శూర్పణఖపై ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందా?

పురాణ కథల్లో కొన్ని పాత్రలు తరతరాలుగా ఒకే కోణంలో ప్రజల మదిలో నిలిచిపోయాయి.

Update: 2026-08-03 18:31 GMT

పురాణ కథల్లో కొన్ని పాత్రలు తరతరాలుగా ఒకే కోణంలో ప్రజల మదిలో నిలిచిపోయాయి. అలాంటి పాత్రల్లో శూర్పణఖ ఒకటి. సాధారణంగా రామాయణాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఆమె పేరు ఒక కీలక సంఘటనతోనే ఎక్కువగా అనుసంధానమవుతుంది. అయితే ఆధునిక మైథాలజీ సినిమాలు పురాణ పాత్రలను కొత్త దృష్టితో చూడటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, శూర్పణఖ పాత్రను కూడా మరింత ఎమోష‌న‌ల్ గా, అంతర్గత సంఘర్షణలతో చూపించే అవకాశం ఉందనే డిస్క‌ష‌న్ సినీ వర్గాల్లో పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో రామాయ‌ణ‌లో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రను పోషించడం ఆసక్తికర అంశంగా మారింది. తాను ఆ పాత్ర‌ను ఒప్పుకుంది ఛాలెంజింగ్ గా అనిపించే అని, ఆ పాత్ర‌లో ఎంతో ఎమోష‌న్ ఉంద‌ని, సినిమా చూశాక ఆడియ‌న్స్ ఈ పాత్రను చూసే దృష్టి పూర్తిగా మారుతుంద‌ని న‌మ్మ‌కం వ్య‌క్తం చేసింది. అయితే ర‌కుల్ ఈ పాత్ర ద్వారా ప్రేక్షకుల సంప్రదాయ అభిప్రాయాలను మార్చగలదా అనే ప్రశ్న కూడా సహజంగానే ఎదురవుతోంది. ఎందుకంటే ఒక పురాణ పాత్రపై ఉన్న స్థిరమైన అభిప్రాయాన్ని మార్చడం మామూలు యాక్టింగ్ తో సాధ్య‌ప‌డ‌దు. ఆ పాత్రలోని మానసిక స్థితి, భావోద్వేగాలు, నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను విశ్వసనీయంగా ఆవిష్కరించాల్సి ఉంటుంది.

మైథాలజీ సినిమాల్లో యాక్టింగ్ సవాళ్లు కూడా ఇక్కడే మొద‌ల‌వుతాయి. ఆధునిక పాత్రలతో పోలిస్తే పురాణ పాత్రలకు ప్రత్యేకమైన భాష, ఎక్స్‌ప్రెష‌న్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ అవసరం. ఆడియ‌న్స్ ఇప్పటికే ఆ పాత్రకు ఒక ఊహాజనిత రూపాన్ని కలిగి ఉంటారు. ఆ అంచనాలను దెబ్బతీయకుండా, అదే సమయంలో కొత్త కోణాన్ని నమ్మించేలా యాక్ట్ చేయ‌డం ఎంతో కష్టమైన ప్రాసెస్. అందుకే మైథాలజీ సినిమాల్లో నటీనటుల ఎమోషనల్ ప్రిపరేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

ఇటీవలి కాలంలో ప్రపంచ సినీ పరిశ్రమలో కూడా సంప్రదాయ విలన్ పాత్రలను మానవీయ కోణంలో చూపించే ధోరణి పెరిగింది. దాని వెనుక ఉన్న వ్యక్తిగత బాధలు, ఆకాంక్షలు, అవమానాలు, ఎమోష‌న్స్ ను పరిశీలించే కథనాలు ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అదే విధానాన్ని శూర్పణఖ పాత్రకు కూడా వర్తింపజేస్తే, ఆమెను కేవలం విల‌న్ గా కాకుండా ఒక విషాదభరిత వ్యక్తిగా చూసే అవకాశం ఉంది. అయితే ఈ ఛేంజ్ పూర్తిగా రకుల్ యాక్టింగ్ పైనే డిపెండ్ అవ‌దు. కథా రచన, పాత్ర రూపకల్పన, డైరెక్ష‌న్, సంభాషణలు.. ఇవన్నీ కలిసి పనిచేయాలి. అయినప్పటికీ, ప్రేక్షకులు ముందుగా అంగీకరించేది తెరపై కనిపించే యాక్టింగ్‌నే. ఆ పాత్రలోని ఎమోష‌న్‌ను రకుల్ బలంగా వ్యక్తీకరించగలిగితే, శూర్పణఖపై ఉన్న సంప్రదాయ దృక్పథంలో కొంత మార్పు తీసుకురావడం అసాధ్యం కాదు. రిలీజ్ త‌ర్వాత శూర్పణఖ గురించి జరిగే డిస్క‌ష‌న్స్ ఈ పాత్రకు కొత్త అధ్యాయం రాస్తాయా లేదా అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News