అల్ట్రా స్లిమ్ 'తారక్'.. మళ్లీ బరువు పెరగక తప్పదా?
సూపర్ హిట్ అయిన దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర తెరకెక్కనుంది. ఆ సినిమాలో తారక్ పవర్ ఫుల్, మస్క్యులర్ లుక్ కనిపించాల్సి ఉంటుంది.;
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే డెడికేషన్ కు మరో పేరు. ప్రతి సినిమాకు రోల్ ఎలా ఉంటే అలా తన బాడీని మార్చుకోవడం ఆయన స్పెషాలిటీ అని చెప్పాలి. లుక్, బాడీ లాంగ్వేజ్, ఫిట్ నెస్ ప్రతి విషయంలో ఫ్రెష్ నెస్ ను చూపిస్తూ ప్రేక్షకులకు షాక్ ఇస్తుంటారు. ఇప్పుడు అదే సమయంలో మరోసారి తన ఫిజిక్ తో వార్తల్లో నిలిచారు తారక్.
ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. ఆ మూవీ కోసం ఎన్టీఆర్ పూర్తిగా స్లిమ్ లుక్ లోకి మారిపోయారు. గత చిత్రాలతో పోలిస్తే బరువు తగ్గి, చాలా లీన్ గా కనిపిస్తున్నారు. ఇటీవల బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
తారక్ ఆ రేంజ్ లో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడాన్ని చూసిన ఫ్యాన్స్ ఆయన కమిట్మెంట్ ను మెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. డ్రాగన్ పూర్తయ్యాక తారక్ మళ్లీ బరువు పెరగాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది. కారణం ఆయన తదుపరి ప్రాజెక్ట్. డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్.. తన లైనప్ లోని దేవర -2 చేయనున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
సూపర్ హిట్ అయిన దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర తెరకెక్కనుంది. ఆ సినిమాలో తారక్ పవర్ ఫుల్, మస్క్యులర్ లుక్ కనిపించాల్సి ఉంటుంది. దేవర తొలి భాగంలో ఆయన కండలు తిరిగిన శరీరంతో, రఫ్ అండ్ మాస్ అవతార్ లో అలరించారు. ఆ లుక్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. యాక్షన్ సీన్స్ లో ఆయన చూపిన ఫిజికల్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకుంది.
ఇప్పుడు సీక్వెల్ కాబట్టి అదే స్థాయి బాడీ కొనసాగించాల్సి ఉంటుంది. దీంతో మళ్లీ జిమ్ లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ బరువు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో దేవర 2 మూవీ షూటింగ్ 2026 సెకండాఫ్ లో స్టార్ట్ అవ్వనుందని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా పూర్తి చేస్తున్నారని టాక్. ఎన్టీఆర్ డేట్స్ ఫైనల్ అయ్యే వరకు ఆయన అవసరం లేని సన్నివేశాలు ముందుగా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తర్వాత తారక్ జాయిన్ అయ్యాక అసలు సీన్స్ ను చిత్రీకరించనున్నారు!
అయితే స్టోరీ పరంగా, దేవర మూవీ రెండో భాగం కీలకమని దర్శక నిర్మాతలు ముందే ప్రకటించారు. మొత్తానికి తారక్ కు మరోసారి ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ తప్పదన్న మాట. ఒక సినిమా కోసం తగ్గి, మరో మూవీ కోసం పెరగడం అంటే సాధారణ విషయం కాదు. కానీ పాత్ర కోసం ఎంతైనా కష్టపడటంలో ఎన్టీఆర్ ముందుంటారు. అందుకే ఆయనను అభిమానులు మ్యాన్ ఆఫ్ డెడికేషన్ అని పిలుస్తుంటారు.