ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...
| 2026లో మూడు వరుస విజయాలతో తమిళ స్టార్ సూర్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కథనం పేర్కొంది. ‘వీరభద్రుడు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’, ‘సీన్’ చిత్రాలతో విభిన్న జానర్లలో ప్రేక్షకులను అలరించినట్లు తెలిపింది. కథల ఎంపికలో వైవిధ్యం, దర్శకులకు స్వేచ్ఛ ఇవ్వడం ఆయన విజయాలకు కారణమని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకే గుర్తింపు ఉంటుంది. ఒక సక్సెస్ ని సాధించడానికి చాలామంది హీరోలు డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రయోగాత్మకమైన సినిమాలు సక్సెస్ ని సాధిస్తే మరి కొన్నిసార్లు సినిమా సరిగ్గా ఆడకపోయినా వాళ్ళ ప్రయత్నానికి గుర్తింపైతే లభిస్తుంది... ఎలాంటి సినిమా చేసినా కూడా సక్సెస్ ఉన్నవాళ్ళనే ఇండస్ట్రీ ఆదరిస్తుంది. ఇక్కడ వాళ్లకు మాత్రమే ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి... ఈ సంవత్సరం చాలామంది స్టార్ హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఒక స్టార్ హీరో మాత్రం అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకున్నాడు. ఆయనే తమిళ్ హీరో సూర్య...ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల హృదయాలో చోటు సంపాదించుకున్నాడు.
ఈ ఇయర్ లో టాప్ అతనే...
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగిన నటుడు సూర్య. కెరీర్ మొదటి నుంచి తమిళంలో చేసిన సినిమాలను తెలుగులో డబ్ చేసి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఈ సంవత్సరం ఆయన మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. వీరభద్రుడు సినిమాతో ఇయర్ లో మొదటి విజయాన్ని అందుకున్నాడు. 'విశ్వనాథన్ అండ్ సన్స్' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించాడు. రీసెంట్ గా 'సీన్' సినిమాతో కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి తన మార్క్ యాక్టింగ్ ని జోడించి మొత్తానికైతే సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో తను కీలకపాత్ర వహించాడు...
ఈ సంవత్సరం ఎంత మంది స్టార్ హీరోలు వచ్చిన కూడా సూర్య హ్యాట్రిక్ విజయాలతో నెంబర్ వన్ పొజిషన్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. తెలుగు తమిళ్ హీరోలతో పోల్చుకుంటే సూర్య కి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. డిఫరెంట్ జానర్స్ లో కథలను ఎంచుకొని అది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మేకర్స్ తో చర్చించి అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి దర్శకులకు పూర్తి స్వేచ్ఛ ను ఇస్తున్నాడు. అందువల్లే అతని నుంచి బెస్ట్ కంటెంట్లు వస్తున్నాయి అంటూ సినీ విమర్శకులు సైతం అతన్ని ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా కూడా 2026వ సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సంవత్సరం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే ఏమీ రాలేదు. స్టార్ హీరోలు చాలా వరకు ఈ సంవత్సరం థియేటర్లకి రాలేదనే చెప్పాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి నటులు వచ్చారు. వాళ్ల సినిమాలతో మెప్పించినప్పటికి 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఒక్కటి కూడా రాలేదు...వచ్చే ఏడాది స్టార్ హీరోలు తమ ప్రస్టీజీయస్ ప్రాజెక్ట్ లతో వస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీ హిట్లు నమోదయ్యే అవకాశం ఉంది.