• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత కొడుకు పేరు వెనుక కథ...

సమంత కొడుకు పేరు వెనుక కథ ఏమిటి?

| సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు నవంబర్ 19న మగబిడ్డ జన్మించగా, అతడికి ‘దేవ్’ అని పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో 2014లో ఓ టీవీ షోలో సమంతకు మొదటి సంతానంగా మగబిడ్డ పుడతాడని ఓ పండితుడు చెప్పిన జోస్యం వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. 12 ఏళ్ల క్రితం చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-21 08:35 GMT

టాలీవుడ్ నటి సమంత ప్రస్తుతం తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తల్లి అయిన ఆనందంలో ఉన్న ఆమెకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులకు నవంబర్ 19న మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సమంత స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు, తమ కుమారుడికి 'దేవ్' అని పేరు పెట్టినట్లు కూడా వెల్లడించారు.

సమంత తన కుమారుడికి పెట్టిన దేవ్' పేరు కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా కొంతమంది సెలబ్రిటీ జంటలు తమ పేర్లలోని అక్షరాలను కలిపి పిల్లలకు పేర్లు పెడుతుంటారు. కానీ సమంత, రాజ్ మాత్రం తమ బిడ్డకు దేవ్ అనే పేరును ఎంచుకున్నారు. ఈ పేరు వెనుక ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? కుటుంబ సంప్రదాయాలకు సంబంధించినదా? అనే డిస్కషన్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అయితే చాలా రాజ్ ఫ్యామిలీ దేవుడు, జాతకాలు నమ్ముతారు కాబటి, అవి అన్ని చూసే ఈ పేరు పేటి ఉండచ్చు అని కామెంట్స్ పెడుతూ ఉన్నారు..

ఇక ఇప్పుడు సమంతకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 12 ఏళ్ల క్రితం ఆమె గురించి ఓ పండితుడు చెప్పిన జోస్యం ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.

2014లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసిన 'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాను' కార్యక్రమానికి సమంత అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో షోలో పాల్గొన్న ఓ పండితుడు ఆమె భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు చెప్పారు. సమంతకు ఇద్దరు సంతానం కలుగుతారని, మొదటి సంతానంగా మగబిడ్డ జన్మిస్తాడని ఆయన అప్పట్లో జోస్యం చెప్పారు. అయితే ఆ సమయంలో ఈ మాటలు సాధారణంగానే కనిపించాయి. కానీ ఇప్పుడు సమంతకు నిజంగానే మగబిడ్డ జన్మించడంతో ఆ పాత వీడియో మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

12 ఏళ్ల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు నిజం కావడంతో నెటిజన్లు ఈ వీడియోపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. గతంలో నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత, ఆ తర్వాత ఆయన నుంచి విడిపోయారు. అనంతరం 2025లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆమె జీవితంలో మరో సంతోషకరమైన ఘట్టం మొదలైంది.

Tags:    
  • samantha 
  • samantharuthprabhu 
  • samanthababyboy 
  • dev 
  • rajnidimoru 

Similar News

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...

2026-11-21 08:38 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

2026-11-21 08:35 GMT

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

2026-11-21 08:35 GMT

పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!

2026-11-21 07:30 GMT

తండ్రిని మించిన‌ సూప‌ర్ స్టార్ల‌గా యాత్ర‌-లింగ‌!

2026-11-21 06:38 GMT

అత్యంత పిరికి జేమ్స్ బాండ్ గా కొత్త బాండ్!

2026-11-21 06:34 GMT

ఆలియా భట్‌కు ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి!

2026-11-21 06:33 GMT

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. సంచలన కామెంట్స్ చేసిన ఉపాసన

2026-11-21 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS