ఆ నలుగురు.. రిస్కా? నమ్మకమా?

కంటెంట్ పరంగా కొత్తదనం, గ్రాండ్ మేకింగ్, భారీ యాక్షన్ సన్నివేశాలతో సినిమా రూపొందుతోంది. నాగచైతన్య కెరీర్‌ లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌ గా ఇది నిలిచే అవకాశముందని టాక్.;

Update: 2026-03-01 07:12 GMT

టాలీవుడ్‌ లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది! స్టార్ హీరోలే కాదు.. యంగ్ హీరోల సినిమాలకు కూడా నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో కథ మీద నమ్మకమా? మార్కెట్ మీద విశ్వాసమా? లేక రిస్క్ తీసుకునే ధైర్యమా? అన్న చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా నలుగురు యంగ్ హీరోల అప్‌ కమింగ్ సినిమాల బడ్జెట్లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

ఆ నలుగురు ఎవరంటే.. నిఖిల్ సిద్ధార్థ, సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య, నాని.. వారి అప్‌ కమింగ్ ప్రాజెక్టులు భారీ వ్యయంతో తెరకెక్కుతున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం స్వయంభూ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఆ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌ పై భువన్ సాగర్, శ్రీకర్ బసిరెడ్డి నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు.

 

సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌ ల కోసం నిర్మాతలు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారట. నిఖిల్ గత విజయాలు దృష్టిలో పెట్టుకుని సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటి గట్టు కూడా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతోంది. ఆ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్ పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.

 

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఆ సినిమాకు భారీ సెట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తేజ్‌ కు ఇది కెరీర్‌లో డిఫరెంట్ జానర్ సినిమా కావడంతో నిర్మాతలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టారట. ఇక నాగ చైతన్య హీరోగా వస్తున్న వృష కర్మ కూడా అదే బాటలో నడుస్తోంది. ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.

 

కంటెంట్ పరంగా కొత్తదనం, గ్రాండ్ మేకింగ్, భారీ యాక్షన్ సన్నివేశాలతో సినిమా రూపొందుతోంది. నాగచైతన్య కెరీర్‌ లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌ గా ఇది నిలిచే అవకాశముందని టాక్. అదే సమయంలో నాని నటిస్తున్న ప్యారడైజ్ ను చూసుకుంటే.. ఆ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలను ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ తీసుకుంది. కథకు తగ్గట్టే భారీ సెట్స్, టెక్నికల్ స్టాండర్డ్స్, ప్రమోషనల్ కంటెంట్‌ పై సుధాకర్ చెరుకూరి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

ఇలా నాలుగు సినిమాల భారీ బడ్జెట్ తో రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి. అయితే బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ ఎలా ఉంటుందన్నదే అసలు ప్రశ్న. మొత్తానికి నిర్మాతల ధైర్యం రిస్కా? లేక కథలపై ఉన్న నమ్మకమా? అనేది రిలీజ్ తర్వాత తేలనుంది. హిట్లు అయితే యంగ్ హీరోల మార్కెట్ మరింత పెరుగుతుంది. ఫ్లాప్ అయితే మాత్రం భారీ నష్టాలు తప్పవని చెప్పాలి. దీంతో నాలుగు సినిమాల రిజల్ట్ పై ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News