స్ బాండ్ గా కొత్త బాండ్!

2026-11-21 06:34 GMT

ఆలియా భట్‌కు ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి!

2026-11-21 06:33 GMT

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. సంచలన కామెంట్స్ చేసిన ఉపాసన

2026-11-21 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS