మట్టి వాసన తగిలితే చాలు బాక్సాఫీస్ కలెక్షన్స్ పరుగులు పెడుతున్నాయా?

సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో జానర్ సినిమాలకు ఆదరణ దక్కుతుంది. ప్రేక్షకుల అభిరుచిని బట్టి వాళ్లకు ఎప్పుడు ఏ సినిమాలు నచ్చుతాయో చెప్పడం చాలా కష్టం.

Update: 2026-09-29 16:30 GMT

సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో జానర్ సినిమాలకు ఆదరణ దక్కుతుంది. ప్రేక్షకుల అభిరుచిని బట్టి వాళ్లకు ఎప్పుడు ఏ సినిమాలు నచ్చుతాయో చెప్పడం చాలా కష్టం. ఏదైతే ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధిస్తుందో అప్పటి నుంచి ప్రేక్షకులు సైతం అదే జానర్ లో అలాంటి కథలతో వచ్చే సినిమాలను ఆదరిస్తుంటారు. అందుకే మన స్టార్ హీరోలు దర్శకులు సైతం సక్సెస్ ఫార్ములాని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఎప్పుడైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'రంగస్థలం' సినిమా వచ్చిందో అప్పటినుంచి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలకి మంచి క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా మట్టి వాసన తగిలితే చాలు బాక్సాఫీస్ కలెక్షన్స్ పరుగులు పెడుతున్నాయనేది వాస్తవం... రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమా చేసిన తర్వాత అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా చిత్తూరు యాసలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు చూసిన ప్రతి ఒక్కరు అతని నటనకు ఫిదా అయిపోయారు. పుష్ప మొదటి పార్ట్ లో నటించినందుకు గాను అతనికి నేషనల్ అవార్డు రావడం విశేషం...

ఆ తర్వాత ' బలగం ' లాంటి చిన్న మూవీ వచ్చి పెద్ద ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది... నాని సైతం మొదటి సారి మాస్ అవతారమెత్తి చేసిన 'దసర' సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. ఈ మూవీతో నాని 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇక దానికి తోడుగా మాస్ హీరోగా మారాలనుకునే తన కోరిక కూడా ఫలించింది... ఇక ఈ సంవత్సరం అక్కినేని అఖిల్ సైతం 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా రాయలసీమ యాసతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మొత్తానికైతే అఖిల్ తన కెరీర్ లో మొదటి సారీ భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి.

రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కథలకు ఆదరణ దక్కుతుంది. కాబట్టి దర్శకులు హీరోలు ఇలాంటి స్టోరీల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. సినిమాలున్సకేస్ అయినంతవరకు బాగానే ఉంటుంది కానీ రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ సంఖ్యలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో మట్టి కథలు రావడం వల్ల అలాంటి కథలు సైతం ప్రేక్షకులకు బోర్ కొట్టించే అవకాశమైతే ఉంది. కాబట్టి మరోసారి ట్రెండ్ సెట్టింగ్ సినిమా రావాల్సిన అవసరమైతే ఉంది...

Tags:    

Similar News