విజయ్ ను కొడుకు కూడా దూరం పెట్టడా.. ఇది నిజమేనా?

దీంతో ఆ అన్‌ ఫాలో వ్యవహారం నిజమా కాదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. దానిపై జేసన్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయితే అసలు క్లారిటీ వస్తుంది.;

Update: 2026-03-01 09:20 GMT

తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం వివాదాల మధ్య సాగుతుందని చెప్పాలి. కుటుంబ సమస్యలు ఒక్కసారిగా బయటకు రావడంతో ఆయన పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. అదే సమయంలో కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్ స్టాగ్రామ్ లో అన్‌ ఫాలో చేశాడన్న కొత్త ప్రచారం ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది.

ముఖ్యంగా విజయ్‌ కు వ్యక్తిగతంగా వరుస షాక్‌ లు తగులుతున్నాయనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది. కుటుంబ విభేదాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్‌ స్టాగ్రామ్‌ లో అన్‌ ఫాలో చేశాడన్న వార్త వైరల్ కావడంతో, తండ్రీకొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం జేసన్ అసలు విజయ్ అకౌంట్‌ ను ఎప్పుడూ ఫాలో కాలేదని వాదిస్తున్నారు. దీంతో ఆ అన్‌ ఫాలో వ్యవహారం నిజమా కాదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. దానిపై జేసన్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయితే అసలు క్లారిటీ వస్తుంది. ఏదేమైనా ఇప్పుడు జేసన్ అన్ ఫాలో చేశాడన్న విషయం మాత్రం చర్చనీయాంశం కావడం గమనార్హం.

అయితే ఇటీవల సంగీత విడాకుల కోసం తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం ఆ కేసును ఫ్యామిలీ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. పిటిషన్‌ లో చేసిన ఆరోపణలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమయ్యాయి. 2021లో ఓ నటితో విజయ్‌ కు వివాహేతర సంబంధం ఏర్పడిందని, ఆ సంబంధాన్ని తెంచుకుంటానని ఆయన హామీ ఇచ్చినా నెరవేర్చలేదని సంగీత ఆరోపించినట్లు సమాచారం.

ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి ప్రస్తుతం వేరువేరుగా జీవిస్తున్నామని, భార్యాభర్తల బంధానికి విజయ్ ద్రోహం చేశారని, అందుకే చట్టపరంగా విడాకులు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. ఆ పిటిషన్‌ పై విచారణ ఏప్రిల్ 20న జరగనుంది. ఆ రోజున విజయ్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది! విజయ్, సంగీత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

శ్రీలంక తమిళ మూలాలకు చెందిన సంగీత యునైటెడ్ కింగ్‌ డమ్‌ లో పెరగ్గా.. 1999లో విజయ్‌ ను వివాహం చేసుకున్నారు. పూవే ఉనక్కగా సినిమా సక్సెస్ ఈవెంట్ లో సంగీత.. విజయ్‌ ను తొలిసారి కలిసినట్లు టాక్ వినిపిస్తుంటోంది. ఆ తర్వాత విజయ్ ఆమెను తన ఇంటికి ఆహ్వానించి తన తల్లిదండ్రులకు పరిచయం చేశారు. 1999 ఆగస్టు 25న హిందూ విధానంలో వారి వివాహం జరిగింది. తర్వాత చెన్నైలో రిసెప్షన్ నిర్వహించారు. ఏదేమైనా విజయ్ కుటుంబ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో ఆ విషయంపై స్పష్టత రావాలంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News