యుద్ధాన్ని త‌ప్పు దారి ప‌ట్టించి చీవాట్లు తిన్న హీరోయిన్

వాస్తవానికి సోనాల్ ప్రస్తుతం దుబాయ్‌లోని పామ్ జుమేరా సమీపంలో ఉన్న ఒక లగ్జరీ హోటల్‌లో ఉన్నట్లు సమాచారం.;

Update: 2026-03-01 06:17 GMT

ఇరాన్ తో అమెరికా- ఇజ్రాయేల్ కూట‌మి వార్ నేప‌థ్యంలో దుబాయ్ లో సుర‌క్షితంగా ఉండి కూడా త‌ప్పుడు పోస్టులు చేసిన సోనాల్ చౌహాన్ చీవాట్లు తింటోంది. సోష‌ల్ మీడియాలో త‌న ఫాలోవ‌ర్స్ దుబాయ్ లో నివశించే ల‌క్ష‌లాది మంది తాము సుర‌క్షితంగా ఉన్నామ‌ని చెబుతుంటే సోనాల్ మాత్రం త‌న‌ను కాపాడాల‌ని భార‌త ఎంబ‌సీని, ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాని మోదీని సోష‌ల్ మీడియాల్లో ట్యాగ్ చేస్తూ ప్రాధేయ‌ప‌డింది..

 

నిజానికి ఇది సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్స్ కోసం ఇలా చేసిందా? వాస్త‌వం ఎలా ఉంది? సోనాల్ ఉన్న హోటల్ ప‌రిస‌రాల్లో ఏదైనా బాంబింగ్ లేదా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొందా? అస‌లు సోనాల్ ప్ర‌స్తుతం దుబాయ్ లోని ఏ హోట‌ల్ లో చిక్కుకుంది? అస‌లు సోనాల్ అక్క‌డికి ఎందుకు వెళ్లింది? అంటూ సెక‌న్ల వ్య‌వ‌ధిలో నెటిజ‌నుల‌ విచార‌ణ ప్రారంభ‌మైంది. ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

తప్పుదారి పట్టించినందుకు నెటిజన్ల చీవాట్లు!

పశ్చిమాసియాలో ఇరాన్ తో అమెరికా-ఇజ్రాయెల్ కూటమి వార్ ముదురుతున్న తరుణంలో యువ హీరోయిన్ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఒక ప్రైవేట్ ఈవెంట్ కోసం దుబాయ్‌ వెళ్ళిన సోనాల్ అక్కడ విమాన సర్వీసులు రద్దు కావడంతో తాను చిక్కుకుపోయానని.. తనను కాపాడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, భారత విదేశాంగ శాఖకు (ఎంఇఏ)ను ట్యాగ్ చేస్తూ ప్రాధేయపడింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు .. దుబాయ్‌లో ఉంటున్న భారతీయులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం లేదా సోషల్ మీడియా అటెన్షన్ కోసమే ఈ నాశిర‌కం న‌టి ఇలా అతిగా ప్రవర్తిస్తోందని సోషల్ మీడియా వేదికగా చీవాట్లు పెడుతున్నారు.

దుబాయ్‌లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులు తాము అక్కడ సురక్షితంగా ఉన్నామని.. జనజీవనం సాధారణంగానే ఉందని చెబుతుంటే.. సోనాల్ మాత్రం తాను ఏదో భారీ ప్రమాదంలో ఉన్నట్లు చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుబాయ్‌లో 30 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు... మీరు ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించి ఇలాంటి పోస్టులు చేయడం సరికాదు! అంటూ నెటిజన్లు క్లాస్ తీస్కున్నారు. దుబాయ్ సూపర్ సేఫ్ అని.. కేవలం టీఆర్పీ లేదా వైరల్ అవ్వడం కోసమే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారని కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు.

వాస్తవానికి సోనాల్ ప్రస్తుతం దుబాయ్‌లోని పామ్ జుమేరా సమీపంలో ఉన్న ఒక లగ్జరీ హోటల్‌లో ఉన్నట్లు సమాచారం. హోటల్ `ఫెయిర్‌మాంట్ ది పామ్` ప‌రిసరాల్లో బాంబు దాడులు జరిగినట్లు కొన్ని వార్తలు వచ్చినా కానీ.. అవి కేవలం గగనతలంలో క్షిపణులను అడ్డుకోవడం వల్ల పడిన శకలాల వల్ల జరిగిన చిన్నపాటి సంఘటనలేనని స్థానికులు చెబుతున్నారు. మెట్రో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ , కార్లు రోడ్లపై యధావిధిగా నడుస్తున్నాయని.. పరిస్థితి భయంకరంగా ఏమీ లేదని అక్కడి భారతీయులు ధృవీకరిస్తున్నారు. కానీ సోనాల్ మాత్రం తనను తక్షణమే ఎయిర్ లిఫ్ట్ చేయాలన్నట్లుగా వ్యవహరించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.

వాస్త‌వాలు వేరు మ్యాడ‌మ్:

సోనాల్ ఉన్న ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెబుతున్నా కానీ.. యూఏఈ ప్రభుత్వం ప్రజల భద్రతకు పూర్తి హామీ ఇస్తోందని దుబాయ్ వాసులు గుర్తు చేస్తున్నారు. ఇరాన్ కేవలం అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోందని, పర్యాటక ప్రాంతాలపై దాడులు జరగడం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో సోనాల్ తన వ్యక్తిగత భయాందోళనలను దేశవ్యాప్త సమస్యగా చూపించడమే కాకుండా.. భారత రాయబార కార్యాలయంపై అనవసర ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. కనీసం మీ ఫాలోవర్స్ చెబుతున్న వాస్తవాలను గమనించండి! అంటూ ఆమె కామెంట్ సెక్షన్‌లో నెటిజన్లు దూషిస్తున్నారు.

వ్య‌క్తిగ‌త స్వార్థంతోనే ఇలా:

మొత్తానికి యుద్ధవాతావ‌ర‌ణం అనే సున్నితమైన అంశాన్ని తన సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం లేదా వ్యక్తిగత ప్రయోజనం కోసం సోనాల్ లేదా ఇత‌ర క‌థానాయిక‌లు సెల‌బ్రిటీలు ఉప‌యోగించుకుంటే ఎలా ఉంటుందో ఈ ప‌రిణామం స్ప‌ష్ఠంగా చెబుతోంది. నిజంగానే విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బంది ఉన్న మాట వాస్త‌వం. కానీ ఇప్పుడే ఏమ‌వుతుందోన‌ని భ‌య‌పెట్టేయ‌డం స‌రికాద‌నేది అంద‌రి ఉద్ధేశం. దానిని ఒక జాతీయ విపత్తులాగా చిత్రీకరించడం సోనాల్ ఇమేజ్‌ను దెబ్బతీసింది. ``ప్రభుత్వంపై నమ్మకం ఉంచండి.. అనవసరంగా భయాందోళనలు సృష్టించకండి`` అంటూ నెటిజన్లు సోనాల్‌కి హితవు పలుకుతున్నారు. ఈ వివాదంపై సోనాల్ చౌహాన్ తిరిగి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News