దేశముదురు బ్యూటీ చివరి ప్రయత్నం

Update: 2020-06-22 08:50 GMT
ఈ మద్య కాలంలో హీరోయిన్స్‌ లేదా నటీనటులు సినిమాల్లో ఆఫర్లు లేకుంటే వెబ్‌ సిరీస్‌ లపై దృష్టి సారిస్తున్నారు. అక్కడ నటిస్తూ ఆర్థికంగా కుదుటపడుతూ మళ్లీ సినిమాలు చేసుకోవాలనేది చాలా మంది ఆలోచన. అందుకే పలువురు హీరోయిన్స్‌ ఓటీటీ దారి పట్టారు. ఇప్పుడు అదే దారిలో దేశముదురు ముద్దుగుమ్మ హన్సిక కూడా వెబ్‌ సిరీస్‌ ల్లో నటించేందుకు సిద్దం అవుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

భాగమతి చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న అశోక్‌ దర్శకత్వంలో ఒక వెబ్‌ సిరీస్‌ తెరకెక్కబోతుంది. ఆ వెబ్‌ సిరీస్‌ లో హన్సిక నటించబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ కోసం అశోక్‌ దర్శకత్వం లో భారీ బడ్జెట్‌ తో వెబ్‌ సిరీస్‌ నిర్మాణం జరుగుతోంది. తన భాగమతి చిత్రం తరహాలోనే సస్పెన్స్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ గా ఈ వెబ్‌ సిరీస్‌ ను రూపొందించనున్నాడట.

ఈ వెబ్‌ సిరీస్‌ ను ఎక్కువ శాతం రాత్రి సమయాల్లో చిత్రీకరించనున్నారట. హన్సిక విభిన్నమైన పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. ఈమద్య కాలంలో హీరోయిన్‌ గా అవకాశాలు లేక పోవడంతో హన్సిక ఇలా వెబ్‌ సిరీస్‌ ల దారి పట్టింది. పేరున్న దర్శకుడు అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌ అవ్వడం తో హన్సిక చాలా ఆశలు పెట్టుకుంది. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ ఏ ఓటీటీ పై ప్రసారం కాబోతుంది అనే విషయం అధికారికంగా వెళ్లడి కాబోతుంది. తెలుగు తో పాటు తమిళం లో కూడా ఈ వెబ్‌ సిరీస్‌ ను స్ట్రీమింగ్‌ చేయనున్నారట.
Tags:    

Similar News