బాలీవుడ్ కి భిన్నంగా టాలీవుడ్ లో సీన్ రివ‌ర్స్!

అంత‌కు ముందే ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న‌ది ప్ర‌సారం జ‌రిగిపోతుంటుంది. ఎందుకంటే ఇదంతా వాళ్ల చేతుల్లో ప‌నే.;

Update: 2026-03-01 05:22 GMT

బాలీవుడ్ లో ఎలాంటి సినిమా అయినా స‌రే థియేట్రిక‌ల్ రిలీజ్ అనంత‌రం ఎనిమిది వారాల త‌ర్వాతే ఓటీటీలో రిలీజ్ అవ్వాలి. ఈ కండీష‌న్ అక్క‌డ అంతా తూచ త‌ప్ప‌కుండా పాటిస్తారు. చిన్న సినిమా అయినా ...పెద్ద సినిమా అయినా స‌రే ఈ నిబంధ‌న‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఎగ్జిబిట‌ర్లు త‌ర్వాత సినిమా రిలీజ్ కు థియేట‌ర్లు ఇవ్వ‌రు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కేవ‌లం వారి చేతుల్లోనే 70 శాతం రెవెన్యూ ఉంటుంది. ఎందుకంటే ఉత్త‌రాదిన ఎగ్జిబిట‌ర్లు వేరు..నిర్మాత‌లు వేరు కావ‌డంతోనే? మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌న్నీ ఈ రూల్ ను త‌ప్ప పాటిస్తున్నాయి. ఇంత క‌ఠినంగా ఉన్నారు కాబ‌ట్టే థియేట‌ర్లో బాలీవుడ్ సినిమాకు లాంగ్ ర‌న్ సాద్య‌మ‌వుతుంది.

ఇటీవ‌లే రిలీజ్ అయిన `ధురంద‌ర్` తొలి భాగం ఒక్క భాష‌లో రిలీజ్ అయి 1300 కోట్ల వ‌సూళ్లు సాధించిందంటే కార‌ణం థియేట్రిక‌ల్ గా అంత స్ట్రాంగ్ గా ఉండ‌టంతోనే సాధ్య‌మైంది. చిన్న సినిమాలు కూడా 200-300 కోట్ల వ‌సూళ్లు సాధిస్తున్నాయ‌న్నా? కార‌ణం అదే అన్న‌ది కాద‌న‌లేని నిజం. కానీ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌న్నివేశం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్క‌డ ఎగ్జిబిట‌ర్లు, నిర్మాత‌లు, బ‌య్య‌ర్లు అన్నీ సొంత మ‌నుషులే కావ‌డంతో? మొత్తం థియేట్రిక‌ల్ వ్య‌వ‌స్థే అస్త‌వ్య‌స్తంగా ఉంటుంది. వీళ్లే నిర్మాత‌లు, ఎగ్జిబిటర్ల‌గా , పంపిణీ దారులుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

తెలుగు సినిమా అవ‌స‌రాన్ని బ‌ట్టి థియేట్రికల్ రిలీజ్ అనంత‌రం ఓటీటీలో రిలీజ్ అయిపోతుంటుంది. ఎనిమిది వారాల కండీష‌న్ అన్న‌ది ఇక్క‌డ క‌ఠినంగా అమ‌లు ప‌ర‌చాల‌ని ఉంది. కానీ ఆ కండీష‌న్ పేరుకే ప‌రిమితం.

ఇక్క డ ఎవ్వ‌రూ ఆ రూల్ ను పాటించ‌రు. అడ్డ‌గోలుగా టికెట్ ధ‌ర‌లు పెంచుతుంటారు. రిలీజ్ అయిన వారంలోనే వంద‌ల కోట్లు వ‌సూళ్లు సాధించాల‌నే అత్యాశ క‌న‌బ‌రుస్తారు. సినిమా బాగుంటే ప‌ర్వాలేదు. ఆ సినిమా థియేట‌ర్లో కొన్ని రోజుల వ‌ర‌కూ క‌నిపిస్తుంది. లేదంటే? రిలీజ్ అయిన రెండు..మూడు రోజుల‌కే థియేట‌ర్ల నుంచి తొల‌గిస్తారు.

