• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏఐ డీప్‌ఫేక్‌తో శ్రుతి...

ఏఐ డీప్‌ఫేక్‌తో శ్రుతి హాసన్‌కు షాక్.. హైకోర్టుకు హీరోయిన్!

| శృతి హాసన్ తన పేరు, ఫోటోలు, వీడియోలను ప‌ర్మిష‌న్ లేకుండా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలతో బాంబే హైకోర్టును ఆశ్రయించడం సినీ ఇండ‌స్ట్రీలో ఏఐ డీప్‌ఫేక్ దుర్వినియోగంపై మరో కీలక చర్చకు దారితీసింది.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2026-08-03 18:23 GMT

శృతి హాసన్ తన పేరు, ఫోటోలు, వీడియోలను ప‌ర్మిష‌న్ లేకుండా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలతో బాంబే హైకోర్టును ఆశ్రయించడం సినీ ఇండ‌స్ట్రీలో ఏఐ డీప్‌ఫేక్ దుర్వినియోగంపై మరో కీలక చర్చకు దారితీసింది. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీల ఫేసెస్ ను మార్ఫ్ చేసి తప్పుడు వీడియోలు సృష్టించడం, వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వైరల్ చేయడం, వాణిజ్య ప్రయోజనాల కోసం వారి ఇమేజ్‌ను ఉపయోగించడం వంటి అంశాలను ఆమె పిటిషన్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

తనకు కొందరు నటులతో సంబంధాలున్నట్లుగా చూపిస్తూ ఏఐతో రూపొందించిన వీడియోలు ప్రచారంలోకి వచ్చాయని, కొన్ని ఫోటోలను అసభ్యకరంగా మార్ఫ్ చేసి స్ప్రెడ్ చేస్తున్నార‌ని శృతి కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ కంటెంట్ తన ప‌ర్స‌న‌ల్ రైట్స్, పబ్లిసిటీ రైట్స్, ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని ఆమె వాదిస్తున్నట్లు తెలిస్తోంది.

ఈ వ్యవహారంలో సోషల్ మీడియా మరియు వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ల పాత్రను కూడా శృతి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, పింటరెస్ట్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ల‌పై తన పేరుతో ప్రచారంలో ఉన్న ఫేక్, డీప్‌ఫేక్ కంటెంట్‌ను తొలగించడంతో పాటు, దాని వ్యాప్తిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఆమె కోరినట్లు సమాచారం.

ఇదే సమయంలో, తన ప‌ర్మిష‌న్ లేకుండా తన పేరు, ఫోటోలతో పోస్టర్లు విక్రయిస్తున్న సంస్థపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో సెలబ్రిటీల ఫోటోల‌ను ఉపయోగించి వస్తువుల‌ను అమ్మ‌డం కూడా పబ్లిసిటీ రైట్స్ ఉల్లంఘన కింద పరిగణించాలనే వాదన ఈ కేసులో ప్రాధాన్య‌త‌ను సంతరించుకుంది.

ఇటీవలి కాలంలో భారతీయ సినీ ప్రముఖులు తమ పేరు, డిజిటల్ గుర్తింపును దుర్వినియోగం కాకుండా రక్షించేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. డీప్‌ఫేక్ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత గుర్తింపు, వాణిజ్య వినియోగ హక్కులు, డిజిటల్ భద్రత వంటి అంశాలపై న్యాయవ్యవస్థ స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. శృతి హాసన్ పిటిషన్ కూడా అదే దిశలో ఒక ముఖ్యమైన న్యాయపరమైన అడుగుగా పరిశీలించబడుతోంది.

Tags:    
  • shrutihaasan 
  • aideepfake 
  • deepfakecontroversy 
  • digitalrights 
  • privacyrights 
  • artificialintelligence 

Similar News

టాప్ స్టోరి: ఈ ఇద్ద‌రు నేపోకిడ్స్ ప‌రిస్థితేంటి?

2026-11-22 12:30 GMT

ఈసారి రాజమౌళి ప్లాన్ ఎలా ఉందంటే..

2026-11-22 11:45 GMT

గ్లోబల్ రిలీజ్‌కు వారణాసి మాస్టర్ ప్లాన్!

2026-11-22 11:39 GMT

మెల్లగా పాత లుక్‌లోకి వస్తున్న డార్లింగ్..

2026-11-22 11:39 GMT

సౌత్ బాక్సాఫీస్ పై 'రామాయణం' జోరు.. మొదటిసారి ఇలా..

2026-11-22 11:37 GMT

శర్వానంద్‌కు జాక్‌పాట్.. భోగికి లైన్ క్లియర్ చేసిన ఇద్దరు రష్మిక, బెల్లంకొండ!

2026-11-22 11:37 GMT

రూట్ మార్చిన నితిన్.. ఈసారి తన స్ట్రెంగ్త్ మీదే నమ్మకం!

2026-11-22 11:36 GMT

భారీ అంచనాలతో వచ్చి.. నెలలోనే ఓటీటీ బాట!

2026-11-22 11:35 GMT

సాయి అభ్యంకర్.. బన్నీ సినిమాకు ఇదే అసలు టెన్షన్!

2026-11-22 11:28 GMT

నాగచైతన్య లైఫ్ ఫిలాసఫీ.. సమస్యలపై అక్కినేని హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

2026-11-22 11:26 GMT

శ్రీ విష్ణు సేఫ్ గేమ్ వెనుక అసలు లెక్క ఇదే!

2026-11-22 11:25 GMT

రెండు ఔట్.. శర్వాకు ఇదే బెస్ట్ చాన్స్

2026-11-22 11:21 GMT

Copyright @2026

Powered by Blink CMS