అంత‌కు ముందే ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న‌ది ప్ర‌సారం జ‌రిగిపోతుంటుంది. ఎందుకంటే ఇదంతా వాళ్ల చేతుల్లో ప‌నే. అవ‌స‌రాన్ని బ‌ట్టి థియేట‌ర్ల‌ను బ్లాక్ చేయ‌డం..అన్ బ్లాక్ చేయ‌డం జ‌రుగుతుంది. బాలీవుడ్ సినిమా అంటే ప్లెక్సీ టికెట్ రేట్లు ఉండాయి. కానీ ఇక్క‌డ మాత్రం 1000-2000 అంటూ ఓ ర‌క‌మైన దోపీణి కి య‌త్నిస్తుంటారు. అదే ఎగ్జిబిటర్ వేరుగా..నిర్మాత వేరుగా ఉంటే? ఈ స‌న్నివేశం ఎదుర‌య్యేది కాదు. బాలీవుడ్ త‌రహాలో సినిమాకు ఇక్క‌డా లాంగ్ ర‌న్ కు అవ‌కాశం ఉండేది. సినిమాను 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేస్తామంటే ఇచ్చే రేటు కంటే, 3 లేదా 4 వారాల్లోనే ఇస్తామంటే ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నాయి.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా? ముందుగానే ఓటీటీ నుంచి భారీ ఆదాయం వస్తే రిస్క్ తగ్గుతుందని ఇక్క‌డ‌ నిర్మాతలు షార్ట్ విండో డీల్స్‌కు మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతం ఏ పెద్ద సినిమా అయినా మొదటి వారం లేదా 10 రోజుల్లోనే మెజారిటీ వసూళ్లను రాబట్టేస్తోంది. ఆ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. థియేటర్ల రెంట్, మెయింటెనెన్స్ భారం కాకూడదని, థియేటర్లలో కలెక్షన్లు తగ్గగానే వెంటనే ఓటీటీలోకి రిలీజ్ చేసి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. ఒకవేళ సినిమాకు నెగటివ్ టాక్ వస్తే, థియేటర్లలో జనాలు రావడం ఆగిపోతుంది.

అటువంటి సమయంలో 8 వారాల వరకు ఆగడం వల్ల సినిమాపై ఉన్న ఆసక్తి పూర్తిగా స‌న్న‌గిల్లుతుంది. అందుకే ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలను వీలైనంత త్వరగా ఓటీటీలోకి తెచ్చి నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు.

అలాగే సినిమా విడుదలైన గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్లు పైరసీ వెబ్‌సైట్లలో వచ్చేస్తున్నాయి. 8 వారాల పాటు థియేటర్లలోనే ఉంచితే, జనాలు పైరసీలో చూసే ప్రమాదం ఉంది. ఇది టాలీవుడ్ కు కోలుకోలేని దెబ్బ‌గా మారుతోంది. రిస్క్ తీసుకోవ‌డం కంటే? అధికారికంగా ఓటీటీలో రిలీజ్ చేస్తే కనీసం సబ్‌స్క్రిప్షన్లు అయినా పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు.

ఆడియ‌న్స్ కూడా బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఉన్న సినిమాలను మాత్రమే థియేటర్లలో చూస్తున్నారు. చిన్న సినిమాలు లేదా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను ఎలాగో ఓటీటీలోకి వస్తుంది కదా.. అప్పుడే చూద్దాం అనే ఆలోచ‌న‌లో కొంద‌రుంటున్నారు. ఈ ట్రెండ్‌ను గమనించిన నిర్మాతలు కూడా వెయిట్ చేయకుండా ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. ఓటీటీల వల్ల నిర్మాతలకు సేఫ్ గేమ్ ఆడే అవకాశం దొరికినప్పటికీ, దీనివల్ల థియేటర్ల వ్యవస్థ దెబ్బతింటోందని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొన్ని పెద్ద సినిమాల విషయంలో మాత్రం ఇప్పటికీ 8 వారాల నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఫిల్మ్ ఛాంబర్ ప్రయత్నిస్తోంది.

Tags:    

Similar News